ఆనం ఆపశోపాలు.. ఏం జరిగింది.. ?
అంతేకాదు.. దేవదాయ శాఖ అంటే.. పని లేదని చాలా మంది అనుకుంటున్నారని.. కానీ, ఎక్కువ పని ఉండేది ఈ శాఖకేనని ఆయన చెప్పడం గమనార్హం.;
సీఎం చంద్రబాబు టీంలో ఉన్న మంత్రుల్లో చాలా మంది యాక్టివ్‌గానే ఉన్నారు. అయితే.. దేవదాయ శాఖ మంత్రిగా ఉన్న ఆనం రామనా రాయణరెడ్డి మాత్రం చాలా వరకు వెనుకబడ్డారనే టాక్ వినిపిస్తోంది. ఈయనది ఒక చోట కూర్చుని చేసే పనికాదు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలి. ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగి నా.. అది సర్కారుకు బ్యాడ్ నేమ్ తెస్తుంది. దీంతో తరచుగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి.. ఆయా ఆలయా లను దర్శించి.. మార్పులు, చేర్పులు చేయాల్సి ఉంటుంది.
కానీ.. జిల్లాల్లో పర్యటించే పరిస్థితి లేదని ఆనం చెబుతున్నారు. ఇటీవల జరిగిన మంత్రి వర్గ సమావేశానికి కూడా ఆయన చాలా ఆలస్యంగా వచ్చారు. ఈ సందర్భంగా పలు ఆలయాల్లో జరుగుతున్నపనులు, వస్తున్న ఫిర్యాదులపై సీఎం చంద్రబాబు ఆయనను ప్రశ్నించారు. దీనికి ఆయన ముక్తసరిగా సమాధానం చెప్పారు. తాను జిల్లాల్లో పర్యటించలేక పోతున్నానని ఆయన చెప్పినట్టు తెలిసింది. వయసు సహా.. ఆరోగ్య సమస్యలను ఆయన ప్రస్తావించారు.
అంతేకాదు.. దేవదాయ శాఖ అంటే.. పని లేదని చాలా మంది అనుకుంటున్నారని.. కానీ, ఎక్కువ పని ఉండేది ఈ శాఖకేనని ఆయన చెప్పడం గమనార్హం. అంతేకాదు.. ప్రతి ఒక్కరినీ సంతృప్తి పరచాల్సి ఉంటుందని కూడా వ్యాఖ్యానించారు. తనకు కొన్ని కొన్ని సందర్భాల్లో టెన్షన్ కూడా పెరుగుతోందన్నారు. ఇటీవల తిరుమల లడ్డూ విషయంపై వివాదం చెలరేగినప్పుడు.. ఆనం పెద్ద గా రియాక్ట్ కాలేదు. దీనికి కూడా ఆయన టెన్షనే కారణమని చెప్పినట్టు తెలిసింది.
ఈ పరిణామాలతో సీఎం చంద్రబాబు ఆయనను ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. మరో వైపు.. నియోజకవర్గంలో కూడా.. ఆనం పెద్దగా పర్యటించడం లేదు. ఆత్మకూరులోని నాలుగు మండలా లకు.. నలుగురు అనుచరులను పెట్టి .. వారి ద్వారా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాను అప్పుడప్పు డు వెళ్లి.. ఆయా కార్యక్రమాలను చక్కదిద్దుతున్నారు. ఇంతకు మించి.. ఆనం ఏమీ చేయడం లేదని తెలుస్తోంది. సో.. రేపు మంత్రి వర్గ విస్తరణ జరిగితే.. ఆనంకు శాఖనైనా మార్చడమో.. లేదా తప్పించడమో తప్పదన్న వాదన వినిపిస్తోంది.