'బంగారు బాలయ్య' నుంచి ప్రజలకు బిగ్ అలర్ట్!
అవును... నందమూరి బాలకృష్ణ... అటు సినిమాలు, ఇటు ప్రజాసేవతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.;
అటు సినిమా షూటింగులు చేసుకుంటూ, ఇటు హిందూపురం ప్రజల బాగోగులు చూసుకుంటూ, మరోవైపు బసవతారకం క్యాన్సర్ హాస్పటల్ బాధ్యతలు నిర్వరిస్తూ నందమూరి బాలకృష్ణ నిత్యం బిజీగా ఉంటారనే సంగతి తెలిసిందే! ఈ క్రమంలో.. ఆయన నుంచి ఒక ఊహించని ప్రకటన వచ్చింది. ఈ సందర్భంగా ప్రజలను అప్రమత్తంగా ఉండాలని బాలయ్య కోరుతూ ప్రకటన విడుదల చేశారు.
అవును... నందమూరి బాలకృష్ణ... అటు సినిమాలు, ఇటు ప్రజాసేవతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో... బసవతారకం కాన్సర్ హాస్పిటల్ విషయంలో ఓ ఫేక్ ప్రచారం తెరపైకి వచ్చిందని చెబుతున్నారు. దీంతో... అలాంటి మోసపూరిత ప్రకటనలు, కార్యక్రమాలను నమ్మి మోసపోవద్దని బాలకృష్ణ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు.
ఇందులో భాగంగా... "ప్రజలకు హెచ్చరిక!.. 'బంగారు బాలయ్య - బసవతారకం ఈవెంట్' పేరిట అశ్విన్ అట్లూరి అనే వ్యక్తి నా పేరు, బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి పేరు అనుమతిలేకుండా ఉపయోగిస్తూ.. విరాళాల సేకరణ కోసం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఈవెంట్ కు నా అనుమతి లేదు. ఆస్పత్రి ట్రస్ట్ బోర్డు తరఫున ఎటువంటి అధికారిక ఆమోదం లేదు" అని బాలయ్య తెలిపారు.
ఇదే సమయంలో... దయచేసి ఈ రకమైన అనధికారిక, తప్పుదారి పట్టించే కార్యక్రమాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. బసవతారకం ఆస్పత్రి తరఫున జరిగే అన్ని అధికారిక కార్యక్రమాలు, విరాళాల అభ్యర్థనలు కేవలం ధ్రువీకరించిన, పారదర్శక మాధ్యమాల ద్వారానే నిర్వహిస్తామని.. మోసపూరిత ప్రకటనలు, కార్యక్రమాలను నమ్మి మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు.