కార్పొరేషన్లలో భారీగా పెరిగిన వార్డులు- జీవీఎంసీ టాప్

ఇక ఏపీలో ఉన్న 13 కార్పొరేషన్లలో వరస ప్రకారం చూస్తే పెరిగిన వార్డుల వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరులో 54 వార్డులు ఉంటే అవి కాస్తా 72 వార్డులు అవుతున్నాయి.;

Update: 2026-04-01 23:30 GMT

ఏపీలోని పలు కార్పొరేషన్లలో భారీగా వార్డులను పెంచుతూ కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఏపీలో అత్యధిక వార్డులు ఉన్న కార్పొరేషన్ గా మహా విశాఖ నగర పాలక సంస్థ జీవీఎంసీ నిలిచింది. అక్కడ 98 నుంచి ఏకంగా 120 దాకా వార్డులు పెరిగాయి. ఆ తరువాత స్థానంలో విజయవాడ కార్పొరేషన్ ఉండబోతోంది. ఇక్కద 64 వార్డులు ఉండేవి, వాటిని 86 వార్డులుగా పెంచారు. ఇక మూడవ స్థానంలో గుంటూరు కార్పోరేషన్ ఉంది. ఇక్కడ 57 వార్డులు ఉంటే దానికి 76 వార్డులుగా చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదీ పక్కా లెక్క :

ఇక ఏపీలో ఉన్న 13 కార్పొరేషన్లలో వరస ప్రకారం చూస్తే పెరిగిన వార్డుల వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరులో 54 వార్డులు ఉంటే అవి కాస్తా 72 వార్డులు అవుతున్నాయి. కర్నూల్ కార్పోరేషన్ కి 52 వార్డులు ఉంబ్టే 68 వార్డులుగా పెరుగుతున్నాయి. తిరుపతికి 50 వార్డులు ఉంటే 66 వార్డులుగా మారుతున్నాయి. కడపకు 50 వార్డులు ఉంటే అవి 66కి చేరుకున్నాయి. ఏలూరుకి 50 వార్డులు ఉంటే 62 వార్డులుగా చేశారు. అనంతపురం కార్పోరేషన్ కి 50 వార్డులు ఉంటే 62గా చేశారు. ఒంగోలుకి 50 వార్డులు ఉంటే 62గా, విజయనగరంలో 50 వార్డులు ఉంటే 62గా చేశారు. చిత్తూరు కార్పోరేషన్ కి 50 వార్డులు ఉంటే 60గా మచిలీపట్నానికి 50 వార్డులు ఉంటే 60 గా పెంచారు.

ఆశావహులకు చాన్స్ :

ఇలా చూసుకుంటే మొత్తం పెరిగిన వార్డులు రాష్ట్రవ్యాప్తంగా 197 గా ఉన్నాయి. దీంతో ఎంతో మంది ఆశావహులకు పోటీ చేసేందుకు అవకాశం లభిస్తోంది. కార్పోరేటర్ గా కీలకమైన పదవులలో వారు కూర్చునేందుకు మహత్తరమైన చాన్స్ గా ఇది ఉండబోతోంది. కేవలం కార్పోరేషన్లకే కాదు మునిసిపాలిటీలకు కూడా వార్డులను రాష్ట్రవ్యాప్తంగా పెంచుతున్నారు. దాంతో వందకు పైగా ఉన్న మునిసిపాలిటీలలో కూడా ఈ పెంపు వల్ల అంతకు నాలుగైదింతలు అవకాశాలు పెరుగుతాయని అంటున్నారు.

పోటీకి బంగారు అవకాశం :

మొత్తం మీద చూస్తే కనుక ప్రస్తుతం పట్టణ స్థానిక సంస్థలలో ఇప్పటిదాకా ఉన్న ప్రజా ప్రతినిధులకు తోడుగా మరో ఇరవై నుంచి పాతిక శాతం అదనంగా చేరుతారు అని అంటున్నారు. కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి. ఎంతో మంది స్థానిక ఎన్నికల్లో పోటీకి తయారుగా ఉన్నారు. ఇపుడు వీరంతా పోటీకి బంగారు అవకాశం లభిస్తోంది. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల రాజకీయ ఆశావహులలో పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం అవుతోంది.

Tags:    

Similar News