ఏపీకి సీప్లేన్.. తొలిదశలో 8 రూట్లు.. అవేమంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సరికొత్త ఇమేజ్ క్రియేట్ చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కొత్త తరహా ప్రాజెక్టుల వైపు ఫోకస్ చేస్తోంది.;

Update: 2025-05-06 04:36 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సరికొత్త ఇమేజ్ క్రియేట్ చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కొత్త తరహా ప్రాజెక్టుల వైపు ఫోకస్ చేస్తోంది. ఓవైపు అంతర్జాతీయ స్థాయిలో అమరావతి.. మరోవైపు పర్యాటక రంగానికి పెద్దపీట వేయటంతో పాటు.. సాంకేతికంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు వీలుగా చేస్తున్న ప్రయత్నాల సంగతి తెలిసిందే. తాజాగా ఏపీఏడీసీఎల్ (ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ) రాష్ట్రంలో ఎనిమిది ప్రాంతాల్లో వాటర్ ఏరో డ్రోమ్ ల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది.

దీనికి సంబంధించిన పీజబులిటీ స్టడీ.. ప్రాజెక్టు రిపోర్టు తయారీకి రెండు సంస్థలు ఆసక్తి చూపాయి. వాటిల్లో ఒక దానికి ఎంపిక చేయనున్నారు. తొలి దశలో పర్యాటక.. ఆధ్యాత్మిక ప్రాంతాల్ని కలిపేలా 8 ప్రాంతాల్లో వాటర్ ఏరో డ్రోమ్ లను డెవలప్ చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. అరకు నుంచి తిరుపతి వరకు ప్రతిపాదించిన 8 లొకేషన్ల మధ్య మొత్తం 1018 కి.మీ. సీప్లేన్ నడిపేలా రూట్లను ప్రతిపాదించారు. వీటి డీపీఆర్ లను తయారు చేసి.. కేంద్ర పౌర విమానయాన శాఖకు పంపనున్నారు.

ఈ రిపోర్టులను పరిశీలించి.. ఆమోదించిన లొకేషన్లలో వాటర్ డ్రోమ్ లను కేంద్రం డెవలప్ చేస్తుంది. సముద్ర తీరప్రాంతం.. నది.. కాలువలు అందుబాటులో ఉన్న ప్రాంతాల మధ్య కనెక్టివిటీ ఉండేలా దీన్ని ఏర్పాటు చేస్తారు.ఈ ప్రాజెక్టు కార్యరూపం దాలిస్తే.. అరకు.. లంబసింగి ప్రాంతాలకు పర్యాటకులు మరింత ఎక్కువగా వచ్చేందుకు సీ ప్లేన్ సేవలు సాయం చేస్తాయని భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఎంపిక ేసిన 8 రూట్లను చూస్తే..

ఎక్కడి నుంచి ఎక్కడకు దూరం (కి.మీ.)

అరకు - లంబసింగి 52

లంబసింగి - రుషికొండ 128

రుషికొండ - కాకినాడ 147

కాకినాడ - కోనసీమ 54

కోనసీమ - విజయవాడ 132

విజయవాడ - శ్రీశైలం 188

శ్రీశైలం - తిరుపతి 317

Tags:    

Similar News