ఏదో చెప్పాల‌ని.. మ‌రేదో చెప్పి.. ఏపీ హోం మంత్రికి తిప్ప‌లు!

అయితే.. మా అమ్మాయి విష‌యంలో నేను ఎప్ప‌టిక‌ప్పుడు జాగ్రత్త‌గానే ఉంటాను. మా అమ్మాయి ఎక్క‌డికి వెళ్లినా.. సాయంత్రం ఆరు దాటాక‌.. లైవ్ లొకేష‌న్ షేర్ చేయ‌మ‌ని అడుగుతా.;

Update: 2025-04-17 16:37 GMT

ఉద్దేశం మంచిదే అయినా.. మాట్లాడే తీరు.. చెప్పే విధానం స‌రిగా లేక‌పోతే.. చిక్కులు వ‌స్తాయి. ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితినే.. ఏపీ హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత కూడా ఎదుర్కొన్నారు. ఆమెపై సామాజిక మాధ్య‌మాల్లో ట్రోల్స్ పెరిగిపోయాయి. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో జ‌రిగిన మ‌హిళా భ‌ద్ర‌త‌పై స‌దస్సులో మంత్రి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌.. రాష్ట్ర స‌ర్కారు తీసుకునే జాగ్ర‌త్త‌లు.. అదేవిధంగా మ‌హిళ‌లు చేప‌ట్టాల్సిన స్వీయ భ‌ద్ర‌త వంటివి ఆమె వివ‌రించాల‌ని అనుకున్నారు.

కానీ, ఈ స‌మ‌యంలోనే కొన్ని వ్య‌క్తిగ‌త విష‌యాలు చెప్పుకొచ్చారు. ఇది అవ‌స‌రం లేదు. కానీ.. మైకు పుచ్చు కున్న కంగారులోనో.. లేక ఏదో చెప్పాల‌న్న ఆతృత‌లోనో.. మ‌రో విష‌యాన్ని చెప్పారు. అదే ఇప్పుడు నెటి జ‌న్ల నుంచి ట్రోలింగ్‌కు కార‌ణ‌మైంది. ''నేను హోం మంత్రిని. రాష్ట్ర పోలీసులు అంద‌రూ నా మాట వింటారు. అయితే.. మా అమ్మాయి విష‌యంలో నేను ఎప్ప‌టిక‌ప్పుడు జాగ్రత్త‌గానే ఉంటాను. మా అమ్మాయి ఎక్క‌డికి వెళ్లినా.. సాయంత్రం ఆరు దాటాక‌.. లైవ్ లొకేష‌న్ షేర్ చేయ‌మ‌ని అడుగుతా. చేయ‌క‌పోతే.. ఊరుకోను.'' అని అనిత‌ అన్నారు.

అంతేకాదు.. ఇలా చేస్తే.. ఇబ్బందులు త‌ప్పుతాయి అని కూడా చెప్పారు. ఇందులో మంచి స‌దుద్దుశ‌మే ఉంది. దీనిని కాద‌న‌లేం. కానీ, హోం మంత్రిగా ఆమె వేదిక‌ల‌పై మాట్లాడేప్పుడు.. ఈ వ్యాఖ్య‌ల‌కు వ‌చ్చే అర్ధం వేరు. ఈ అర్ధాన్ని ప‌ట్టుకునే నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక‌, నుంచి రాష్ట్రంలోని త‌ల్లిదండ్రు లు.. త‌మ పిల్ల‌ల‌ను బ‌య‌ట‌కు పంపిస్తే.. వారుఎక్క‌డ‌కు వెళ్లిందీ.. లైవ్ లొకేష‌న్ల ద్వారా ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకోవాలా? మ‌రి పోలీసులు ఎందుకు? అని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు.

ఇక‌, స‌మాజంలో ప‌రిస్థితులు దారుణంగా ఉన్నాయ‌ని స్వ‌యంగా హోం మంత్రి చెప్ప‌డం కూడా వివాదం గా మారింది. ఒక‌వైపు శాంతి భ‌ద్ర‌త‌లు బాగున్నాయ‌ని చెబుతూనే.. స‌మాజంలో ప‌రిస్థితి బాగోలేదని.. ఎవ‌రికి వారు జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని అన్నారు. అయితే.. శాంతి భ‌ద్ర‌త‌లు బాగోలేవ‌ని మంత్రి చెబుతు న్నారా? అనే మీనింగ్ వ‌చ్చే స‌రికి.. నెటిజ‌న్లు ఈ విష‌యంపైనా నిల‌దీశారు. అదేస‌మ‌యంలో 18 ఏళ్ల లోపు మ‌గ పిల్ల‌లు మాత్ర‌మే అత్యాచారాలు చేస్తున్నార‌న్న వ్యాఖ్య‌లు కూడా విమ‌ర్శ‌ల‌కు దారితీశాయి. ఏదేమైనా.. అనిత కొంత సంయ‌మ‌నం పాటించి ఉంటే బాగుండేద‌న్న వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News