ఉద్యోగం కావాలా? వివాహ బంధమా? భార్యకు 60 లక్షల జీతం ఆఫర్ చేసిన బిలియనీర్!

నేటి సమాజంలో డబ్బు, మానవ సంబంధాలు ఈ రెండే ప్రధానంగా ఉన్నాయి. వీటిచుట్టే లోకం తిరుగుతోంది.;

Update: 2025-12-07 20:30 GMT

నేటి సమాజంలో డబ్బు, మానవ సంబంధాలు ఈ రెండే ప్రధానంగా ఉన్నాయి. వీటిచుట్టే లోకం తిరుగుతోంది. అయితే వీటిని మేనేజ్ చేయడం చాలా కష్టం.. ఈరోజుల్లో డబ్బు, బంధాల మధ్య సంబంధం మరింత క్లిష్టంగా మారుతోంది. కొన్ని విచిత్రమైన ఆఫర్లు బయటకు వచ్చినప్పుడు అవి సమాజాన్ని ఆలోచనల్లోకి నెట్టేస్తాయి. అలాంటి ఒక సంచలన ఘటన తాజాగా ఇంగ్లండ్ లో చోటుచేసుకుంది. 79 ఏళ్ల వయసున్న బిలియనీర్ సర్ బెంజమిన్ స్లేడ్ తనకు భార్య కావాలంటూ ప్రకటనచేశాడు. అయితే ఇందులో షాక్ కలిగించే షరతులు ఉన్నాయి.

బెంజమిన్ కోరుకునే మహిళ తనకంటే 30 నుంచి 40 సంవత్సరాలు చిన్న వయసు ఉండాలి. అంతేకాదు తన సంపదకు వారసుడిగా కుమారుడిని ప్రసవించాలి. ఇదే కాదు ఆమెకు సంవత్సరానికి ఏకంగా రూ.60 లక్షల జీతం ఇవ్వడానికి కూడాసిద్ధమని ప్రకటించాడు. ఇది పెళ్లి ప్రతిపాదనా? లేక ఒప్పంద ఉద్యోగమా ? అనే సందేహం కలుగుతోంది.

సాధారణంగా పెళ్లి అంటే ప్రేమ, అనుబంధం, పరస్పర గౌరవం ఉంటాయి. కానీ ఇలాంటి ప్రతిపాదనల్లో భావోద్వేగాల కంటే షరతులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక్కడ భార్య అంటే అంటే జీవిత భాగస్వామి కాదు.. సంపదకు వారసుడిని అందించే బాధ్యతగా మాత్రమే మారిపోయినట్లుంది. ఈ ఆలోచన చాలా మందిని అసౌకర్యానికి గురిచేస్తోంది.

డబ్బుతో సంబంధాలను కొనుగోలు చేయవచ్చా? గౌరవం, సమ్మతి ఇలాంటి ఒప్పందాల్లో ఎంతవరకు ఉంటాయి? అనే ప్రశ్నలు బలంగా వినిపిస్తున్నాయి. కొందరు దీనిని ‘సూటిగా చెప్పిన ప్రాక్టికల్ ఆఫర్’ గా చూస్తుంటే.. మరికొందరు దీనిని దానిని దానంగా ముసుగు వేసుకున్ననియంత్రణగా విమర్శిస్తున్నారు.

సంపద ఉన్న చోట భావోద్వేగాల అర్థం కూడా మారిపోతుందా? ప్రేమ ఎక్కడ ముగుస్తుందన్నది ప్రశ్న.. సమాజంలో పెళ్లి , సంబంధాలు,డబ్బు మధ్య ఉన్న సున్నితమైన సంబంధాన్ని మరోసారి ఆలోచించేలాచేస్తోంది.

ఇలాంటి డీల్స్ వల్ల ప్రేమ ఎక్కడ ముగిస్తుంది.. ఒప్పందం ఎక్కడ మొదలవుతుందనే సందేహం మిమ్మల్ని వెంటాడుతుంది..

Tags:    

Similar News