అంబటిపై అయ్యన్న ఘాటు వ్యాఖ్యలు... రియాక్షన్ ఉంటుందా?

స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణంలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు ముందు, ఆ తర్వాత అన్నట్లుగా మారిపోయాయి అనే చెప్పుకోవాలి అని అంటున్నారు పరిశీలకులు.

Update: 2023-10-11 07:29 GMT

ఏపీ రాజకీయాలు.. స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణంలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు ముందు, ఆ తర్వాత అన్నట్లుగా మారిపోయాయి అనే చెప్పుకోవాలి అని అంటున్నారు పరిశీలకులు. ఈ కేసులో చంద్రబాబు అరెస్ట్ అనంతరం ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీ నేతల్లో అప్పట్లో కనిపించిన దూకుడు కనిపించడం లేదని మాత్రం అంటున్నారు.

అవును... ఏపీ రాజకీయల్లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయినప్పటినుంచీ కొంతమంది టీడీపీ నేతలు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు. పైగా... జగన్, ముఖ్యమంత్రి అనే విషయం మరిచినట్లుగా శృతిమించిన విమర్శలు చేస్తున్నారనే సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ఇదే ఫ్లో కంటిన్యు చేసిన బండారు ఇప్పుడు కేసు ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో అయ్యన్నపాత్రుడు కాస్త కాం అయినట్లు కనిపించారు.

గతంలో చంద్రబాబు అరెస్టుకు ముందు ముఖ్యంగా అయ్యన్నపాత్రుడు... ఏపీ ముఖ్యమంత్రిపై అత్యంత హేయమైన విమర్శలు చేసేవారు. ఇక వైసీపీ నాయకులు, మంత్రులపై అయితే చెప్పేపనిలేదు. నోటికొచ్చినట్లు మాట్లాడేవారు! జగన్ ని ఏకవచనంతో సంభోదిస్తూ, రాయలేని మాటలు మాట్లడేవారు. అయితే చంద్రబాబు అరెస్ట్ అనంతరం ఆ స్థాయి చప్పుడు కనిపించలేదు. రెగ్యులర్ పొలిటికల్ రియాక్షన్సే తప్ప సంస్కారం మరిచిన కామెంట్లు వినిపించలేదనే చెప్పుకోవాలి.

ఈ నేపథ్యంలో... చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత టీడీపీ యువనేత నారా లోకేష్ ఢిల్లీలోనే ఎక్కువ కాలం ఉన్న సంగతి తెలిసిందే. అయితే... ఈ విషయంపై.. సుప్రీంకోర్టు న్యాయవాదులతో లోకేష్ చర్చలు జరుపుతూ, సమాలోచనలు చేస్తున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. మరోపక్క "మనం అంతపనోళ్లమేంటి... సుప్రీంకోర్టు లాయర్లు బెజవాడ బజార్లో తిరుగుతుంటే ఢిల్లీలో మనం ఏమి చేస్తున్నాం" అంటూ వైసీపీ నేతలు సెటైర్లు వేయడం స్టార్ట్ చేశారు. ఇదే విషయంపై తాజాగా అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.

ఇందులో భాగంగా... "తండ్రిని అరెస్ట్ చేస్తే భార్యా పిల్లలను వదిలి ఢిల్లీకి పారిపోయిన పిరికి బడుద్దాయి లోకేష్" అని ట్వీట్ చేశారు అంబటి రాంబాబు. దీనికి టీడీపీ నేత మాజీ మంత్రి అయన్నపాత్రుడు స్పందించారు. ఇందులో భాగంగా... "తండ్రి కోసమే గా వెళ్ళింది... 'అరగంట కోసం' కాదుగా సోం బేరి సారు.." అంటూ ఘాటుగా స్పందించారు అయ్యన్న! దీంతో ఆ ట్వీటు, ఈ కామెంటూ వైరల్ గా మారాయి!

మరి ఈ విషయంపై అంబటి ఎలా రియాక్ట్ అవుతారు.. అసలు అవుతారా.. లేక, మరో ఆలోచన ఏమైనా చేస్తారా అన్నది వేచి చూడాలి.

Tags:    

Similar News