వీధి కుక్కలకు మూడు పూటలా చికెన్ బిర్యానీ.. బెంగళూరులో వినూత్న ప్రయత్నం
వీధి కుక్కలకు సంబంధించి దేశంలోని మరే మహానగర కార్పొరేషన్ తీసుకొని కీలక నిర్ణయాన్ని బెంగళూరు మహా పాలిక తీసుకుంది.;
వీధి కుక్కలకు సంబంధించి దేశంలోని మరే మహానగర కార్పొరేషన్ తీసుకొని కీలక నిర్ణయాన్ని బెంగళూరు మహా పాలిక తీసుకుంది. గార్డెన్ సిటీలోని వీధి కుక్కల సంక్షేమం.. సంరక్షణ కోసం.. వాటి ఆకలి బాధ తీర్చేందుకు వినూత్న నిర్ణయాన్ని తీసుకుంది. వాటికి నిత్యం మూడు పూటల చికెన్ బిర్యానీ వడ్డించాలని డిసైడ్ అయ్యారు. ఇందుకోసం రూ.2.80 కోట్లతో ఒక పథకాన్ని తెర మీదకు తీసుకొచ్చారు.
ఒక అంచనా ప్రకారం బెంగళూరు మహానగరంలో మొత్తం 2.80 లక్షల వీధి కుక్కలు ఉన్నాయి. ఇందులో తొలి విడతగా ఐదు వేల వీధి కుక్కలకు ఒక్కో కుక్కకు రోజుకు 367 గ్రాముల చొప్పున చికెన్ బిర్యానీని అందించనున్నారు. మూడు పూటల చికెన్ బిర్యానీని వడ్డించేందుకు వీలుగా.. టెండర్లను ఆహ్వానించారు.
ఇప్పటికే వీధి కుక్కలకు నిత్యం ఆహారం.. నీరు.. వసతి సౌకర్యాల్ని కల్పిస్తున్న బెంగళూరు మహాపాలిక నిర్ణయం.. మిగిలిన మహానగర సంస్థలకు ఆదర్శం కావాల్సిన అవసరం ఉంది. తాజాగా అమలు చేయాలనుకున్న పథకంలో భాగంగా చికెన్ బిర్యానీని వడ్డిస్తారు. ఇందుకోసం 125 ప్రాంతాల్ని అధికారులు గుర్తించారు.