విశాఖ మిట్టల్ స్టీల్ ప్లాంట్.... ప్రారంభానికి ముందే రికార్డు

ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రముఖ సంస్థ ఆర్సెలార్‌ మిట్టల్ ఏర్పాటు చేస్తున్న స్టీల్ ప్లాంట్ కి అన్ని అనుమతులు వచ్చేసినట్లే అని అంటున్నారు.;

Update: 2025-11-03 03:32 GMT

ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రముఖ సంస్థ ఆర్సెలార్‌ మిట్టల్ ఏర్పాటు చేస్తున్న స్టీల్ ప్లాంట్ కి అన్ని అనుమతులు వచ్చేసినట్లే అని అంటున్నారు. మిట్టల్ ఉక్కు రంగంలో దిగ్గజ సంస్థగా ఉంది జపాన్ లోని నిప్పన్ స్టీల్స్ తో కలసి అనకాపల్లి దగ్గరలో ఒక భారీ స్టీల్ ప్లాంట్ ని ఏర్పాటు చేస్తోంది. ఈ ప్లాంట్ ఏర్పాటు కోసం అన్ని అనుమతులు వచ్చినట్లే అంటున్నారు. లేటెస్ట్ గా చూస్తే కనుక కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ఎక్స్పర్ట్ అప్రైజల్‌ కమిటీ సైతం పర్యావరణ అనుమతికి సిఫారసు చేయడంతో కీలక ఘట్టంలోకి అడుగులు పడుతున్నట్లు అయింది అంటున్నారు.

గుడ్ అచీవ్మెంట్ గా :

ఒక భారీ స్టీల్ ప్లాంట్ కి అతి తక్కువ సమయంలో అంటే కేవలం 14 నెలలలోనే అనుమతులు అన్నీ తీసుకుని రావడం అంటే గ్రేట్ అచీవ్మెంట్ అని ఏపీలోని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొనడం ఈ సందర్భంగా గమనార్హం. ఇక మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏకంగా 1.5 లక్షల కోట్లతో ఏర్పాటు చేయనున్నారు. దీని ప్రత్యేకత ఏమిటి అంటే దేశంలోనే అతి పెద్ద గ్రీన్ ఫీల్డ్ కర్మాగారంగా ఉండబోతోంది. భారీగా ఏర్పాటు అయ్యే ఈ పరిశ్రమల వల్ల పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు స్థానికులకు లభిస్తాయి అని అంటున్నారు.

ఉత్పత్తిలోనూ రికార్డు :

ఇక మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిలోనూ కొత్త రికార్డులు క్రియేట్ చేయనుంది అని అంటున్నారు. ఏడాదికి 17.8 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తిని చేసే సామర్థ్యంతో ఇది నెలకొల్పబడుతోంది. దీనిని రెండు దశలుగా విభజించారు. తొలిదశలో 7.3 మిలియన్ టన్నులు, రెండవ దశలో 10.5 మిలియన్ టన్నులు ఉత్పత్తి సామర్థ్యంతో విస్తరించనున్నారు. ఇక మొదటి దశలో ఈ సంస్థ నిర్మాణానికి 2,200 ఎకరాల భూములు అవసరం అయితే రెండవ దశలో 3,800 ఎకరాల భూములు అవసరం అవుతాయి. ఇక్కడ టౌన్ షిప్ ని కూడా నిర్మిస్తారు. దాని కోసం మరో 440 ఎకరాల భూములు అవసరం అవుతాయని చెబుతున్నారు.

శంకుస్థాపనతో :

ఇక ఈ నెల 14, 15 తేదీలలో విశాఖ వేదికగా పెట్టుబడుల భాగస్వామ్య సదస్సుని పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక విశాఖలో నిర్వహిస్తున్న అతి పెద్ద సదస్సుగా దీనిని అభివర్ణిస్తున్నారు ఈ సదస్సులో భాగంగా మిట్టల్ సంస్థకు భూమి పూజ జరుగుతుందని అంటున్నారు. ఆ మీదట శరవేగంగా సంస్థ నిర్మాణం జరగనుంది. ఇక తొలి దశలో ఉక్కు ఉత్పత్తిని కూడా వీలైనంత త్వరలోనే అందించనుంది అని అంటున్నారు. మొత్తానికి విశాఖ సహా ఉత్తరాంధ్రకు తలమానికంగా మిట్టల్ స్టీల్ ప్లాంట్ నిలవనుంది అని అంటున్నారు.

Tags:    

Similar News