లోకేష్ విశ్వరూపం...ధర్మాగ్రహం

శాసనసభ వర్షాకాల సమావేశాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. అయితే అసెంబ్లీలో కేవలం అధికార పక్షం మాత్రమే ఉంది.;

Update: 2025-09-23 13:20 GMT

శాసనసభ వర్షాకాల సమావేశాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. అయితే అసెంబ్లీలో కేవలం అధికార పక్షం మాత్రమే ఉంది. అక్కడ సభ సజావుగానే సాగుతోంది. కూటమి ఎమ్మెల్యేలే కొన్ని సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు ప్రస్తావిస్తున్నారు. కొన్ని సందర్భాలలో తమ నియోజకవర్గాల సమస్యలను పరిష్కరించాలని ఒకింత బిగ్గర స్వరంతో అడుగుతున్న సన్నివేశాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ ఒవరాల్ గా విపక్షం లేని లోటు అయితే అసెంబ్లీ సమావేశాలలో కనిపిస్తోంది. దానికి భిన్నంగా శాసన మండలి సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి.

కూటమి వర్సెస్ వైసీపీ :

శాసనమండలిలో కూటమి వర్సెస్ వైసీపీగా చర్చ సాగుతోంది. కొన్ని సార్లు అది కాస్తా రచ్చ అవుతోంది. ఇక మండలిలో మంత్రులు వస్తున్నారు. వైసీపీ ప్రశ్నలకు ధీటుగా జవాబు చెబుతున్నారు. అదే విధంగా చూస్తే మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం కావడం అంశంతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇష్యూ వంటి అంశాలు చర్చకు వస్తునాయి. మంగళవారం అయితీ ఫీజు రీ ఇంబర్స్ మెంట్ తో మొదలైన చర్చ ఆ తరువాత స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీదకు మళ్ళింది. దాంతో వైసీపీ వర్సెస్ టీడీపీగా మారింది. అంతే కాదు ఒక దశమో లీడర్ ఆఫ్ అపోజిషన్ బొత్స సత్యనారాయణ వర్సెస్ మంత్రి లోకేష్ గా మారింది.

ఉగ్రరూపంతో లోకేష్ :

ఈ చర్చ సందర్భంగా బొత్స తమ వైపు ఉన్న మహిళా ఎమ్మెల్సీలను గౌరవించడం లేదని వ్యాఖ్యలు చేశారు. దాని మీద లోకేష్ ఆవేశంతో ఊగిపోయారు. నేను మహిళలను గౌరవిస్తాను నా తల్లిదండ్రులు ఆ సంస్కారం నాకు ఎంతో నేర్పారు అంటూ మొదలెట్టి గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు శాసనసభలో తన తల్లిని అవమానించినపుడు బొత్స మంత్రిగా ఉండి ఏమి చేస్తున్నారు అని ప్రశ్నించారు. తన తల్లిని అనుచితంగా నిందిస్తే అంతా చూస్తూ కూర్చున్నారు అని ఫైర్ అయ్యారు. ఆ బాధ నుంచి తన తల్లి కోలుకోవడానికి మూడు నెలల సమయం పట్టిందని ఆయన గుర్తు చేసుకుని మరీ అవేదన వ్యక్తం చేశారు. తల్లులను అనిపించి తిట్టించి ఆనందించే కుసంస్కారం తనకు లేదని లోకేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన బొత్స మీద ఒక దశలో గట్టిగానే మాట్లాడారు.

బొత్స క్షమాపణలు చెప్పాలి :

ఇక ఈ దశలో బొత్స లేచి తాను అపుడూ ఇపుడూ కూడా తల్లులను కానీ మహిళలను కానీ ఎవరైనా ఏమైనా అంటే సహించేది లేదని స్పష్టంగానే చెబుతూ వస్తున్నానని అన్నారు. మహిళల పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని, తాను ఎట్టి పరిస్థితుల్లో అలాంటి వ్యాఖ్యలను సమర్ధించను అన్నారు. అయితే గతంలో ఎపుడో జరిగింది అంటూ పాత విషయాలను పదే పదే తీసుకుని రావడం రాజకీయంగా వాడుకోవడం ఏమీ బాగులేదని బొత్స అన్నారు. దీంతో హోం మంత్రి అనిత భగ్గుమన్నారు. ఒక కొడుకుగా లోకేష్ తన తల్లికి జరిగిన అవమానం గురించి ఆవేదన వ్యక్తం చేస్తే దానిని రాజకీయం అంటారా అని బొత్స మీద ఆగ్రహం వ్యక్తం చేశారు బొత్స దీనిని క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. అలా స్టీల్ ప్లాంట్ ఇష్యూ కాస్తా వేరే విధమైన చర్చకు రచ్చకు దారి తీసింది. ఇవన్నీ పక్కన పెడితే లోకేష్ వీరావేశం మాత్రం మండలిలో అంతా అలా చూస్తూ ఉండిపోయారు. ఎపుడూ నవ్వుతూ కనిపించే చినబాబులో ఇంత ఆగ్రహం గూడు కట్టుకుని ఉందా అని చర్చించుకున్నారు. అయితే ఆయనది ధర్మాగ్రహం అని అంతా అంటున్నారు.

Tags:    

Similar News