బెంగళూరు తొక్కిసలాట.. కొడుకు సమాధిని కౌగిలించుకుని తండ్రి రోదన వీడియో!
అవును... బెంగళూరులోని ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీలో ప్రాణాలు కోల్పోయినవారిలో ఒకరైన 21 ఏళ్ల భూమిక్ లక్ష్మణ్ తండ్రి బిటి లక్ష్యణ్ భావోద్వేగ వీడియో ఒకటి బయటకు వచ్చింది.;
బెంగళూరులోని చినస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ విజయోత్సవ వేడుకల సందర్భంగా జరిగిన తొక్కిసలాట తీవ్ర విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోగా సుమారు 47 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన భూమిక్ తండ్రి భావోద్వేగ వీడియో వెలుగులోకి వచ్చింది.
అవును... బెంగళూరులోని ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీలో ప్రాణాలు కోల్పోయినవారిలో ఒకరైన 21 ఏళ్ల భూమిక్ లక్ష్మణ్ తండ్రి బిటి లక్ష్యణ్ భావోద్వేగ వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇందులో... బిటీ లక్ష్మణ్ తన కొడుకు సమాధిని కౌగిలించుకొని ఏడుస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ సందర్భంగా.. తన కుమారుడికి జరిగినట్లు మరెవరికీ జరగకూడదంటూ ఆయన రోధిస్తున్నారు.
ఈ సందర్భంగా తాను ఎక్కడికీ వెళ్లాలనుకోవడం లేదని.. తాను తన కుమారుడి సమాధి వద్దే ఉండాలనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు ఆయనను పైకి లేపడానికి ప్రయత్నింస్తారు కానీ.. ఆయన బాధ, ఆవేదన స్పష్టంగా కనిపిస్తుంది! తాను చూసిన ఈ రోజు ఏ తండ్రీ చూడకూడదని ఆయన చెప్పారు.
నివేదికల ప్రకారం... భూమిక్ లక్ష్మణ్ ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నారు. ఆ సమయంలో స్టేడియం వెలుపల వేడుకల్లో పాల్గొనడానికి తన స్నేహితులతో పాటు వచ్చాడు. ఈ క్రమంలో తొక్కిసలాట జరగడమో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో లక్ష్మణ్ తో సహా 11 మంది మరణించిన సంగతి తెలిసిందే.
కాగా... ఈ వ్యవహారంపై సంబంధించి తొక్కిసలాటకు పోలీసులే బాధ్యులని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. అనంతరం.. పోలీస్ కమిషనర్ సహా పలువురు అధికారులను సస్పెండ్ చేశారు. తర్వాత.. కర్ణాటక ఐపీఎస్ అధికారి సీమంత్ కుమార్ సింగ్ ను బెంగళూరు కొత్త కమిషనర్ గా నియమించారు.