భోగాపురం ఎయిర్ పోర్టు ఓపెనింగ్ కి డేట్ ఫిక్స్ ?

ఉత్తరాంధ్రకే తలమానికంగా నిలుస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఓపెనింగ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది.

Update: 2026-05-22 17:44 GMT

ఉత్తరాంధ్రకే తలమానికంగా నిలుస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఓపెనింగ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇప్పటికి మరో నలభై రోజులలో ఈ ఎయిర్ పోర్టుని ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వస్తున్నారు. ఈ ఎయిర్ పోర్టుని జూలై 5న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభిస్తారు అని అంటున్నారు. ఇక జూలై 8వ తేదీ నుంచి ఈ ఎయిర్ పోర్టు నుంచి ఆపరేషన్స్ స్టార్ట్ అవుతాయని చెబుతున్నారు.

అల్లూరి జయంతి వేళ :

భోగాపురం ఎయిర్ పోర్టుకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టారు. దాంతో అల్లూరి జయంతి రోజు జూలై 4న వస్తుంది. ఆ మరుసటి రోజు 5న ప్రధాని మోడీ ఈ ఎయిర్ పోర్టుని ప్రారంభించడం ద్వారా ఉత్తరాంధ్రకు బహుమతిగా అల్లూరికి నివాళిగా అలాగే ఏపీకి కూడా ఒక భారీ అభివృద్ధి ప్రాజెక్ట్ గా అందించబోతున్నారు. నూటికి తొంబై శాతం ఈ డేట్ ఫిక్స్ అవుతుందని అంటున్నారు. ఇక జూలై 8 నుంచి మొత్తం విమానాల రాకపోకలు అన్నీ భోగాపురం నుంచే సాగుతాయని అంటున్నారు. ఇప్పటికే అనేక విమాన యాన సంస్థలు తమ విమానాలను జూలై నుంచి భోగాపురం విమానాశ్రయం నుంచే నడుస్తాయని ప్రకటించాయి. అంతే కాదు తమ ప్రయాణీకులను కూడా భోగాపురం విమానాశ్రయానికే రావాలని కూడా సర్క్యులర్ జారీ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ క్రమంలో సింగపూర్ ఎయిర్ లైన్స్ సైతం తమ ప్రయాణీకులకు అడ్వైజరీ జారీ చేసినట్లుగా చెబుతున్నారు.

విశాఖ ఎయిర్ పోర్టు క్లోజ్ :

ఎపుడైతే భోగాపురం ఎయిర్ పోర్టు ఓపెన్ అవుతుందో ఆనాటి నుంచి విశాఖ ఎయిర్ పోర్టు క్లోజ్ అవుతుందని కూడా అంటున్నారు. ఈ ఎయిర్ పోర్టు నేవీ వారి ఆధీనమైన స్థలంలో ఉంది. దాంతో ఎప్పటి నుంచో ఆల్టర్నేషన్ గా కొత్త ఎయిర్ పోర్టు కావాలని ఉంది. భోగాపురంతో ఆ కొరత తీరిపోతుంది కాబట్టి విశాఖ నుంచి విమానాలు ఎగరడం అన్నది ఒక చరిత్ర గా మారుతుందని అంటున్నారు. దీంతోనే విశాఖ నుంచి కాకుండా భోగాపురం ఎయిర్ పోర్టుకే ప్రయాణికులు రావాలని ఆయా విమాన యాన సంస్థలు సర్క్యులర్ ని జారీ చేస్తున్నాయని అంటున్నారు.

కొత్త మంత్రి ఉంటారా :

ఇదిలా ఉంటే భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభం సమాయానికి పౌర విమానయాన మంత్రిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉంటారా లేక కొత్త మంత్రి ఆ శాఖకు వస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఎందుకంటే జూన్ లో కేంద్ర మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందని అంటున్నారు. అదే జరిగితే రామ్మోహన్ శాఖ మారుతుందని అంటున్నారు. మరి రెండేళ్ల పాటు ఈ ఎయిర్ పోర్టు విషయంలో ఫోకస్ పెట్టిన రామ్మోహన్ ఆ వేళకు ఆ శాఖ మంత్రిగా ఉంటేనే అందం అర్థం అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News