పాక్ కు షాక్... ఫస్ట్ టైమ్ బంగ్లా నుంచి పాజిటివ్ స్టేట్ మెంట్!

గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్ రగిలిపోతున్న సంగతి తెలిసిందే. అక్కడున్న హిందువులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి.;

Update: 2025-12-24 05:20 GMT

గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్ రగిలిపోతున్న సంగతి తెలిసిందే. అక్కడున్న హిందువులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో రోజు రోజుకీ భారత వ్యతిరేక వాక్ చాతుర్యం పెరుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇరుదేశాల్లోనూ ఉద్రిక్తతలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయనే చర్చ మొదలైందని అంటున్నారు. మరోవైపు ఇదే అదనుగా భారత్ - బంగ్లా మధ్య శాశ్వత శత్రుగోడ కట్టాలని పాక్ ప్లాన్ చేస్తోంది. ఈ సమయంలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.

అవును... భారత్ - పాక్ మధ్య దౌత్యపరమైన సమస్యలు పెరుగుతున్నాయని.. ఇవి తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయని చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ రాజకీయ సలహాదారు డాక్టర్ ముహమ్మద్ యూనస్ మద్దతుతో బంగ్లాదేశ్ తో సైనిక ఒప్పందం చేసుకునే దిశగా పాక్ పావులు కదుపుతుందని అంటున్నారు. మరోవైపు బంగ్లాపై ఈగ వాలినా ఊరుకోమని అద్దె ప్రగల్భాలు పలుకుతున్నారు పాక్ నేతలు.

దీంతో... ఏక్షణమైనా.. ఏమైనా జరగొచ్చా అనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ నుంచి ఓ పాజిటివ్ స్టేట్ మెంట్ వచ్చింది. ఇందులో భాగంగా.. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి భారత్ తో సంబంధాలు చేదుగా మార్చే ఉద్దేశ్యం లేదని.. బదులుగా ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడంతో పాటు.. ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడంపై దృష్టి సారించిందని తాత్కాలిక ప్రభుత్వ ఆర్థిక సలహాదారు సలేహుద్దీన్ అహ్మద్ అన్నారు.

ఓ పక్క నిరసనలు, వీసా సేవల రద్దు, ఇరు దేశాల దౌత్య కార్యాలయాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు వెరసి.. ఇరూ దేశాల మధ్య సంబంధాలను కొత్త అత్యల్ప స్థాయికి నెట్టే ప్రమాదం ఉన్నప్పటికీ.. సయోధ్యను లక్ష్యంగా చేసుకుని ఆ వైపు నుంచి వచ్చిన మొదటి మాటలుగా ఇవి ఉన్నాయి. ఇరు దేశాల మధ్య చారిత్రక సంబంధాలు పతనమవుతున్న సమయంలో.. ఆర్థిక సలహాదారు అహ్మద్ చేసిన బహిరంగ వ్యాఖ్యలు పాక్ కు షాకింగ్ గా మారాయని అంటున్నారు.

అందుకు కారణం అహ్మద్ మాటల్లో జోడించిన మరో ఓ కీలక స్టేట్ మెంట్. ఇందులో భాగంగా... భారతదేశంతో సంబంధాలను రెచ్చగొట్టడానికి లేదా దెబ్బతీయడానికి మూడవ పక్షాలు చేసే ఎలాంటి ప్రయత్నాలలోనూ ఈ తాత్కాలిక పరిపాలన పాల్గొనదని అహ్మద్ అన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే పాక్ గొంతులో పచ్చి వెలక్కాయను వేసినట్లున్నాయని చెబుతున్నారు. ఇదే సమయంలో.. భారత్ తో ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకెళ్లడం లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు.

ఇదే క్రమంలో... భారతదేశం నుంచి 50,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని దిగుమతి చేసుకోవాలని బంగ్లాదేశ్ నిర్ణయించిందని ధృవీకరించిన అహ్మద్... ఈ చర్య ఇరుదేశాల మధ్య ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దశగా అభివర్ణించారు. భారత్ నుంచి తమకు అవసరమైన వస్తువులను దిగుమతి చేసుకునే విషయంలో ఎటువంటి అడ్డంకులు ఉండవని భావిస్తున్నట్లు తెలిపారు. దీంతో.. ఇది కచ్చితంగా పాక్ కు బ్యాడ్ న్యూసే అని అంటున్నారు పరిశీలకులు!

Tags:    

Similar News