మళ్లీ ఇండియాపై పడి ఏడుస్తున్న యూనస్

బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ (ప్రధాన సలహాదారు) మొహమ్మద్ యూనస్ మరోసారి భారత్‌ను లక్ష్యంగా చేసుకుని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.;

Update: 2025-10-12 12:38 GMT

బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ (ప్రధాన సలహాదారు) మొహమ్మద్ యూనస్ మరోసారి భారత్‌ను లక్ష్యంగా చేసుకుని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తిరుగుబాటు ద్వారా అధికారాన్ని కైవసం చేసుకున్నప్పటి నుంచి భారత వ్యతిరేక వైఖరితో వ్యవహరిస్తున్న యూనస్, తాజా ప్రకటనలతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నారు. చైనా, పాకిస్తాన్‌లతో స్నేహాన్ని పెంచుకుంటూ, భారత్‌పై ప్రతీకార ధోరణిని ప్రదర్శిస్తున్న యూనస్, బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న హింసకు సంబంధించిన వార్తలను తీవ్రంగా ఖండించారు.

* "హిందువులపై దాడులు భారత్ సృష్టించిన ఫేక్ న్యూసే"

ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్‌లోని హిందూ మైనారిటీలపై హింసాత్మక సంఘటనలు జరుగుతున్నట్లు సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు, ఫోటోలు వైరల్ అయ్యాయి. అయితే, యూనస్ ఈ వార్తలను పూర్తిగా తోసిపుచ్చారు. "ప్రస్తుతం ఇండియా స్పెషాలిటీల్లో ఫేక్ న్యూస్ ఒకటిగా మారింది. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల వార్తలన్నీ భారత్ సృష్టించిన ఫేక్ న్యూస్‌." అని ఆయన విమర్శించారు. అంతేకాకుండా, సరిహద్దు వివాదాలు లేదా స్థానిక సమస్యలపై ఇరు దేశాల మధ్య అభిప్రాయభేదాలు సాధారణమేనని, వాటికి మతం రంగు పులమకూడదని యూనస్ అన్నారు. తమ ప్రభుత్వం అన్ని మతాల ప్రజల భద్రతకు కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.

* అంతర్గత వ్యతిరేకతను మళ్లించే ప్రయత్నమా?

యూనస్ చేసిన ఈ వ్యాఖ్యలు కేవలం భారత్‌-బంగ్లాదేశ్ సంబంధాలకే కాకుండా.. బంగ్లాదేశ్ అంతర్గత రాజకీయాలపై కూడా చర్చకు దారితీస్తున్నాయి. పలువురు విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. దేశీయ వ్యతిరేకత దారి మళ్లింపులో వ్యూహం ప్రకారం చేస్త యూనస్ పాలనపై దేశంలో పెరుగుతున్న వ్యతిరేకతను, విమర్శలను దారి మళ్లించేందుకే ఆయన భారత్‌ను లక్ష్యంగా చేసుకుంటున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. చైనా, పాకిస్తాన్‌లతో యూనస్‌కు ఉన్న సన్నిహిత సంబంధాలు భారత్‌తో బంగ్లాదేశ్ సంబంధాలను మరింతగా దెబ్బతీస్తున్నాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

* మైనారిటీ సంఘాల ఆందోళన

యూనస్ ప్రకటనలను బంగ్లాదేశ్‌లోని మైనారిటీ సంఘాలు పూర్తిగా ఖండిస్తున్నాయి. దేశంలో హిందువులపై దాడులు జరుగుతున్నాయని, తమ భద్రతపై ఆందోళన ఉందని మైనారిటీ సంఘాలు గట్టిగా చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో యూనస్ వ్యాఖ్యలు వారికి మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.

మొత్తంగా యూనస్ భారత్ వ్యతిరేక ధోరణిని కొనసాగిస్తే, అది బంగ్లాదేశ్ అంతర్గత రాజకీయాలతో పాటు దక్షిణాసియా ప్రాంతీయ సంబంధాలపైనా ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని, అంతేకాకుండా ఆయన పాలనకు అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడి తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News