బ్రేకింగ్ : ఏపీ టెట్ షెడ్యూల్ రిలీజ్ చేసిన లోకేష్

ఏపీలో నిరుద్యోగ యువతకు కొత్త అవకాశం దక్కనుంది. చెప్పిన మాట ప్రకారం ఏపీలోని టీడీపీ కూటమి ప్రభుత్వం ఏపీ టెట్-2026 షెడ్యూల్‌ను విద్యా శాఖ మంత్రి లోకేశ్ విడుదల చేశారు.

Update: 2026-06-04 18:12 GMT

ఏపీలో నిరుద్యోగ యువతకు కొత్త అవకాశం దక్కనుంది. చెప్పిన మాట ప్రకారం ఏపీలోని టీడీపీ కూటమి ప్రభుత్వం ఏపీ టెట్-2026 షెడ్యూల్‌ను విద్యా శాఖ మంత్రి లోకేశ్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ని ఈ నెల 5వ తేదీన విడుదల చేయనున్నారు. ఇక ఆ ఆ రోజు నుంచి జులై 5వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని మంత్రి వెల్లడించారు.

ఆగస్టులో పరీక్షలు :

అదే విధంగా జులై 25 నుంచి హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. పరీక్షలు ఆగస్టు 5వ తేదీ నుంచి 21వ తేదీ వరకూ పరీక్ష నిర్వహిస్తామని లోకేష్ చెప్పారు. సెప్టెంబర్ 15వ తేదీ ఫలితాలు వెల్లడిస్తామని నారా లోకేష్ ట్వీట్ చేశారు. దాంతో నిరుద్యోగ ఉపాధ్యాయులకు ఇది ఒక మంచి అవకాశంగా మారుతోంది అని అంటున్నారు. అంతే కాదు విడతల వారీగా డీఎస్సీని నిర్వహిస్తామని అందరికీ చాన్స్ దక్కుతుందని ప్రభుత్వం చెప్పిన మాటను కూడా నిలబెట్టుకుంటోందని చెబుతున్నారు.

అక్టోబర్ లో డీఎస్సీ :

మరో వైపు చూస్తే ఇక ఈ ఏడాది అక్టోబరులో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని కూడా మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. దాంతో ఉపాధ్యాయ ఖాళీలు ఈసారి కూడా పెద్ద ఎత్తున భర్తీ అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గత ఏడాది ఏకంగా పదహారు వేల టీచర్ పోస్టులను మెగా డీఎస్సీ పేరుతో నిర్వహించి నియామకాలు చేశారు. దాంతో ఏళ్ళ తరబడి చూస్తూ వస్తున్న నిరుద్యోగ ఉపాధ్యాయులు అంతా లబ్దిని పొందారు. ఏడాది తిరిగేసరికల్లా మరో డీఎస్సీ నోటిఫికేషన్ ని రిలీజ్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

నిరుద్యోగ ఉపాధ్యాయ వర్గంలో హర్షం :

ఏపీలో మొత్తం అరవై వేల దాకా ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే ఇటీవల పదవీ విరమణ చేసిన చోట ఏర్పడుతున్న ఖాళీలతో మరిన్ని కొత్త పోస్టులకు అవకాశం ఉంది. ఇలా క్రమం తప్పకుండా ఠంచనుగా డీఎస్సీ నోటిఫికేషన్స్ ఇవ్వడం ద్వారా పాఠశాలలలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇక తాజాగా మంత్రి లోకేష్ చేసిన ఈ ట్వీట్ తో నిరుద్యోగ ఉపాధ్యాయ వర్గంలో హర్షం వ్యక్తం అవుతోంది.

Tags:    

Similar News