ఇక గవర్నర్ అశోక్ గజపతిరాజుగా !

విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్ మోస్ట్ లీడర్, కేంద్ర మాజీ మంత్రి రాష్ట్రంలో దశాబ్దాల పాటు వివిధ మంత్రిత్వ శాఖలలో పనిచేసిన పూసపాటి అశోక్ గజపతిరాజు తొందరలోనే రాజ్ భవన్ లోకి అడుగు పెట్టనున్నారు అని అంటున్నారు.;

Update: 2025-07-08 04:00 GMT
ఇక గవర్నర్ అశోక్ గజపతిరాజుగా !

విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్ మోస్ట్ లీడర్, కేంద్ర మాజీ మంత్రి రాష్ట్రంలో దశాబ్దాల పాటు వివిధ మంత్రిత్వ శాఖలలో పనిచేసిన పూసపాటి అశోక్ గజపతిరాజు తొందరలోనే రాజ్ భవన్ లోకి అడుగు పెట్టనున్నారు అని అంటున్నారు. ఆయనను కీలకమైన రాష్ట్రానికి గవర్నర్ గా నియమించేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సుముఖంగా ఉందని అంటున్నారు.

త్వరలోనే బీహార్ తో పాటు మరో మూడు రాష్ట్రాలలో కొత్తగా గవర్నలను నియమించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దాంతో అందులో ఒక గవర్నర్ పదవిని తమకు నమ్మకమైన మిత్రుడిగా ఏపీలో ఉన్న టీడీపీకి ఇవ్వాలని బీజేపీ ఆలోచిస్తోంది. ఆ విషయాన్ని ఇప్పటికే టీడీపీ అధినాయకత్వానికి తెలియచేసినట్లుగా ప్రచారం సాగుతోంది

ఇక తెలుగుదేశం పార్టీలో ఇద్దరు సీనియర్లు బాబుకు అత్యంత సన్నిహితులు అయిన అశోక్ గజపతి రాజు యనమల రామక్రిష్ణుడు గవర్నర్ పోస్టు కోసం చూస్తున్నారు అని అంటున్నారు. ఈ ఇద్దరూ రాజ్యాంగపరమైన వ్యవహారాలలో దిట్టలు గా ఉన్నారు. ఇద్దరూ బాబుకు అత్యంత ఆప్తులు ఇద్దరూ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు ఇద్దరి కుమార్తెలు ఎమ్మెల్యేలుగా 2024 ఎన్నికల్లో గెలిచి వచ్చారు.

దాంతో తాము రాజకీయంగా ఇన్నాళ్ళు చేసిన సేవకు గానూ గౌరవనీయమైన విరమణను వారు కోరుకుంటున్నారు. అది రాజ్ భవన్ లో అడుగు పెడితేనే జరుగుతుందని కూడా గట్టిగా నమ్ముతున్నారు. దాంతో ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. అయితే చంద్రబాబు మదిలో అశోక్ పేరు ఉందని అంటున్నారు.

ఆయనను గవర్నర్ పదవికి ఎంపిక చేయాలని నిర్ణయించారని చెబుతున్నారు. కేంద్ర మంత్రి పదవితో పాటు ఏ బాధ్యతను అప్పగించినా పూర్తి న్యాయం చేస్తూ వస్తూ క్లీన్ ఇమేజ్ కలిగిన రాజా వారికి రాజ్ భవన్ దారి చూపించాలని భావిస్తున్నారు అని తెలుస్తోంది.

అదే సమయంలో యనమల రామక్రిష్ణుడికి కూడా న్యాయం చేస్తారని అంటున్నారు. 2026లో ఏపీ నుంచి ఖాళీ అయ్యే నాలుగు రాజ్యసభ సీట్లలో ఒకదానిని యనమలకు ఇవ్వడం ద్వారా ఆయన చాలా కాలంగా కోరుతున్న పెద్దల సభలో ప్రవేశించే ముచ్చటను తీరుస్తారని అంటున్నారు.

ఇక ఈ గవర్నర్ పదవుల నియామకం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందుగానే జరుగుతుందని అంటున్నారు. బీహార్ లో ఈ ఏడాది అక్టోబర్ లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. దాంతో ఆ రాష్ట్రానికి అశోక్ గజపతిరాజు వంటి రాజ్యాంగం పూర్తిగా ఔపాసన పట్టిన వారిని గవర్నర్ గా నియమిస్తారు అని అంటున్నారు. ఒకవేళ అది కాకపోతే తమిళనాడుకు కూడా అశోక్ గవర్నర్ అయ్యే చాన్స్ ఉందిట. మొత్తానికి అతి తొందరలోనే గవర్నర్ అశోక్ గారు అని అంతా పిలవాల్సిన సమయం వచ్చేస్తోంది అని అంటున్నారు.

Tags:    

Similar News