మూకుమ్మడిగానే అంటున్న జగన్...ఎలా చూడాలి ?
ఏపీలో ఎన్నికలు జరిగిపోయి ఏణ్ణర్థం అయింది. ఫలితాలు వచ్చి కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయి కూడా పదిహేను నెలలు దాటింది అయినా ఎన్నికల వేడి ఏ మాత్రం తగ్గడం లేదు.;
ఏపీలో ఎన్నికలు జరిగిపోయి ఏణ్ణర్థం అయింది. ఫలితాలు వచ్చి కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయి కూడా పదిహేను నెలలు దాటింది అయినా ఎన్నికల వేడి ఏ మాత్రం తగ్గడం లేదు. వేసవి వేడినే రాజేస్తూ ఉంది. ఇవాళో రేపో ఎన్నికలు అన్నట్లుగా సన్నివేశం కనిపిస్తోంది అధికారంలో ఉన్న వారి మీద విపక్షం ఎపుడూ నిప్పులు చెరుగుతుంది. అది సహజం. కానీ ఇంకా పవర్ లో ఉండగానే పదవీ కాలం మూడొంతులు ఉండగానే మళ్ళీ ఎన్నికలకు పోదామని అంటూంటే అది ఎలా చూడాలి అన్న చర్చ మొదలవుతోంది.
అనర్హత కానే కాదు :
వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు సభకు గైర్ హాజరు అయితే అనర్హత వేటు వేస్తారు అన్న ప్రచారం మీద తాజాగా జగన్ ఘాటుగానే రియాక్ట్ అయ్యారని అంటున్నారు అంతే కాదు ఆయన ఫైర్ మీద చేసిన కామెంట్స్ కానీ ఆ దిశగా చేసిన సవాల్ కానీ ఇపుడు వైరల్ అవుతోంది. అందులో జగన్ ఆలోచనలు ఉద్దేశ్యాలు ఏమిటి అన్నది కూడా అంతా డిస్కషన్ చేసేలాగానే ఉన్నది. అనర్హత వేస్తే అది ఒక్క వైసీపీ ఎమ్మెల్యేలతోనే పోదు అన్నది జగన్ మాటలకు అర్ధంగా భావించాలా అన్నది కూడా అంతా ఆలోచిసుతున్నారు.
అంతా కలసి కట్టుగా :
ఇక వైసీపీ ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకుంటే అనర్హత వేటు వేస్తే తమ రాజకీయ వ్యూహం ఏమిటో జగన్ తాజాగా రివీల్ చేశారు అని అంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యేల వరకూ మాత్రమే ఎందుకు అందరు ఎమ్మెల్యేలు ఎంపీలు కలసి రాజీనామాలు చేసి ఎన్నికలకు పోదామని జగన్ కూటమికి గట్టి సవాల్ నే చేసారు. అయితే ఆ అందరు ఎమ్మెల్యేలలో కేవలం వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రమే ఉంటారా లేక కూటమి నుంచి కూడా మొత్తం రాజీనామా చేయమని జగన్ కోరుతున్నారా అన్నది పూర్తిగా స్పష్టం చేయలేదు కానీ మూకుమ్మడి ఎన్నికలకు మాత్రం తెర తీయాలని జగన్ భావిస్తున్నటుగా ఆయన మాటల ద్వారా తెలుస్తోంది అని అంటున్నారు.
క్లారిటీ అయినా ఇవ్వరుగా :
ప్రతిపక్ష హోదా విషయం కాదు తమకు కనీసం టైం అయినా మాట్లాడేందుకు అవసరమైనంత ఇస్తారా అన్నది జగన్ తన పార్టీ వారితో అన్న మాటలుగా చెబుతున్నారు. వారు సమయం ఇవ్వరు, జస్ట్ ఎమ్మెల్యేలుగానే చూస్తారు, అలాంటపుడు సభకు వెళ్ళినా ఉపయోగం ఏమిటి అని జగన్ అంటున్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను ఎవరికీ సభకు వెళ్ళవద్దు అని తాను ఏమీ చెప్పలేదని జగన్ అన్నారు. అయితే తమకు మాట్లాడేందుకు తగిన సమయం ఇవ్వరనే వారంతా వెళ్ళడం లేదని జగన్ వివరించారు.
మినీ సమరానికి రెడీ :
ఇదిలా ఉంటే ఏపీలో మరో మినీ సమరానికి జగన్ తెర తీస్తునారా అన్న చర్చ అయితే సాగుతోంది. శాసన సభలో వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. లోక్ సభలో నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే వీరంతా రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్ళాలని జగన్ డిసైడ్ అయ్యారా అన్నదే ఇపుడు హాట్ టాపిక్ గా ఉంది. మరో వైపు చూస్తే కూటమి వైపు నుంచి కూడా ఎమ్మెల్యేల రాజీనామాకు ఆయన సవాల్ చేస్తున్నారా అన్నది కూడా ఒక సందేహంగా ఉంది. అయితే కూటమి నుంచి ఎవరైనా ఎందుకు రాజీనామా చేస్తారు వైసీపీ ఎమ్మెల్యేల మీద వేటు వేయాలని ఆలోచిస్తే కనుక మూకుమ్మడి రాజీనామాలు అన్న సరికొత్త వ్యూహంతోనే జగన్ చెక్ పెట్టాలని చూస్తున్నారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తూంటే 2026ని ఉప ఎన్నికల నామ సంవత్సరంగా చేసేందుకు వైసీపీ చూస్తోందా అన్నదే హాట్ డికషన్ గా ఉంది.