డబుల్ ఇంజన్ సర్కార్ డబుల్ స్పీడ్ : చంద్రబాబు
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు డబుల్ స్పీడ్‌తో ముందుకు సాగుతోందని సీఎం చంద్రబాబు తెలిపారు.;
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు డబుల్ స్పీడ్‌తో ముందుకు సాగుతోందని సీఎం చంద్రబాబు తెలిపారు. అన్ని అంశాల్లోనూ కేంద్ర ప్రభుత్వం నుంచి మంచి సహకారం అందుతోందని తెలిపారు. గుంటూరులో జరిగిన డాక్ సేవక్(తపాలా సిబ్బంది) కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాజమాత సింధియా ఎన్టీఆర్ సహా తనతో కూడా కూడా కలిసి పనిచేశారని చెప్పారు. మాధవరావు సింధియాతో కూడా తాను కలిసి పనిచేశానని గుర్తు చేసుకున్నారు.
సిందియా గ్రామం విశాఖ నగరంలోని గాజువాకలో ఉందని, ఆ గ్రామానికి .. సింధియా కుటుంబానికి ఎంతో అనుబంధం ఉండడం సంతోషకరమన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో కూడా పరోక్షంగా కీలకపాత్ర పోషించారని కొనియాడారు. ప్రజలు సాంకేతికతను విరివిగా వినియోగిస్తున్నా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజె న్స్ వచ్చినా గ్రామీణ డాక్ సేవక్ ల మానవత్వానికి రీప్లేసెమెంట్ లేదని సీఎం కొనియాడారు. సూపర్ సిక్స్ పథకాలను బ్యాంకింగ్, బీమా, డిబిటి అనుసంధాన సేవలు, వంటివన్నీ తపాలా సిబ్బంది ద్వారానే అందుతున్నాయన్నారు.
ప్రధాని మోడీ దార్శనిక నాయకత్వంలో 11వ ఆర్ధిక వ్యవస్ధగా ఉన్న దేశం కేవలం.. 11 సంవత్సరాలలో నా లుగవ ఆర్ధిక వ్యవస్ధగా మారిందన్నారు. 2047 కల్లా ప్రపంచంలో నంబర్ 1 ఆర్ధిక వ్యవస్దగా మారుతుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు. హ్యూమన్ టచ్ అనేది యంత్రాల వల్ల కాదు, మనుషులే ఇవ్వాలని సూచించా రు. తపాలా సిబ్బందికి ఎలక్ట్రికల్ సైకిల్ అందించాలని కేంద్రాన్ని కోరనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ డబుల్ స్పీడ్ తో ముందుకు వెళ్తోందన్న సీఎం.. అన్ని అంశాల్లోనూ కేంద్రం నుంచి సహకారం అందుతోందని చెప్పారు.
ప్రజలు మెచ్చేలా రాజధాని!
మొన్నటి వరకు శ్మశానమన్న అమరావతిని దేవతల రాజధాని, ప్రజల రాజధానిగా, ప్రపంచం మెచ్చేలా చేస్తామని చంద్రబాబు చెప్పారు. పోలవరం పూర్తి చేసి, ప్రతి ఎకరాకు 2027 గోదావరి పుష్కరాలలోపు నీరు ఇస్తామని హామీ ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంటు ను కేంద్ర సహకారంతో లాభాల బాట పట్టించామన్న చంద్రబాబు... ఈ నెలలో 54 కోట్ల రూపాయల లాభం ఆర్జించిందని తెలిపారు. ఢిల్లీలో ఎఐ సదస్సుకు 80 దేశాలు వచ్చాయన్న చంద్రబాబు... మన దేశ ఎ.ఐ అప్లికేషన్లు చూసి విదేశీయులు సైతం ఆశ్చర్యపోయారని తెలిపారు.