బ్రదర్స్ పాలిటిక్స్ తో జుత్తు పీక్కుంటున్న తమ్ముళ్ళు...!
బెజవాడ అంటే బెజవాడే మరి. రాజకీయం అట్టాగే ఉంటాది మరి. ఎందుకంటే బెజవాడ కాబట్టే. తెలుగుదేశం పార్టీకి బలమైన స్థావరం అయిన విజయవాడ రాజకీయాల్లో రచ్చ సాగుతుందని అంతా అనుకున్నారు.
బెజవాడ అంటే బెజవాడే మరి. రాజకీయం అట్టాగే ఉంటాది మరి. ఎందుకంటే బెజవాడ కాబట్టే. తెలుగుదేశం పార్టీకి బలమైన స్థావరం అయిన విజయవాడ రాజకీయాల్లో రచ్చ సాగుతుందని అంతా అనుకున్నారు. కానీ అదేమీ లేదని అంటున్నారు పార్టీ మేలు కోరుకునేవారు, హితులు, సన్నిహితులు. వంగవీటి రాధా పార్టీ మారుతారు అంటే ఆయన లోకేష్ పాదయాత్రలో ఆయన వెంట కనిపించారు. ఇక విజయవాడ ఎంపీ కేశినేని నాని లోకేష్ పాదయాత్రలో లేరు.
ఆయన పార్టీకి గుడ్ బై అని ఒక్క లెక్కన ప్రచారం సాగుతోంది. కానీ అది నిజం కాదని తేలిపోయింది. ఆయన పెదబాబు చంద్రబాబు వెంటే ఉంటున్నారు. లేటెస్ట్ గా చంద్రబాబు ఢిల్లీ వచ్చి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలసి ఏపీలో దొంగ ఓట్ల గురించి ఫిర్యాదు చేసినపుడు ఆయన వెంట ముగ్గురు టీడీపీ ఎంపీలూ ఉన్నారు. అందులో కేశినేని నాని కూడా ఉన్నారు.
ఆయన చంద్రబాబుతో టచ్ లోనే ఉన్నారు. అంతదాకా ఎందుకు ఆ మధ్యన ఆయన తన కుమార్తెకు వివాహం చేస్తే చంద్రబాబు సతీసమేతంగా హాజరయ్యారు. ఆ తరువాత వైసీపీ ప్రభుత్వం మీద గవర్నర్ కి బాబు ఫిర్యాదు చేసే పక్కనే ఉన్నారు. ఇపుడూ ఢిల్లీలో బాబుతోనే ఉన్నారు.
అంటే కేశినేని నాని తెలుగుదేశంకి దూరంగా లేరు అని అంటున్నారు. 2024లో టీడీపీ నుంచి టికెట్ రేసులో ఆయన కచ్చితంగా ఉంటారని అంటున్నారు. బాబు పట్ల గౌరవంతో ఉంటూ టీడీపీ పట్ల నిబద్ధతతో ఉంటున్న నానికి గ్యాప్ అంటూ ఉంటే అది బెజవాడ టీడీపీ లీడర్స్ తోనే అని అంటున్నారు. అంతమాత్రం చేత ఆయనకు టికెట్ రాకుండా ఉంటుందా అన్నది ఆయన అనుచరుల మాటగా ఉంది.
ఇక కేశినేని నాని సోదరుడు చిన్ని అయితే చినబాబు లోకేష్ వెంట ఉన్నారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో పాదయాత్ర మొత్తం భారం అంతా ఆయన మోసారు. అన్ని రకాలుగా ఆయన అండగా నిలబడ్డారు. ఆయనకు టీడీపీ లోకల్ లీడర్స్ ఫుల్ సపొర్ట్ గా నిలిచారు. దాంతో ఆయన విజయవాడ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. అయితే సిట్టింగ్ ఎంపీ అగ్రజుడు అయిన కేశినేని నాని చేయి దాటి ఈ సీటు చిన్నికి ఎలా వస్తుంది అన్నది ప్రశ్న.
నాని ఏమైనా తక్కువ వారా. చంద్రబాబు మన్ననలు పొందుతున్నారు. ఆయన పక్కన ఉంటూ సఖ్యతతో పార్టీ ప్రయాణం సాగిస్తున్నారు. దాంతో నానికే మళ్లీ టికెట్ అని అంటున్న వారూ లేకపోలేదు. మరి చిన్నిని ఆయనకు సపోర్ట్ ఇస్తున్న వారికి మాత్రం ఏంటీ ఈ బ్రదర్స్ పాలిటిక్స్ అన్నది అర్ధం కావడంలేదుట. 2024లో కేశినేని నానికే మళ్లీ టికెట్ ఇస్తే ఆయన్ని వ్యతిరేకిస్తున్న తమ్ముళ్ళు పరేషన్ కావాలిందేనా అన్న చర్చ కూడా సాగుతోంది.