అయోధ్య రామమందిరం లోపల నమాజ్ ప్రయత్నం.. ఎవరీ అహ్మద్ షేక్!
అత్యంత భద్రత కలిగిన అయోధ్య రామమందిర ప్రాంగణంలోకి ఓ వ్యక్తి ప్రవేశించి, మందిరాన్ని సందర్శించి, అనంతరం సీతా రసోయి ప్రాంతానికి సంపీంలో కూర్చొన్నాడు!;
అయోధ్యలోని రామమందిర సముదాయం లోపల ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది! ఇందులో భాగంగా.. మందిరం లోపల ఓ వ్యక్తి నమాజ్ చేయడానికి ప్రయత్నించాడని అంటున్నారు. ఇది గుర్తించిన అధికారులు అతన్ని ఆపి, అదుపులోకి తీసుకున్నారని.. ఆ సమయంలో అతడు పలు నినాదాలు చేశాడని ఆరోపిస్తున్నారు. ఆ వ్యక్తిని కశ్మీర్ కు చెందిన అహ్మద్ షేక్ గా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. దీంతో.. ఈ విషయం ఒకసారిగా వైరల్ గా మారింది!
అవును.. అయోధ్యలోని రామమందిర సముదాయం లోపల ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది! ఇందులో భాగంగా.. కశ్మీర్ లోని పోషియన్ జిల్లాకు చెందిన 55 ఏళ్ల అహ్మద్ షేక్ గా గుర్తించిన ఓ వ్యకి.. నమాజ్ చేయడానికి ప్రయత్నించాడని అంటున్నారు. దీంతో ఆ వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ కోసం స్థానిక పోలీసులకు అతన్ని అప్పగించగా.. ప్రస్తుతం విచారణ జరుగుతుంది! దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
అత్యంత భద్రత కలిగిన అయోధ్య రామమందిర ప్రాంగణంలోకి ఓ వ్యక్తి ప్రవేశించి, మందిరాన్ని సందర్శించి, అనంతరం సీతా రసోయి ప్రాంతానికి సంపీంలో కూర్చొన్నాడు! అప్పటివరకూ అంతా గానే ఉండగా.. అనంతరం అక్కడే నమాజ్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు అధికారులు గుర్తించారని అంటున్నారు. అతని ప్రయత్నాన్ని వెంటనే గుర్తించిన భద్రతా సిబ్బంది జోక్యం చేసుకుని, అతన్ని అదుపులోకి తీసుకుని, స్థానిక పోలీసులకు అప్పగించారు.
ఈ సందర్భంగా స్పందించిన పోలీసులు... అతని అసలు ఉద్దేశ్యాన్ని తెలుసుకునే పనిలో దర్యాప్తు సంస్థలు, నిఘా సంస్థలు ఉన్నాయని అన్నట్లు తెలుస్తోంది. అసలు అతను అయోధ్యకు ఎందుకు వచ్చాడు.. ఇందులో అతని ఒక్కడి పాత్రే ఉందా.. లేక ఇది టీమ్ వర్కా.. అనే వివరాలతో పాటు అతని ప్రయాణానికి సంబంధించిన అన్ని వివరాలనూ అధికారులు పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. మరోవైపు.. ప్రాథమిక తనిఖీల్లో అతని వద్ద జీడిపప్పు, ఎండుద్రాక్షను పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.
ఈ సంఘటన నేపథ్యంలో పోలీసు అధికారులు, నిఘా సంస్థలు రామమందిర సముదాయంలోని భద్రతా ఏర్పాట్లను సమీక్షిస్తున్నాయని అంటున్నారు. అయితే... అహ్మద్ షేక్ మానసిక అనారోగ్యంతో ఉన్నాడని చెబుతోన్న అతని కుటుంబం.. వారి వాదనకు మద్దతుగా శ్రీనగర్ మెడికల్ కాలేజీలోని సైకియాట్రీ విభాగం నుండి పలు వైద్య రికార్డులను పంచుకున్నట్లు కథనాలొస్తున్నాయి! ఈ మేరకు జాతీయ మీడియాలో వస్తోన్న కథనాలు వైరల్ గా మారుతున్నాయి!
కాగా... వచ్చే వారం అయోధ్యలో మకర సంక్రాంతి వేడుకలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో జనవరి 22న రామాలయ ప్రతిష్టాపన కార్యక్రమం రెండో వార్షికోత్సవం జరగనుంది. ఈ సమయంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం మరింత చర్చనీయాంశంగా మారింది!