బాప్‌రే! పిల్లలకు పేరు పెట్టే కన్సల్టెంట్ ఫీజ్ 26లక్షలు!!
ఆడ బిడ్డకు అయితే ఏం పేరు పెట్టాలి? మగ బిడ్డ పుడితే ఎలాంటి పేరు ఎంపిక చేయాలి? అనే డైలమా ఉంటుంది. పుట్టిన సమయం- తేదీ-రాశి-నక్షతం ఆధారంగా రకరకాల గణాంకాలతో బిడ్డ పేరు ఏ అక్షరంతో మొదలవ్వాలో నిర్ణయిస్తారు.;
బిడ్డ పుట్టక ముందు నుంచే తల్లిదండ్రులు ఏం పేరు పెట్టాలో ఆలోచిస్తారు. ఆడ బిడ్డకు అయితే ఏం పేరు పెట్టాలి? మగ బిడ్డ పుడితే ఎలాంటి పేరు ఎంపిక చేయాలి? అనే డైలమా ఉంటుంది. పుట్టిన సమయం- తేదీ-రాశి-నక్షతం ఆధారంగా రకరకాల గణాంకాలతో బిడ్డ పేరు ఏ అక్షరంతో మొదలవ్వాలో నిర్ణయిస్తారు.
అయితే చాలామంది కపుల్స్ బిడ్డ పేరు విషయంలో డైలమాలోనే ఉండిపోతారు. అలాంటి వారి కోసం
అమెరికా- శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన కన్సల్టెంట్ టేలర్ ఎ హంఫ్రీ చాలా కాలంగా సేవలందిస్తున్నారు. పిల్లల పేర్లు ఎలా ఉండాలి? అనే సబ్జెక్ట్ పై తనకున్న మక్కువను ఒక ఖరీదైన వ్యాపారంగా మార్చుకుని, పిల్లలకు పేర్లు పెట్టడంలో పేరెంట్ కి సహాయపడటానికి 30,000 డాలర్లు (రూ. 26,64,889) వరకు వసూలు చేస్తున్నారని ది న్యూయార్క్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది.
పిల్లల పేర్ల ఎంపికపై తనకు ఉన్న మక్కువను టిక్ టాక్, ఇన్ స్టా వంటి మాధ్యమాల్లో ఈమె రెగ్యులర్ గా షేర్ చేస్తుంటారు. పదేళ్లుగా ఆమె ఇదే పనిలో ఉన్నారు. ఇప్పటికే టిక్ టాక్ (భారత్‌లో బ్యాన్), ఇన్‌స్టాగ్రామ్‌లలో ఈమెను లక్ష మందికి పైగా ఫాలోవర్స్ అనుసరిస్తున్నారు. 500 మందికి పైగా పిల్లలకు పేర్లను ఎంపిక చేయడంలో పేరెంట్ కి ఆమె సహకరించారు. తనను తాను `నేమ్ నెర్డ్` అని పిలుచుకునే హంఫ్రీ తల్లిదండ్రుల ప్రాధాన్యతలను అర్థం చేసుకోవడానికి ప్రశ్నాపత్రాలను ఉపయోగిస్తుంది. ఈమెయిల్ లో బిడ్డ పేరును పంపేందుకు ఆమె 200 డాలర్ల నుండి సేవల్ని అందుబాటులోకి తెచ్చింది. వంశపారంపర్య పరిశోధన, శిశువు పేరు బ్రాండింగ్ వంటి వాటితో ప్రత్యేక ప్యాకేజీల కోసం 30,000 డాలర్లు (రూ. 26,64,889) వరకు ఈమె డిమాండ్ చేస్తుంది.
హంఫ్రీ పేర్లను ఎంపిక చేయడమే కాదు, పేరెంట్ కి గైడ్ గా థెరపిస్టుగాను వ్యవహరిస్తుంది. ఈమెకు అనామక ధనవంతుల నుండి హై-ప్రొఫైల్ సెలబ్రిటీల వరకు అనేక మంది క్లయింట్లు ఉన్నారు. వారంతా తమ బిడ్డకు సరైన పేరును కనుగొనడానికి హంఫ్రీ సహాయం కోరుకుంటారు. ఇటీవల ఆమె వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. అయితే తనను ఎగతాళి చేసిన వారే ఇప్పుడు తమ పిల్లల పేర్ల ఎంపిక కోసం కలుస్తున్నారని హంప్రీ చెబుతోంది అంటే అర్థం చేసుకోవాలి. ఎగతాళి చేసినంత మాత్రాన చిన్నబుచ్చుకోను. ఇదంతా అభిరుచితో ఉపాధి కోసం చేస్తున్న పని అని కూడా హంఫ్రీ నిజాయితీగా చెబుతారు.