లోకేష్ జగన్ పవన్...ఈ ముగ్గురి మధ్యనే !
స్థానిక ఎన్నికల్లో రాజకీయ పార్టీలు పోటా పోటీగా వ్యూహ రచన చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అయితే ఇంటింటికీ తెలుగుదేశం అనే ఒక భారీ ప్రచార కార్యక్రమం చేపట్టింది.
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ధీటుగా మరో భీకర సమరానికి తెర లేచింది. మరో రెండు నెలల వ్యవధిలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. మొత్తానికి మొత్తం జనాలు ఈ ఎన్నికల్లోనూ ఓట్లు వేస్తారు. పల్లెలు పట్టణాలు మండలాలు నగరాలు అన్నింటికీ ఎన్నికలు ఉంటాయి. పైగా అన్ని వర్గాల ప్రజల అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. అంతే కాదు వివిధ సామాజిక వర్గాల ఆలోచనలు ప్రభుత్వం తీరు పట్ల వారి భావాలు కూడా స్థానిక ఎన్నికలలో ఎంతో కొంత వ్యక్తం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్ళ పై దాటింది. స్థానిక ఎన్నికల నాటికి రెండున్నరేళ్ళకు చేరువ అవుతుంది. దాంతో ప్రజలలో ఏమైనా అసంతృప్తి ఉందా లేక వారికి ఏ మేరకు సంతృప్తి స్థాయిలు ఉన్నాయన్నది కూడా ప్రాక్టికల్ గా తెలుసుకునే వీలు కలుగుతుంది.
పోటా పోటీగా :
స్థానిక ఎన్నికల్లో రాజకీయ పార్టీలు పోటా పోటీగా వ్యూహ రచన చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అయితే ఇంటింటికీ తెలుగుదేశం అనే ఒక భారీ ప్రచార కార్యక్రమం చేపట్టింది. ఇది రెండు నెలల పాటు సాగనుంది. ఇదంతా స్థానిక ఎన్నికల కోసమే అన్నది తెలిసిందే. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం అలాగే అభివృద్ధి వీటి మీద నేరుగా ఇళ్ళకు వెళ్ళి ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులు వివరించడం అన్నది టీడీపీ వ్యూహంలో భాగంగా చూస్తున్నారు. ఆ మీదట ఎటూ ఎన్నికల ప్రచారం ఉంటుంది. ముందు గ్రౌండ్ లెవెల్ లో ఓటర్ కి ఒక పాజిటివ్ వైబ్ ని కలిగించేందుకే ఇంటింటికీ టీడీపీ అని అంటున్నారు.
లోకేష్ రంగంలోకి :
ఇక ఈసారి స్థానిక ఎన్నికల సమరంలో లోకేష్ నేరుగా రంగంలోకి దిగుతున్నారని అంటున్నారు. ఆయన టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్. ఒక విధంగా పార్టీని అంతా ఆయన చూస్తున్నారు. ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం గురించి నిరంతరం సమీక్ష కూదా చేస్తున్నారు. ఇక లోకల్ బాడీ ఎన్నికల్లో వ్యూహరచనలో కూడా యువనేత బిజీగా ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో లోకేష్ గట్టిగా పాల్గొనే చాన్స్ ఉందని అంటున్నారు. అలాగే అభ్యర్ధుల ఎంపిక కానీ మేయర్ వంటి కీలక స్థానాలకు సమర్ధులైన వారిని బరిలోకి దించడంలో కానీ లోకేష్ ఫుల్ ఫోకస్ పెట్టనున్నారు అని ప్రచారం సాగుతోంది. ఈ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిచి టీడీపీని తిరుగులేని స్థానంలో ఉంచాలని లోకేష్ పట్టుదలగా ఉన్నారని అంటున్నారు. ఒక విధంగా లోకేష్ సత్తాకు ఈ ఎన్నికలే ముందస్తు పరీక్ష అని చెబుతున్నారు.
పవన్ పట్టుదలకు :
జనసేన అంటే త్యాగాల పార్టీ కాదని పట్టుబట్టి సాధించుకునే పార్టీ అని పవన్ కళ్యాణ్ ఈసారి నిరూపించబోతున్నారు అని అంటున్నారు. అంతే కాకుండా అధిక సీట్లను పొత్తులో రాబట్టడమే కాకుండా 2024 నాటి సెంట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సక్సెస్ ని రిపీట్ చేయాలని పవన్ చూస్తున్నారు అని అంటున్నారు. గ్రాస్ రూట్ లెవెల్ లో బలమైన పునాది వేసుకుని పార్టీని 2029 ఎన్నికల నాటికి తిరుగులేని శక్తిగా మార్చాలని పవన్ గట్టి సంకల్పం తీసుకున్నారని అంటున్నారు. ఒక విధంగా పవన్ ఇంత సీరియస్ గా ఎన్నికల వ్యూహాలను రచించడం అంటే జనసేన దూకుడు వేరే లెవెల్ అవుతుందని ఆ పార్టీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇక పవన్ వ్యూహాలకు ఎన్నికలలో జనసేన అందుకే ఫలితాలకు ఒక మచ్చుతునకగా లోకల్ ఫైట్ నిలుస్తుందని అంటున్నారు. అలా జరగాలని అంతా కోరుకుంటున్నారు.
జగన్ సైతం సై అంటూ :
జగన్ కూడా స్థానిక ఎన్నికల బరిలోకి సీరియస్ గానే అడుగు పెడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టే జగన్ ఈసారి మాత్రం లోకల్ సత్తా చూపాలని తపన పడడం వైసీపీ రాజకీయ జాతకాన్ని మార్చనుందా అన్న చర్చ సాగుతోంది. అదే సమయంలో జగన్ 2024 నాటి చేదు ఫలితాలను నాటి అనుభవాలని మరిపించేలా లోకల్ బాడీ ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ జోరుని చూపించాలని అనుకుంటున్నారు. దాంతో తాను మాత్రమే దూకుడు చేయడం కాకుండా పార్టీని కూడా పరుగులు పెట్టించాలని చూస్తున్నారు. దాంతో ఈసారి స్థానిక సమరం ప్రధానంగా లోకేష్ జగన్ పవన్ ల మధ్యనే కేంద్రీకృతం అవనుంది అని అంటున్నారు.