ముగ్గురు పిల్లలను కంటే కూటమి బంపర్ ఆఫర్!

ఏపీలో జనాభా పెరుగుదల విషయంలో ఏమి చేయాలో అంతా చేసేందుకు కూటమి సర్కార్ సిద్ధపడుతోంది అంటున్నారు.;

Update: 2025-07-24 06:28 GMT

ఏపీలో జనాభా పెరుగుదల విషయంలో ఏమి చేయాలో అంతా చేసేందుకు కూటమి సర్కార్ సిద్ధపడుతోంది అంటున్నారు. జనాభా రేటింగ్ విషయంలో ఉత్తరాది కంటే దక్షిణాది రాష్ట్రాలు చాలా వెనకబడి ఉన్నాయి. అందులోనూ ఏపీ మరింతగా వెనకబడి ఉంది. దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే అనేక సభలలో జనాలకు మోటివేట్ చేస్తూనే ఉన్నారు.

జనాభా పెంచండి అని ఆయన నినాదం ఇస్తున్నారు. అంతే కాదు ఒకనాడు తానే జనాభా వద్దు అని చెప్పేవాడిని అని ఆయన గుర్తు చేస్తున్నారు. అప్పటికి అది అవసరం ఇప్పటికి ఇది అవసరం కాబట్టి జనాభాను పెంచాల్సిందే అని ఆయన పదే పదే కోరుతున్నారు. లేకపోతే కొన్నాళ్ళకు జనాలు లేని ఊళ్ళు పుట్టుకుని వస్తాయని హెచ్చరిస్తున్నారు.

ఇక గతంలో అయితే ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది ఉంటే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అని చట్టం చేశారు. దానికి ఇపుడు ఏపీ సర్కార్ సవరించింది. పైగా ఎందరు పిల్లలు ఉన్నా పోటీ చేయవచ్చు అంది. ఇపుడు మరిన్ని ప్రోత్సాహకాలు కూడా ప్రభుత్వం ప్రకటిస్తోంది.

ఎవరు ఎక్కువ మంది పిల్లలను కంటే వారే దేశభక్తులు అని కూడా చంద్రబాబు చెబుతున్నారు అంతే కాదు ఎక్కువ మంది పిల్లలు కనేలా పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ ముసాయిదా మీద ప్రభుత్వ గట్టిగానే కసరత్తు చేస్తోంది. ఈ ముసాయిదా చూస్తే అనేక అంశాలు ఉన్నాయి.

ముగ్గురు పిల్లలను కంటే ఏకంగా ఆస్తి పన్ను నుంచి మినహాయించాలని ప్రభుత్వం ప్రోత్సాహం తేబోతోంది. అంతే కాదు రాష్ట్రంలో సంతానోత్పత్తి విషయంలో ఇబ్బంది పడుతున్న దంపతులు 12 శాతంగా ఉన్నారని అంటున్నారు. అలాంటి వారికి ఐవీఎఫ్ చికిత్స ఖర్చును ప్రభుత్వమే తానుగా భరించాలని నిర్ణయించింది దాంతో వారు కూడా బిడ్డలను కనేందుకు ఆస్కారం ఉంటుంది. అంతే కాదు మాతృత్వ సెలవులను ఏకంగా ఆరు నెలల నుంచి పన్నెండు నెలలకు పెంచాలని కూడా ముసాయిదాలో సిఫార్సు చేస్తున్నారు. అలాగే తల్లులకు వర్క్ ఫ్రం హోం సౌకర్యం కల్పించాలని కూటమి ప్రభుత్వం చూస్తోంది అని అంటున్నారు

ఇక మూడవ బిడ్డను కంటే వారి పేరున యాభై వేల రూపాయలను ఇస్తారు. నాలుగో బిడ్డను కంటే కూడా ఇదే విధంగా సొమ్ము చెల్లిస్తారు, ఆర్ధికంగా ఆదుకుంటారు. పిల్లల కోసం క్రెచ్‌లు పెట్టాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం మీద ఎక్కువ మంది పిల్లలను కనేలా ప్రజలను ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం అన్ని రకాలైన నిర్ణయాలను తీసుకుంటోంది.

ఏపీలో చూస్తే దారుణంగా సంతానోత్పత్తి రేటు పడిపోయింది. గతంలో 2.1గా ఉన్న సంతానోత్పత్తి రేటు కాస్తా 1.5కి దిగజారింది. ఇది ఆందోళన కలిగించే విషయంగా ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే మరో పాతికేళ్ళకు అంటే 2047 నాటికి రాష్ట్రంలో వృద్ధులు మాత్రమే ఎక్కువ మంది ఉంటారు. ఏకంగా వారి సంఖ్య 23 శాతంకి చేరే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంటే ప్రతీ నలుగురులో ఒకరు వృద్ధులు అన్న మాట. దాంతోనే కూటమి ప్రభుత్వం ఈ రకమైన చర్యలకు దిగుతోంది అని అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటున్నారు అని కూడా సామాజికవేత్తలు నిపుణులు అంటున్నారు. సూచిస్తున్నారు. ప్రస్తుతం 13-15 శాతం మధ్య ఉన్నట్లు నిర్దారించారు.

Tags:    

Similar News