ఏపీ వర్సెస్ తెలంగాణ: అదే కిరికిరి!
అదే సమయంలో సుప్రీంకోర్టులో గతంలో బీఆర్ ఎస్ నాయకురాలి హోదాలో కవిత వేసిన.. పోలవరం ప్రాజెక్టుపై పిటిషన్‌లోనూ తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఇంప్లీడ్ కావడానికి రెడీ అయింది.;
ఏపీ, తెలంగాణల మధ్య నెలకొన్న నీటి వివాదాలు ఏమాత్రం సమసి పోవడం లేదు. పైకి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహకరించుకుంటామని.. చర్చలు చేపడదామని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఆ దిశగా అడుగులు పడడం లేదు. రాష్ట్రం విడిపోతే నీటి యుద్ధాలు జరుగుతాయని గతంలో ముఖ్యమం త్రిగా వ్యవహరించిన కిరణ్‌కుమార్ రెడ్డి చెప్పినట్టే.. ఇప్పటికీ ఆ పరిస్థితిలో ఎక్కడా మార్పు రావడం లేదు. తెలంగాణ, ఏపీలు నీటి విషయంలో పట్టు సడలించడం లేదు.
పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంపై ఏం చేస్తున్నారో చెప్పాలంటూ.. రెండు రోజుల కిందట ఏపీ సర్కారుకేంద్రానికి లేఖ రాసింది. ఈ విషయం తొలుత గోప్యంగా ఉన్నప్పటికీ.. తర్వాత బహిరంగ మైంది. దీంతో తెలంగాణ రగిలిపోతోంది. ఈ క్రమంలో తాజాగా శుక్రవారం.. అసలు ఏపీ ఎలాంటి అనుమ తులు లేకుండా ఇప్పటికే నిర్మించిన ప్రాజెక్టులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. కేంద్రానికి 20 పేజీల లేఖను సంధించింది.
అదేసమయంలో సుప్రీంకోర్టులో గతంలో బీఆర్ ఎస్ నాయకురాలి హోదాలో కవిత వేసిన.. పోలవరం ప్రాజెక్టుపై పిటిషన్‌లోనూ తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఇంప్లీడ్ కావడానికి రెడీ అయింది. ఈ కేసు విచా రణ వచ్చే నెలలో సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఈ క్రమంలో న్యాయసలహాలు ముమ్మరం చేసిన రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో రాష్ట్రానికి జరిగే అన్యాయం పై సుప్రీంకోర్టు ఇంప్లీడ్ కావాలని నిర్ణయించింది.
మరోవైపు.. 2014 రాష్ట్ర విభజన అనంతరం.. పోలవరం ముంపు ప్రభావిత మండలాలను ఏపీలో కలుపుకొ న్న విషయం తెలిసిందే. వీటిలో నాలుగు గ్రామాలను తిరిగి అప్పగించాలని తెలంగాణ నుంచి ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ఇటీవల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తాజాగా అదే ఖమ్మం జిల్లాకు చెందిన భట్టి విక్రమార్కలు సీఎం చంద్రబాబు ముందు ఈ అభ్యర్థనను పెట్టారు.
కానీ, ఏరికోరి పార్లమెంటులో చట్టాన్ని సవరించి మరీ కలుపుకొన్న మండలాలను తిరిగి ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు సిద్ధంగా లేరు. సో.. మొత్తంగా రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు పెరుగుతున్నాయే తప్ప.. తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో సీఎంలు వ్యక్తిగతంగా జోక్యం చేసుకుంటే తప్ప పరిష్కారం లభించదని పరిశీలకులు చెబుతున్నారు.