'మైల్ స్టోన్ మూమెంట్'... ఫుల్ జోష్ లో భారత ఆర్మీ ఆసక్తికర కామెంట్స్!

ఈ సందర్భంగా ఇండియన్ ఆర్మీ ఎక్స్ వేదికగా స్పందించింది. ఈ సందర్భంగా... హెలికాప్టర్ల చిత్రాలను పంచుకుంటూ.. ఈ రాకను "మైలురాయి క్షణం"గా అభివర్ణించింది.;

Update: 2025-07-22 13:15 GMT

భారతదేశం తన అమ్ములపొదిని సరికొత్త స్వదేశీ, విదేశీ ఆయుధాలతో నింపుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత ఆయుధ సంపత్తిపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ నడుస్తోందని అంటున్నారు. ప్రధానంగా మేడిన్ ఇండియా ఆయుధాలపై ప్రపంచంలో చర్చ జరుగుతుందన్ని మోడీ ఇటీవల తెలిపారు. ఈ నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ ఓ మైల్ స్టోన్ మూమెంట్ ని తాజాగా పంచుకుంది.

 

అవును... మార్చి 2024లో మొదటి ఆర్డర్ ఇవ్వగా... సుమారు 15 నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఓ మైలురాయి క్షణం ఆవిష్కృతమైంది. భారత సైన్యం సుదీర్ఘ నిరీక్షణ మంగళవారం ముగిసింది. ఇందులో భాగంగా... అపాచీ హెలికాప్టర్ల మొదటి బ్యాచ్ జోధ్‌ పూర్‌ లోని హిండన్ ఎయిర్‌ బేస్‌ కు చేరుకుంది. మూడు హెలికాప్టర్లు యుఎస్ మిలిటరీ కార్గో విమానం నుండి బయటకు వచ్చాయి. ఇది మన ఆర్మీకి పెద్ద ప్రోత్సాహం అని అంటున్నారు.

వాస్తవానికి 2020లో భారత వైమానిక దళానికి బోయింగ్.. 22ఈ మోడల్ అపాచీల డెలివరీని పూర్తి చేసింది. దీంతో 2024లో భారత సైన్యం కోసం ఆరు ఏహెచ్-64ఈలను సరఫరా చేయడానికి ఒప్పందంపై సంతకం చేసింది. ఈ క్రమంలో సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తాజాగా ప్రపంచంలోనే అత్యంత అధునాతన మల్టీ రోల్ కంబాట్ హెలికాప్టర్లలో ఒకటైన ఏహెచ్-64ఈ అపాచీ ఛాపర్లు మూడింటిని బోయింగ్ డెలివరీ చేసింది.

ఈ సందర్భంగా ఇండియన్ ఆర్మీ ఎక్స్ వేదికగా స్పందించింది. ఈ సందర్భంగా... హెలికాప్టర్ల చిత్రాలను పంచుకుంటూ.. ఈ రాకను "మైలురాయి క్షణం"గా అభివర్ణించింది. ఇది ఆర్మీ కార్యాచరణ సామర్థ్యాలను పెంచుతుందని పేర్కొంది. ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన, నిరూపితమైన అటాక్ హెలికాప్టర్ గా బోయింగ్ దీన్ని అభివర్ణించింది.

ఈ అపాచీ భారీగా ఆయుధాలు కలిగి ఉంది. ఇందులో భాగంగా షార్ట్ రేంజ్ పోరాటం కోసం 30 ఎంఎం ఎం230 చైన్ గన్.. ఒక ఏరియా అణచివేత కోసం 70ఎంఎం హైడ్రా రాకెట్లు, ఆరు కిలోమీటర్ల దూరం నుండి సాయుధ వాహనాలు, ట్యాంకులను ఛేదించగల ఏజీఎం-114 హెల్ఫైర్ క్షిపణులను ఈ అపాచీ కలిగి ఉంది.

కాగా... సుమారు 40 సంవత్సరాలకు పైగా విస్తరించిన వారసత్వంతో అపాచీ 1980ల నుండి ప్రతి ప్రధాన అమెరికా సైనిక ఆపరేషన్‌ లోనూ కీలక భూమిక పాత్ర పోషించింది. వాస్తవ ప్రపంచ పోరాటంలో తదైన ప్రభావాన్ని చూపించింది.

Tags:    

Similar News