26 ఏళ్లు .. ఫాలోవర్లకు 26 కార్లు

ప్రపంచంలో అత్య‌ధిక ఫాలోవ‌ర్ల‌ను క‌లిగిన ప్ర‌ముఖ ఇన్‌ఫ్లూయెన్స‌ర్ మిస్ట‌ర్ బీస్ట్.

Update: 2024-05-08 09:05 GMT

మిస్టర్ బీస్ట్. సోషల్ మీడియాలో ఈ పేరు తెలియని వారు అరుదుగా ఉంటారనే చెప్పాలి. ప్రపంచంలో అత్య‌ధిక ఫాలోవ‌ర్ల‌ను క‌లిగిన ప్ర‌ముఖ ఇన్‌ఫ్లూయెన్స‌ర్ మిస్ట‌ర్ బీస్ట్.

2012లే 13 ఏళ్ల‌ వయస్సులో మిస్టర్ బీస్ట్ 6000 పేరిట మొద‌ట ఓ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాడు. అనంతరం బీస్ట్ రియాక్ట్స్, మిస్టర్ బీస్ట్ గేమింగ్, మిస్టర్ బీస్ట్ 2, దాతృత్వ ఛానెల్ బీస్ట్ ఫిలాంత్రోపీలను నడుపుతున్నాడు. అమెరికాకు చెందిన ఈ యూ ట్యూబర్ కు 254 మిలియన్ల ఫాలోవర్లు ఉండడం విశేషం.

తాజాగా 26 ఏళ్లు నిండిన మిస్టర్ బీస్ట్ తన ఫాలోవర్లకు బంపర్ అఫర్ ఇచ్చాడు. టెస్లా కంపెనీకి చెందిన 26 కార్ల‌ను తన పుట్టినరోజు సందర్భంగా బహుమతి‌గా ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. ఇన్ స్టా గ్రామ్ అధికారిక ఖాతాలో పోస్ట్ చేసిన వీడియో కింద కామెంట్ చేసిన వారిలో 26 మందిని ఎంపిక చేసి ఈ బహుమతులు ఇవ్వనున్నాడు.

Tags:    

Similar News