భారత్‌ను విభజించే కుట్రలను అడ్డుకోవాలి.. మోదీ వ్యాఖ్యల అంతరార్థం ఏమిటి?

ఢిల్లీలో జరిగిన విజయదశమి (దసరా) వేడుకల్లో పాల్గొన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ, సామాజిక చర్చకు దారితీశాయి.

Update: 2026-10-21 03:39 GMT

ఢిల్లీలో జరిగిన విజయదశమి (దసరా) వేడుకల్లో పాల్గొన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ, సామాజిక చర్చకు దారితీశాయి. "దేశాన్ని విభజించేందుకు, సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయని, అలాంటి శక్తులను శత్రువులుగా గుర్తించి ప్రజలందరూ ఐక్యంగా తిప్పికొట్టాలి" అని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు వినగానే "మోదీ నేరుగా అమెరికా లేదా ఇతర విదేశీ శక్తులను ఉద్దేశించి అన్నారా? లేక దేశీయ రాజకీయ శక్తులను ఉద్దేశించారా?" అనే ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతోంది.

ప్రధాని మోదీ ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు?

ప్రధాని మోదీ తన ప్రసంగంలో ఏ దేశం పేరు గానీ లేదా ఏ నిర్దిష్ట రాజకీయ పార్టీ పేరును గానీ నేరుగా ప్రస్తావించలేదు. కానీ ఆయన వ్యాఖ్యల వెనుక ఉన్న విస్తృత సందర్భాన్ని పరిశీలిస్తే ఆయన రెండు రకాల శక్తుల పట్ల హెచ్చరికలు జారీ చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కులం, మతం, ప్రాంతం, భాష ఆధారంగా భారతీయ సమాజాన్ని విభజించడానికి ప్రయత్నించే అంతర్గత శక్తులు లేదా గ్రూపులు...భారతీయ సాంస్కృతిక ముద్రను, ప్రతీకలను ప్రతిఘటిస్తూ, దేశ ప్రయోజనాలకు భంగం కలిగించే శక్తులను మోదీ "జాతి శత్రువులు"గా అభివర్ణించారు. రాజకీయ ప్రయోజనాల కోసం దేశ ప్రతిష్ఠను మసకబారేలా చేసే వ్యూహాలను ఆయన తప్పుబట్టారు.

మోదీ అన్నది అమెరికానేనా?

సాధారణంగా అంతర్జాతీయ రాజకీయాల్లో విదేశీ జోక్యం, ఫండింగ్, లేదా ఎన్‌జీఓల రూపంలో విచ్ఛిన్నకర పోకడలు వస్తున్నాయనే ఆరోపణలు తరచూ వినిపిస్తుంటాయి. అయితే ఈ విజయదశమి ప్రసంగంలో మోదీ అమెరికాను ఉద్దేశించి ఈ పరోక్ష మాటలు మాట్లాడినట్టుగా తెలుస్తోంది.

ఇటీవల దేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ నిర్ణయాలు, ఓటర్ల జాబితాల సమగ్ర సవరణ , ఇతర రాజకీయ వివాదాలపై ప్రతిపక్షాల నిరసనలు, చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ప్రధాని మోదీ రామరాజ్య భావనను స్మరిస్తూ.."శ్రీరాముడు లంకను చేరుకోవడానికి ప్రజలందరినీ ఐక్యం చేసి ఎంతో కష్టమైన లక్ష్యాన్ని సాధించారు. అదేవిధంగా 'వికసిత్ భారత్' సాధనకు సవాళ్లు ఎదురైనా, సమాజంలోని అందరూ ఐక్యంగా శత్రు శక్తులను ఓడించాలి" అని పిలుపునిచ్చారు.

మోదీ ప్రసంగం విదేశీ దేశాన్ని లక్ష్యంగా చేసుకున్నవే కావచ్చు. ఇదే కాకుండా కుల-మత ప్రాతిపదికన విడగొట్టే అంతర్గత, బాహ్య విభజన శక్తులపై భారతీయులందరినీ హెచ్చరించేందుకు ఇచ్చిన పిలుపు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అయిన విజయదశమి వేళ దేశ ఐక్యతను కాపాడుకోవడమే నిజమైన వికసిత్ భారత్ వైపు వేసే అడుగు అని ప్రధాని స్పష్టం చేశారు.




Tags:    

Similar News