ఏపీలో ఫ‌స్ట్‌: 2027 నుంచే ఎన్నిక‌ల సంగ్రామం.. !

ఏపీలో మ‌రోసారి అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగేందుకు మూడు సంవ‌త్స‌రాల స‌మ‌యం ఉంది. 2029 నాటికి ఎన్నిక‌లు వ‌స్తున్నాయి.;

Update: 2026-02-27 02:45 GMT

ఏపీలో మ‌రోసారి అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగేందుకు మూడు సంవ‌త్స‌రాల స‌మ‌యం ఉంది. 2029 నాటికి ఎన్నిక‌లు వ‌స్తున్నాయి. అయితే.. ప్ర‌స్తుతం ఉన్న వాతావ‌ర‌ణం చూస్తే.. ఆ ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రిగినా.. దీనికి సంబంధించిన సంగ్రామ ప్రక్రియ మాత్రం వ‌చ్చే ఏడాది నుంచే ప్రారంభ‌మ‌య్యే సూచ‌న‌లు క‌ని పిస్తున్నాయి. ఎందుకంటే.. ఇటుకూట‌మి.. అటు ప్ర‌తిపక్ష వైసీపీ కూడా వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి ఇప్ప‌టి నుంచే ప్లాన్‌పై ప్లాన్‌లు వేస్తున్నాయి.

వైసీపీ విష‌యానికి వ‌స్తే.. వ‌చ్చే ఏడాది మ‌ధ్య లేదా చివ‌రి నుంచి పాద‌యాత్ర నిర్వ‌హించేందుకురెడీ అ యింది. దీనిని ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్నారు. అంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు దాదాపు రెండేళ్ల ముందు నుం చే గ్రౌండ్ రెడీ చేసుకుంటున్నారు. పాద‌యాత్ర ద్వారా ప్ర‌భంజనం సృష్టించేందుకు రెడీ అవుతున్నారు. ఇది అసాధార‌ణ‌మ‌నే చెప్పాలి. ఐదేళ్ల‌పాటు అధికారంలో ఉండి.. ఓడిన త‌ర్వాత‌.. తిరిగి పాద‌యాత్ర‌కు రెడీ అవుతుండ‌డం.. అది కూడా ఎన్నిక‌ల‌కు రెండేళ్ల ముందే కావ‌డం వైసీపీ విష‌యంలో పెద్ద స్ట్రాట‌జీని స్ప‌ష్టం చేస్తోంది.

ఇక‌, కూట‌మి ఊరుకుంటుందా? ఈ పార్టీలు కూడా వ‌చ్చే ఏడాది నుంచే త‌మ ప‌క్కాప్లాన్‌ను ప్రారంభిం చేందుకు రెడీ అవుతున్నాయి. ఒక‌వైపు పాల‌న సాగిస్తూనే.. మ‌రోవైపు 2029 ఎన్నిక‌లే ల‌క్ష్యంగా అడుగులు వేయాల‌ని నిర్ణ‌యించాయి. తాజాగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను ఆయ‌న ప్ర‌తిష్టాత్మ‌కమ‌ని చెప్పారు. మార్కాపురం ప‌ర్య‌ట‌న‌లో పార్టీ నాయ‌కుల‌ను ఉద్దేశించి.. ఎన్నిక‌ల వ్య‌వ‌హారంపై ఆయ‌న చ‌ర్చించారు. స్థానికంగా 100 శాతం స్ట్ర‌యిక్ రేట్‌ను సాధించేందుకు ఇప్ప‌టి నుంచే ప్ర‌య‌త్నించాల‌న్నారు.

ఇక‌, పార్టీ ఎమ్మెల్యేల‌కు కూడా శిక్ష‌ణ త‌ర‌గ‌తులు నిర్వహించ‌నున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో ఎలా వ్య‌వ‌హ రించాలి? వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఎలాంటి అడుగులు వేయాలి? అనే విష‌యాల‌పై వారికి దిశానిర్దేశం చేయ‌నున్నారు. మొత్తంగా చూస్తే.. 2029 కంటే రెండేళ్ల‌ ముందే రాష్ట్రంలో ఎన్నిక‌ల‌సంగ్రామం ప్రారంభం కానుంద‌న్న విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇక‌, కూట‌మి మిత్ర‌ప‌క్షాలు క‌లివిడిగానే పోటీ చేయ‌నుండ‌గా.. వైసీపీ ఒంట‌రి పోరుకే సిద్ధం అవుతోంది. ఈ ప‌రిణామాలు.. రాజకీయాల‌ను మ‌రింత వేడెక్కించేలా చేయ‌నున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News