ఈ ఏడాది చివర్లో యాపిల్ కొత్త రూపం.. మడత పెట్టే ఫోన్

క్యాలెండర్ లో ఏడాది పూర్తై.. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టినంతనే యాపిల్ ఫోన్ అభిమానులు తమ తర్వాతి ఫోన్ ను ఎప్పుడు అప్డేట్ చేసుకోవాలన్న దానిపై ఆలోచిస్తూ ఉంటారు.;

Update: 2026-04-27 05:33 GMT

క్యాలెండర్ లో ఏడాది పూర్తై.. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టినంతనే యాపిల్ ఫోన్ అభిమానులు తమ తర్వాతి ఫోన్ ను ఎప్పుడు అప్డేట్ చేసుకోవాలన్న దానిపై ఆలోచిస్తూ ఉంటారు. ఈ ట్రెండ్ ఒకట్రెండు దేశాల్లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉంటుంది. కొత్త ఐఫోన్ అప్డేట్ కోసం ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తుంటారు. గతంలోనూ పలుమార్లు ఐఫోన్ తన తాజా ఫోన్ ను మడతపెట్టే మోడల్ లో తీసుకొస్తుందన్న ప్రచారం జరిగింది. కానీ.. ఇప్పటివరకు అలాంటిదేమీ జరగలేదు. అందుకు భిన్నంగా ఈ ఏడాది చివర్లో మార్కెట్ లోకి వచ్చే ఐఫోన్ 18లో మాత్రం మడతబెట్టే ఫోన్ ను తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది చివర్లో ఐఫోన్ 18 లేదంటే ఐఫోన్ ఫోల్డ్ లేదంటే ఐఫోన్ అల్ట్రా పేరుతో యాపిల్ తన మొదటి ఫోల్డబుల్ ఫోన్ ను తెచ్చేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ఈ వాదనకు బలం చేకూరేలా కొన్ని డమ్మీ పీసులు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అయితే.. యాపిల్ కంపెనీ మాత్రం దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

తాజాగా సోషల్ మీడియాలో వస్తున్న అనధికారిక అంచనాల్ని చూస్తే మాత్రం.. ఐఫోన్ ఈసారి తన రూపాన్ని మార్చుకోవటం ఖాయంగా కనిపిస్తోంది. 7.8 అంగుళాల ఇన్నర్ డిస్ ప్లే ప్లస్ 5.5 అంగుళాల అవుటర్ స్క్రీన్ ఇవ్వనున్నట్లుగా చెబుతున్నారు. దీనని ఏ20 చిప్ తో తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. 5400 లేదంటే 5800ఎంఏహెచ్ బ్యాటరీ ఇవ్వాలన్న యోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు.

టెక్ మీడియా అంచనాల ప్రకారం ఈ సెప్టెంబరులోనే ఈ మడతపెట్టే ఫోన్ మార్కెట్ లోకి వస్తుందని చెబుతున్నారు. ఈ వాదనకు బలం చేకూరేలా ఒక కొత్త పాయింట్ మీద చర్చ మొదలైంది. అదేమంటే..యాపిల్ సంస్థ పెట్టి 50 సంవత్సరాలు నిండుతున్న వేళలో.. మడత పెట్టే ఫోన్ తీసుకువచ్చేలా ప్లానింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ఒకవేళ.. అలాంటి ఫోన్ మార్కెట్ లోకి వస్తుంటే మాత్రం ఐఫోన్ సరికొత్త సిరీస్ షురూ చేస్తున్నట్లు అవుతుంది. మరేం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News