• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  వీడియో వైరల్‌... బార్ ...

వీడియో వైరల్‌... బార్ వద్ద ఫైట్ అంటే అమెరికాలో అయినా అంతే..?

| ఒక బార్ బయట పౌరులు - మెరైన్లు కొట్టుకున్న సంఘటన తాజాగా అమెరికాలో జరిగింది. కారణం ఏమిటన్నది స్పష్టంగా తెలియనప్పటికీ..

By - Tupaki Desk
Update: 2023-11-22 03:31 GMT

ఒక బార్ బయట పౌరులు - మెరైన్లు కొట్టుకున్న సంఘటన తాజాగా అమెరికాలో జరిగింది. కారణం ఏమిటన్నది స్పష్టంగా తెలియనప్పటికీ.. మొదలైంది మాత్రం ఒక మహిళతో అని ప్రాథమిక సమాచారం! బార్ కి వచ్చిన ఒక మహిళ.. అక్కడున్న మెరైన్ తో చేసిన ప్రవర్తన ఈ రచ్చకు కారణంగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

అవును... అమెరికాలోని ఓ బార్‌ బయట కొందరు పౌరులు - మెరైన్లకు మధ్య కొట్లాట జరిగింది. ఈ సమయంలో... బార్‌ కు వచ్చిన ఒక మహిళ అక్కడున్న ఓ మెరైన్‌ ఫోన్‌ ను నేలకేసి కొట్టడంతో ఈ పరిణామం చోటు చేసుకొందని తెలుస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు... పౌరులకే సూచనలు చేస్తుండటం గమనార్హం.

వివరాళ్లోకి వెళ్తే... కొందరు సిటిజెన్లు తాజాగా టెక్సాస్‌ లోని నైట్‌ క్లబ్‌ కి వెళ్లారు. ఆ సమయంలో బార్‌ ఒయట మెరైన్‌ బృందం నిలబడి ఉంది. ఈ సమయంలో అక్కడున్న ఒక అధికారితో ఓ మహిళ వాగ్వాదానికి దిగింది. అనంతరం ఆ ఆధికారి ఫోన్‌ ను లాక్కొని నేలకేసి కొట్టింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలవ్వగా... అంతలో ఓ వ్యక్తి తగుదునమ్మా అంటూ వచ్చి సదరు అధికారిపై చేయి చేసుకున్నాడు.

దీంతో... వెంటనే అక్కడున్న అధికారులంతా వచ్చి అతడిని అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే మెరైన్లు, పౌరుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకొంది. ఈ గొడవ ఏ స్థాయిలో జరిగిందంటే... రోడ్డుపై పడి ఒకరిపై మరొకరు దాడి చేసుకునేటంతగా! దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ సందర్భంగా ముందుగా అధికారిపై దాడిచేసిన ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. వైరల్‌ గా మారిన ఈ వీడియోపై నెటిజన్లు స్పందించారు. ఈ సందర్భంగా పౌరులకు పలు సూచనలు చేశారు. ఇది సరైన చర్య కాదని.. మన సాయుధ దళాలను మనమే గౌరవించుకోవాలని సూచించారు. ఇది సరైన చర్య కాదని అంటున్నారు. మరికొంతమంది మాత్రం... లోపల నాలుగు చుక్కలు పడితే అమెరికా అయినా అంతే..! అని సెటైర్స్ వేస్తున్నారు!

NEW: Group of Marines get into a fight with a group of men outside the Voodoo Room nightclub in Austin, Texas.

Don't mess with the Marines.

The incident started when an angry woman snagged a phone and threw it into the street. (She was later smacked on accident by one of the… pic.twitter.com/Fr9VD8lHjw

— Collin Rugg (@CollinRugg) November 19, 2023
Tags:    
  • Bar 
  • Fight 
  • Unitedstatesofamerica 
  • marines 
  • Girl 
  • Texas 
  • Police 
  • Citizens 

Similar News

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

Copyright @2026

Powered by Blink CMS