అరకు కాఫీ రైతు పంట పండింది

మన అరకు కాఫీకి ఈ రోజున ప్రపంచంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయన్న సంగతి తెలిసిందే.;

Update: 2025-11-21 03:28 GMT

మన అరకు కాఫీకి ఈ రోజున ప్రపంచంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. మన కాఫీని విదేశీయులు ఎంతో గొప్పగా ఆస్వాదిస్తున్నారు. మెచ్చుకుంటున్నారు. అలా అరకు కాఫీ కాస్తా అంతర్జాతీయం అయిపోయింది. అదే సమయంలో మన్యంలో పండించే వాణిజ్య పంటగా కాఫీ సాగు విస్తీర్ణం పెరిగింది. ఈ నేపధ్యంలో పండించిన పంటకు తగిన గిట్టుబాటు ధర లభిస్తోందా అన్నది చర్చగా ఉంది. రైతులు కూడా ఈ విషయంలో ఒకింత నిరాశగా ఉన్నారు. వారికి ఇపుడు ఒక గుడ్ న్యూస్ అయితే ఐటీడీఏ అందించింది.

ధరలు పెంచుతూ :

అరకు కాఫీ పంటను కొనుగోలు చేసేందుకు ఇప్పటిదాకా ఉన్న ధరను పెంచుతూ రైతులకు ఊరటను కలిగించే విధంగా ఐటీడీఏ కీలకమైన నిర్ణయం తీసూంది. దీంతో కాఫీ రైతుల పంట పండినట్లు అయింది అని అంటున్నారు. ఇక ఈ ధరవరలు ఎలా ఉన్నాయీ అంటే కాఫీ రకాన్ని బట్టి ఏకంగా కిలోకు పది రూపాయల నుంచి యాభై రూపాయల దాకా పెంచేశారు. దాంతో ఒక్కసారిగా అయిదింతలు ధర పెరగడం పట్ల కాఫీ రైతులు సంతోషిస్తున్నారు. ఇదే సమయంలో మరో శుభవార్తను కూడా ఐటీడీఏ తెలిపింది. కాఫీ రైతుల ఇంటి వద్దనే కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పడంతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా రైతుల వద్ద నుంచి కాఫీ పంట కొనుగోలు చేయడమే కాదు వారికి డబ్బులు కూడా ఒక్క రోజులోనే ఖాతాల్లో పదేలా చూస్తామని కూడా అధికారులు చెబుతున్నారు.

కాఫీ బంగారమే :

ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో కాఫీ పంట ఇపుడు బంగారంగా మారింది. అంతర్జాతీయంగా మార్కెట్ ఉండడంతో అంతా కాఫీ సాగు మీదనే ఫోకస్ పెడుతున్నారు. ఇక ఏజెన్సీలోనే ఈ పంట పండుతుంది. పూర్తి సానుకూల వాతావరణం ఇక్కడే ఉంది అని అంటున్నారు. ప్రభుత్వాలు అధికారుల ప్రోత్సహంతో ఏ ఏటికి ఆ ఏడు కాఫీ పంట సాగు విస్తీర్ణం సైతం పెరుగుతోంది అని అంటున్నారు. అల్లూరి సీతారామ రాజు జిల్లాలోని పాడేరు డివిజన్ లో ఏకంగా ఒక లక్షా యాభై వేల ఎకరాలలో కాఫీ పంట సాగు అవుతోందని అధికారులు తెలియచేస్తున్నారు. ఇలా సాగు నుంచి వచ్చే కాఫీ గింజలు కూడా ఏటా 17 నుంచి 18 వేల మెట్రిక్ టన్నుల దాకా ఉంటుందని డేటా ఉంది.

రేటు దగ్గరే పేచీ :

అయితే ఎంతో కష్టపడి కాఫీ గింజలను ఉత్పత్తి చేస్తున్నా సరైన రేటు తమకు దక్కడం లేదని రైతాంగం ఆందోళన చెందుతోంది. తాము పండించే పంటకు సరైన గిట్టుబాటు ధర లేకపోతే ఎలా అని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తునారు. ఇలాంటి టైంలో కూటమి ప్రభుత్వం అయితే ధరలను పెంచుతూ గుడ్ న్యూస్ నే తెలియచేసింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలోనే కాఫీ గింజల కొనుగోలు ధరలను పెంచినట్లు ఐటీడీఏ అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ మేరకు తాజాగా జరిగిన ఐటీడీఏ అపెక్స్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కాఫీ గింజలలో అనేక రకాలు ఉన్నాయి. అరిబికా చెర్రీ, రొబస్టా చెర్రె, అరెబికా పార్చుమెంట్ ఇలా ఉన్నాయి. వీటి రకాన్ని బట్టి ధరల పెంపు ఉంటుందని అధికారులు వెల్లడిస్తున్నారు.

Tags:    

Similar News