ఇంకానా.. ?... సింపతీపైనే ఏపీ పాలిటిక్స్.. !
ఏపీలో ఇంకా సింపతీ పాలిటిక్సే నడుస్తున్నాయా? అంటే.. అవుననే సమాధానమే వినిపిస్తోంది. వాస్తవానికి రాజకీయాల్లో సింపతీ కావాల్సిందే.
ఏపీలో ఇంకా సింపతీ పాలిటిక్సే నడుస్తున్నాయా? అంటే.. అవుననే సమాధానమే వినిపిస్తోంది. వాస్తవానికి రాజకీయాల్లో సింపతీ కావాల్సిందే. కానీ, అది కొన్ని కొన్ని సార్లు ఫలిస్తుంది.. మరికొన్ని సార్లు వికటిస్తుంది. ప్రజలు ఏది తమకు అనుకూలమని భావిస్తే.. అదే జరుగుతుంది. కానీ.. ప్రస్తుతం వైసీపీకి సింపతీ రాకుండా చేయాలన్న వ్యూహంతో కూటమి ప్రభుత్వం.. చంద్రబాబుకు సింపతీ రాకుండా చేయాలన్న లక్ష్యంతో వైసీపీ అడుగులు వేస్తున్నాయి.
ఈ క్రమంలోనే వైసీపీ నాయకులు.. పార్టీ అధినేత కూడా.. సంక్షేమ కార్యక్రమాలు సహా.. డీఎస్సీ వంటివాటిని తెరమీదికి తెచ్చారు. వాస్తవానికి సంక్షేమ కార్యక్రమాలు బాగానే వర్కవుట్ అవుతున్నాయి. కానీ, లోపాల ను వెతికి మరీ.. వైసీపీ నాయకులు కూటమి సర్కారును టార్గెట్ చేస్తున్నారు. దీనివల్ల తమకు మేలు జరుగుతుందని అనుకుంటున్నారు. కానీ, ప్రజలకు కూడా ఒక ఆలోచనా విధానం అయితే ఉంటుంది. వారు కూడా సంక్షేమంపై ఒక నిర్దేశిత అంచనాతో ఉన్నారు.
ఈ నేపథ్యంలో వైసీపీ ఎంచుకున్న సింపతీ పాలిటిక్స్ ఏమేరకు వర్కవుట్ అవుతాయన్నది ప్రశ్న. ఇక, టీడీపీ విషయానికి వస్తే.. జగన్‌ను తిట్టడమే పనిగా పెట్టుకుంది. తద్వారా .. జగన్‌కు ప్రజల్లో సింపతీ రాకూడదన్నది టీడీపీ నాయకుల లక్ష్యంగా కనిపిస్తోంది. విధానపరమైన అంశాలపై వైసీపీ విమర్శలు చేస్తే.. దానికి కౌంటర్లు ఇవ్వడం వరకు తప్పులేదు. కానీ.. లేనిపోని వ్యాఖ్యలు చేస్తే.. ప్రజల్లో దీనికి వ్యతిరేక భావన ఏర్పడుతుంది. ఫలితంగా.. అది బూమరాంగ్ అవుతుంది.
గతంలో సింపతీ పాలిటిక్స్ విషయంలో వైసీపీకి, టీడీపీకి కూడా అనుభవం ఉంది. చంద్రబాబును తిట్టినా.. జగన్‌కు ప్రజలు ఓటేయలేదు.జగన్‌పై విమర్శలు చేసినా.. 2019లో టీడీపిని పట్టించుకోలేదు. కేవలం పాలనను చూసి..అమలు చేస్తున్న పథకాలను చూసి.. ప్రత్యర్థులు ఇస్తున్న హామీలను గమనించే ప్రజలు ఓటేస్తున్న విషయం 2024 ఎన్నికల్లో స్పష్టమైంది. సో.. ఇప్పటికీ సింపతీని నమ్ముకుంటామంటే.. అది బూమరాంగే అవుతుంది తప్ప.. కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదని పరిశీలకులు చెబుతున్నారు.