యంగెస్ట్ బిలియనీర్ ఆఫ్ ఇండియా... ఎవరీ అరవింద్ శ్రీనివాస్!

ఇదే క్రమంలో.. ఓపెన్ ఏఐలో రీన్‌ ఫోర్స్‌ మెంట్ లెర్నింగ్‌ పై లండన్‌ లోని డీప్‌ మైండ్‌ లో కాంట్రాస్టివ్ లెర్నింగ్‌ పై పనిచేసిన తర్వాత గూగుల్‌ లో చేరిన శ్రీనివాస్... అక్కడ హాలోనెట్, రెస్నెట్ ఆర్‌.ఎస్. వంటి విజన్ మోడళ్లకు దోహదపడ్డాడు.;

Update: 2025-10-02 06:21 GMT

తాజాగా ఎం3ఎం హురున్‌ ఇండియా సంపన్నుల జాబితా - 2025 వెలువడిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో కుటుంబ సభ్యులతో కలిసి రూ.9.55 లక్షల కోట్ల సంపదతో ముకేశ్‌ అంబానీ మొదటి స్థానంలో ఉండగా... రూ.8.15 లక్షల కోట్లతో గౌతమ్‌ అదానీ రెండో స్థానంలో నిలిచారు. ఈ క్రమంలో ఓ యంగెస్ట్ బిలియనీర్ పేరు తెరపైకి వచ్చి సంచలనంగా మారింది. అతడే అరవింద్ శ్రీనివాస్.

అవును... తాజాగా వెలువడిన ఎం3ఎం హురున్ ఇండియా సంపన్నుల జాబితా - 2025లో పెర్‌ ప్లెక్సిటీ వ్యవస్థాపకుడైన 31 ఏళ్ల అరవింద్‌ శ్రీనివాస్‌ పేరు తెరపైకి వచ్చింది. రూ.21,190 కోట్ల సంపదతో అత్యధిక సంపద కలిగిన యువ బిలియనీర్‌ గా ఆయన గుర్తింపు పొందారు. దీంతో.. ఎవరీ శ్రీనివాస్, ఏమిటి ఆయన వ్యాపారం, ఆయన బ్యాక్ గ్రౌండ్ పై ఆన్ లైన్ లో సెర్చ్ పెరిగింది!

అరవింద్ శ్రీనివాస్ జూన్ 7, 1994న చెన్నైలో జన్మించారు. బాల్యం నుంచే సైన్స్ పట్ల లోతైన ఆసక్తి కలిగి ఉన్న శ్రీనివాస్... ఐఐటీ మద్రాస్ లో చదువుకున్నారు. అదే సమయంలో రీన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ పై కోర్సులు కూడా బోధించారు. తర్వాత బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలంలో కంప్యూటర్ సైన్స్ లో పీహెచ్‌డి చేసారు. కంప్యూటర్ కు సంబంధించిన అధునాతన రంగాలపై పనిచేశారు.

ఇదే క్రమంలో.. ఓపెన్ ఏఐలో రీన్‌ ఫోర్స్‌ మెంట్ లెర్నింగ్‌ పై లండన్‌ లోని డీప్‌ మైండ్‌ లో కాంట్రాస్టివ్ లెర్నింగ్‌ పై పనిచేసిన తర్వాత గూగుల్‌ లో చేరిన శ్రీనివాస్... అక్కడ హాలోనెట్, రెస్నెట్ ఆర్‌.ఎస్. వంటి విజన్ మోడళ్లకు దోహదపడ్డాడు. ఆ తర్వాత రీసెర్చ్ సైంటిస్ట్ గా ఓపెన్ ఏఐకి తిరిగి వచ్చారు.

అనంతరం 2022 ఆగస్టులో డెనిస్ యారట్స్, ఆండీ కొన్విన్స్కి లతో కలిసి పెర్ప్లెక్సిటీ ఏఐని స్థాపించారు అరవింద్ శ్రీనివాస్. ఈ క్రమంలో తక్కువ కాలంలోనే ఈ కంపెనీ వినియోగదారులకు వేగవంతమైన, ఖచ్చితమైన సమాధానాలను అందించడానికి రూపొందించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సెర్చ్, చాట్ ఇంజిన్‌ ను రూపొందించింది.

ఈ క్రమంలో ప్రపంచంలోని అత్యంత ఆశాజనకమైన ఏఐ స్టార్టప్‌ లలో ఇది ఒకటిగా మారింది.. ప్రపంచ టెక్ నాయకుల దృష్టిని ఆకర్షించింది. ఇదే సమయంలో ఎలెవెన్‌ ల్యాబ్స్, సునో వంటి ఇతర ఏఐ స్టార్టప్‌ లలోనూ పెట్టుబడులు పెట్టిన అరవింద్.. ఏఐ ఇండస్ట్రీలో తన మార్కు ప్రభావాన్ని చూపించారు. ఫలితంగా... యంగెస్ట్ బిలియనీర్ గా అవతరించారు.

మరోవైపు జెప్టో సహ వ్యవస్థాపకుడైన కైవల్య వోహ్రా (22), ఆయన వ్యాపార భాగస్వామి ఆదిత్‌ పలీఛా (23) యువ బిలియనీర్లలో రెండో స్థానంలో ఉన్నారు.

ఇక... హెచ్‌.సీ.ఎల్‌ టెక్నాలజీస్‌ ఛైర్‌ పర్సన్‌ రోష్ని నాడార్‌ మల్హోత్రా.. భారతదేశపు అత్యంత ధనిక మహిళగా గుర్తింపు సాధించారు. ఆమె సంపద విలువ రూ.2.84 లక్షల కోట్లని నివేదిక తెలిపింది. కేవలం 44 ఏళ్ల వయస్సులో టాప్‌-10 లో స్థానం పొందిన చిన్న వయస్కురాలైన మహిళగా ఆమె గుర్తింపు దక్కించుకున్నారు.

టాప్ 10 భారతీయ కుబేరులు వీరే!:

ముకేష్ అంబానీ - రూ.9,55,410 కోట్లు

గౌతమ్ అదానీ - రూ.8,14,420 కోట్లు

రోష్ని నాడార్ మల్హోత్రా - రూ.2,84,120 కోట్లు

సైరస్ పూనా వాలా - రూ.2,46,460 కోట్లు

కుమార్ మంగళం బిర్లా - రూ.2,32,850 కోట్లు

నీరజ్ బజాజ్ - రూ.2,32,680 కోట్లు

దిలీప్ సంఘ్వీ - రూ.2,30,560 కోట్లు

అజీమ్ ప్రేమ్ జీ - రూ.2,21,250 కోట్లు

గోపీచంద్ హిందూజా – రూ.1,85,310 కోట్లు

రాధాకిషన్ దమానీ - రూ.1,82,980 కోట్లు

Tags:    

Similar News