ఒక్క ఛాన్స్ కోసం చూస్తున్నారు.. హీటెక్కిన ఏపీ పాలిటిక్స్ ..!
ఒక్క `ఛాన్స్`- ఈ మాట ఏపీ ప్రజలకు కొత్తకాదు. నాయకులకు కూడా కొత్తకాదు. అయితే.. ఇప్పుడు ఈ మాట క్షేత్రస్థాయినాయకుల నోటి నుంచి వినిపిస్తోంది.
ఒక్క `ఛాన్స్`- ఈ మాట ఏపీ ప్రజలకు కొత్తకాదు. నాయకులకు కూడా కొత్తకాదు. అయితే.. ఇప్పుడు ఈ మాట క్షేత్రస్థాయినాయకుల నోటి నుంచి వినిపిస్తోంది. పదవులు దక్కని వారు కూటమి పార్టీల్లో చాలా మంది ఉన్నారు. వారంతా ఒక్క ఛాన్స్ కోసం వేచి చూస్తున్నారు. మరో 1000కిపైగా పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని చెబుతున్నారు. అదే సమయంలో మంత్రి వర్గంపై ఆశలు పెట్టుకున్న టీడీపీ సీనియర్లు కూడా వేచి చూస్తున్నారు.
ఇక, వైసీపీ విషయానికి వస్తే.. పార్టీ పరంగా పుంజుకుంటుందో లేదో వారు అంచనాలు వేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి కూడా పార్టీ పుంజుకునే పరిస్థితి లేకపోతే.. ఎవరిక వారు సొంత దారులు వెతుక్కు నేందుకు తమ ఛాన్స్ తాము చూసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇలాంటి వారిలో ఎక్కువ మంది జనసేనపైనే ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు జనసేన ఒంటరి పోరుకు రెడీ అవుతుందన్న క్లూ ఇచ్చినా.. పదుల సంఖ్యలో పెద్ద నేతలు వైసీపీకిరాం రాం చెప్పడం ఖాయమని తెలుస్తోంది.
ఇదే సమయంలో కార్యకర్తలు కూడా.. తమ కు అనుకూలంగా ఉండే పార్టీలనే ఎంచుకుంటున్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ శిబిరాలు ఖాళీ అయ్యాయి. నాయకులు ఉన్నా..జెండా మోసే కార్యకర్తలు లేరు. వీరంతా కూడా.. తమకు కలిసి వచ్చిన పార్టీ కోసం వేచి ఉన్నారు. మహిళా నాయకులది కూడా దాదాపు ఇదే దారిగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన ఉంటే సరే.. లేకపోతే.. తమకు అవకాశం ఇచ్చే పార్టీవైపు చూస్తున్న వారు లెక్కలు వేస్తున్నవారు కూడా పెరుగుతున్నా రు.
ఇక, యువతరం విషయానికి వస్తే.. తమకు ఎలానూ.. పదవులు దక్కే అవకాశం తక్కువగానే ఉందని అంచనా వేస్తున్నవారు.. రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారు. అదేసమయంలో అవకాశం కోసం చూస్తున్న వారసులు రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. ఇలా.. రకరకాలుగా రాష్ట్రంలో రాజకీయాలు మార్పు దిశగా అడుగులు వేస్తున్నాయి. ఎవరి నోట విన్నా.. ఒక్క ఛాన్స్ కోసం చూస్తున్నామన్న మాటే వినిపిస్తుండడ గమనార్హం. మరి ఆ ఛాన్స్ ఏ పార్టీ ఇస్తే. ఆ పార్టీకే ఇప్పుడు జై కొట్టేందుకు నాయకులు సిద్ధపడడం గమనార్హం.