ఓట‌ర్ల జాబితా: అన్ని పార్టీల్లోనూ అదే షాక్ ..!

ఓట‌ర్ల జాబితాను తాజా ప‌రుస్తున్నామ‌ని కేంద్ర ఎన్నికల సంఘం ప్ర‌క‌టించింది. దీనిపై అన్ని పార్టీల అభి ప్రాయాల‌ను తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది.;

Update: 2025-07-17 03:30 GMT

ఓట‌ర్ల జాబితాను తాజా ప‌రుస్తున్నామ‌ని కేంద్ర ఎన్నికల సంఘం ప్ర‌క‌టించింది. దీనిపై అన్ని పార్టీల అభి ప్రాయాల‌ను తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఈ క్ర‌మంలో వైసీపీ ఇప్ప‌టికే త‌న అభిప్రాయాన్ని వెల్లడించింది. తాజాగా టీడీపీ నాయ‌కులు కూడా కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని క‌లిసి.. త‌మ వివ‌ర‌ణ ఇచ్చారు. కొన్ని సూచ‌న‌లు కూడా చేశారు. ఏ ఒక్క ఓట‌రుకు అన్యాయం జ‌ర‌గ‌కూడ‌ద‌ని పేర్కొన్నారు. కానీ, ఇక్క‌డే అస‌లు స‌మ‌స్య వ‌చ్చింది. 2003కు ముందు ఓట‌రుగా ఉన్న వ్య‌క్తులు త‌మ గుర్తింపును నిరూపించుకోవాల్సి వ‌చ్చింది.

ఇది ఓట‌ర్లకు ఎలా ఉన్నా.. పార్టీల‌కు మాత్రం తీవ్ర స‌మ‌స్య‌గా మారింది. ఎందుకంటే.. గిరిజ‌నులు, ఎస్సీ ల్లోని 50 ఏళ్లు పైబ‌డిన మెజారిటీ ఓట‌ర్ల‌కు 2003 కు ముందు గుర్తింపు కార్డులు అంటే.. క‌ష్ట‌మే. ముఖ్యంగా జ‌న‌న ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు, వారి విద్య‌కు సంబంధించిన ప‌త్రాలు అందించ‌డం అంటే.. సాధ్య‌మ‌య్యేది కాదు. కానీ, కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం వీటినే కోరుతోంది. ఈ నేప‌థ్యంలో ఆయా ఓట‌ర్ల‌కు ఓటు హ‌క్కు పోయే ప్ర‌మాదం ఉంద‌న్న‌ది స్ప‌ష్టంగా తెలుస్తోంది.

ఈ ఏడాది ఎన్నిక‌లు జ‌రిగే బీహార్‌లో 35.45 ల‌క్ష‌ల మంది ఓట‌ర్ల‌ను ఇదే కార‌ణంతో ప‌క్క‌న పెట్టారు. ఇప్పు డు ఏపీలో కూడా అదే జ‌రిగితే.. క‌ష్ట‌మ‌న్న‌ది తాజాగా టీడీపీ వెలిబుచ్చిన అభిప్రాయం. ఇది ఒక్క టీడీపీకే కాదు.. ఎస్సీ, ఎస్టీలను కీల‌క‌మైన ఓటు బ్యాంకుగా ప‌రిగణించే వైసీపీకి కూడా ఇది చాలా క‌ష్ట‌మే. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకునే అధికారంలోకి రావాల‌ని వైసీపీ భావిస్తున్న నేప‌థ్యంలో ఓటు బ్యాంకు గుండు గుత్త‌గా పోతే.. ఇబ్బందులు స‌హ‌జం. అయితే.. దీనికి ప్ర‌త్యామ్నాయాలు క‌నిపించ‌డం లేదు. ఎన్నిక‌ల సంఘం కూడా దిగిరావ‌డం లేదు.

ఈ ప‌రిణామాల క్ర‌మంలో అన్ని పార్టీలు కూడా.. అంత‌ర్మ‌థ‌నం చెందుతున్నాయ‌న్న‌ది వాస్త‌వం. అయితే.. పైకి మాత్రం గంభీరంగా ఉన్నాయి. ఈ ఏడాది చివ‌రిలో ఏపీ విష‌యంపై కేంద్ర ఎన్నిక‌ల సంఘం నిర్ణ యం తీసుకునే అవ‌కాశం ఉంది. ఈ క్ర‌మంలో ఓట‌ర్ల జాబితాలో అన‌ర్హుల పేరుతో సంఖ్య‌ను త‌గ్గించుకుం డా చూసేందుకు ఎవ‌రి ప్ర‌య‌త్నాలు వారు చేయాల‌ని నిర్ణ‌యించారు. అయితే.. ఇక్క‌డ ఓ లాజిక్ ఉంది. టీడీపీ అనుకూల ఓటు బ్యాంకును ఆ పార్టీ, వైసీపీ అనుకూల ఓటు బ్యాంకును ఈ పార్టీ కాపాడుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఈ రెండు పార్టీల్లోనూ.. గుబులు స్టార్ట‌యింది. చివ‌ర‌కు ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News