ఏడాదిలోనే ఎంత మార్పు... కళ్లకు కడుతున్న సుపరిపాలన తొలి అడుగు!

ఇదే సమయంలో... ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను గుర్తించి లక్ష మంది మార్గదర్శుల చేత సాయం అందించే లక్ష్యం పెట్టుకున్నారు.;

Update: 2025-07-02 13:51 GMT

ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఏడాది కాలం పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఇటీవల "సుపరిపాలనలో తొలి అడుగు" కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇదే సమయంలో నెల రోజుల పాటు "ఇంటింటికీ సుపరిపాలన తొలి అడుగు" కార్యక్రమాన్ని తలపెట్టింది. ఏడాది కాలంగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు నేరుగా వివరించడం మొదలుపెట్టింది.

ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఏడాది కాలం (మాత్రమే) పూర్తయ్యింది. ఈ కొత్త ప్రభుత్వం కొలువుదీరే నాటికి రాష్ట్రం ఆర్థికంగా చతికిలపడి ఉంది! రాబోయే కాలానికి కూడా అప్పులు తీసేసుకున్న పరిస్థితిలో రాష్ట్రం ఉంది! మరోవైపు చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీల కోసం చంద్రబాబుపై నమ్మకంతో ప్రజల ఎదురుచూపులు కనిపిస్తున్నాయి.

వారికి మరో మాట చెప్పలేని పరిస్థితి.. హామీల అమలుపై మడమ తిప్పే ఆలోచనే లేని మనస్థితి. ఏది ఏమైనా... తనను నమ్మి అమరావతికి భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాలి. పోలవరాన్ని పూర్తి చేసి రాష్ట్రాన్ని మరింత సస్యశ్యామలం చేయాలి. సూపర్ 6 హామీలను క్రమం తప్పకుండా అమలు చేయాలి. రూ.1000 ఒకేసారి పెంచిన పెన్షన్ ను ఏరియర్స్ తో పాటు అందించాలి.

ఈ పరిస్థితుల్లో సుదీర్ఘ అనుభవం అక్కరకు వచ్చింది.. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలకు ఇచ్చిన మాట తప్పకూడదన్న ఆలోచనే మదిలో కదలాడుతుంది.. మరోవైపు కేంద్రం నుంచి మద్దతు దొరుకుతుంది.. ఈ సమయంలో బాబు తగ్గలేదు.. తగ్గాలనుకోలేదు! తన ఫస్ట్ ప్రియారిటీ... ఏపీ లో ఏ అంటే అమరావతి, పీ అంటే పోలవరం అని స్పష్టం చేశారు. ఆ దిశగా పనులు మొదలుపెట్టారు.

ఇదే సమయంలో అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధిపైనా దృష్టి సారించారు. ప్రధానంగా ఏపీ ఆర్థిక రాజధానిగా పిలిచే విశాఖను ఐటీ హబ్ గా మారుస్తున్నారు. అత్యున్నతమైన సంస్థలతో ఒప్పందాలు చేసుకుని, పెట్టుబడులు పెట్టిస్తున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యకు చరమగీతం పాడేలా ప్రణాళికలు రచించారు! నిరుద్యోగ భృతినీ మరిచిపోకున్నారు!

స్కూల్స్ స్టార్ట్ అయ్యే సమయానికే విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్స్ లో "తల్లికి వందనం" నగదు జమ చేశారు. అధికారంలోకి వచ్చిన తొలి నెలలోనే రూ.1000 రూపాయలు పెన్షన్ పెంచి, ఏరియర్స్ తో పాటు అందించారు. మరో నెలన్నర రోజుల్లో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం మొదలుపెట్టబోతున్నారు. రైతులకు సాయం అందించనున్నారు.

ఇదే సమయంలో... ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను గుర్తించి లక్ష మంది మార్గదర్శుల చేత సాయం అందించే లక్ష్యం పెట్టుకున్నారు.. 2029 కల్లా పేదరికం లేని సమాజ నిర్మాణం దిశగా ముందుకెళ్తున్నారు! 'అన్నదాతా సుఖీభవ' ద్వారా కేంద్రం రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసిన రోజే తామూ వేస్తామని ప్రకటించారు.

ఏ రాష్ట్రంలో లేనివిధంగా రూ.9.54 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని.. ఇప్పటికే రూ.5 లక్షల కోట్ల విలువైన పనులు ప్రారంభమయ్యాయని.. ఫలితంగా 8.50 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెబుతున్నారు. ఇవన్నీ ఒక్క ఏడాది పాలనలోనే సాధ్యం అయ్యాయి!

ఈ విషయం ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చి చెప్పుకోవడం లేదు.. ఇంటింటికీ వెళ్లి మరీ చెబుతుంది.. ఈ సమయంలో ఆ ఫలితాలు అనుభవించిన ప్రజలు, టీడీపీ నేతలకు కృత్జతలు చెబుతున్నారు.. చంద్రబాబు ప్రభుత్వానికి వందనం అని అంటున్నారు. మరో నాలుగేళ్లు ఇలానే కొనసాగితే ఇంకో నాలుగు దఫాలు ఏపీలో కూటమిదే అధికారం అని ఆశీర్వదిస్తున్నారు.

తాజాగా.. ఇంటింటికీ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా... గడప గడపకూ వెళ్తున్న టీడీపీ ఎమ్మెల్యేలకు, మంత్రులకూ ఎదురవుతున్న అనుభవాలే ఇవి. దీంతో... చంద్రబాబు ఏడాది కష్టం వృథా పోలేదని.. లోకేష్ పనితీరు వ్యర్థం కాలేదని.. ఫలితంగా, ప్రజల నమ్మకం వమ్ముకానివ్వలేదని తమ్ముళ్లు, ప్రజలతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News