అటు యువత...ఇటు మహిళ..ఆశలు వదులుకోవాల్సిందే ?

ఏపీలో 2029 ఎన్నికలు కొత్త రాజకీయ దృశ్యాన్ని ఆవిష్కరిస్తాయని అంటున్నారు. జరుగుతున్న పరిణామాలు చూస్తే ఆ విధంగానే ఉన్నాయని విశ్లేషిస్తున్నారు.

Update: 2026-07-31 03:37 GMT

ఏపీలో 2029 ఎన్నికలు కొత్త రాజకీయ దృశ్యాన్ని ఆవిష్కరిస్తాయని అంటున్నారు. జరుగుతున్న పరిణామాలు చూస్తే ఆ విధంగానే ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. ఈ రోజున దేశంలో యువత గొంతు బిగ్గరగా వినిపిస్తోంది. దాంతో యువ నాడిని పట్టుకునేందుకు రాజకీయ పార్టీలు ఎవరి ప్రయత్నంలో వారు ఉన్నారు. తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి అయితే 21 ఏళ్ళకే చట్ట సభలకు యువత పోటీ చేసేలా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. దానిని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని కూడా వెల్లడించారు. అనేక రాష్ట్రాలలో పార్టీలు కూడా యువ నామ జపం చేస్తున్నాయి.

యువ ప్రధాని అంటూ :

ఇంకో వైపు చూస్తే మజ్లిస్ పార్టీ అధినేత ఒవైసీ అయితే యువ ప్రధాని దేశానికి వచ్చే ఎన్నికల తర్వాత రావాలని బలంగా కోరుకుంటున్నారు. తమ పార్టీ అయితే యువతకు ఎక్కువగా టికెట్లు ఇస్తామని కూడా చెబుతున్నారు. దేశంలో నూటికి అరవై శాతం యువత ఉందని ఆయన లెక్కలు కూడా చెప్పుకొచ్చారు. ఇలా విపక్ష శిబిరంలో అయితే యువత కోసం ఎవరి ప్రణాళికలలో వారు ఉన్నారు. మరి ఎన్డీయే కూడా యువతను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు గట్టిగానే చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ అయితే వరసగా ఇన్స్టా గ్రాం లో వీడియోలు చేస్తున్నారు. అవన్నీ యువతకు తన సందేశాన్ని నేరుగా పంపించడానికే అని అంటున్నారు.

ఏపీ సంగతి ఏమిటి :

ఈ నేపథ్యంలో ఏపీలో పరిస్థితి ఏమిటి అన్న చర్చ మొదలైంది. టీడీపీ అయితే ఇప్పటికే అంటే 2024 ఎన్నికల్లోనే యువ ప్రయోగం చేసింది. ఎక్కువ టికెట్లు వారికే ఇచ్చింది. ఇక కేబినెట్ లో సైతం యువత పాత్రను పెంచింది. అదే విధంగా చూస్తే 2029 నాటికి మరింతగా యువతకు టికెట్లు ఇవ్వాలని అనుకుంటోంది. దాంతోనే టీడీపీలో దశాబ్దాలుగా ఉన్న సీనియర్ నేతలు అంతా పక్కకు తప్పుకునే అనివార్యత ఏర్పడుతోంది. ఈ క్రమంలో విద్యార్ధుల ఢిల్లీ పోరాటం జెన్ జీ తరం ధర్మాగ్రహం కూడా రాజకీయ పార్టీలను ఆలోచనలలో పడేస్తున్నాయి. దాంతో వారికి మరింతగా అవకాశాలు ఇస్తామని చెప్పడానికి ఏపీలో కూడా రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయని అంటున్నారు.

మహిళా బిల్లు అమలులోకి :

మరో వైపు చూస్తే మహిళా బిల్లు కనుక 2029 ఎన్నికల నాటికి అమలులోకి వస్తే మాత్రం మహిళలకు కూడా చట్టం ప్రకారం 33 శాతం టికెట్లు అసెంబ్లీ పార్లమెంట్ లలో కేటాయించాల్సి వస్తుంది. అంటే మూడవ వంతు సీట్లు అన్న మాట. ఈ విధంగా చూస్తే మహిళల కోటా కూడా ఇప్పటికి మరిన్ని రెట్లు అన్ని రాజకీయ పార్టీలలో పెరగనుంది. ఇక జగన్ సైతం జెన్ జీ అంటున్నారు. ఆయన కూడా వారి పోరాటాన్ని గుర్తిస్తున్నారు. దాంతో వైసీపీ సైతం యువతకు సీట్లు కేటాయించడం ఖాయమని అంటున్నారు. మహిళలకు కూడా చట్ట ప్రకారం సీట్లు ఇచ్చుకోవాలంటే ఇక మిగిలింది ఏముంటుంది అన్నదే అన్ని పార్టీలలో చర్చగా ఉంది. ఈ విధంగా మహిళా యువత కోటాను మెజారిటీ పూర్తి చేస్తే ఇక సీనియర్లు అయినా వేరే వారు అయినా టికెట్లు ఆశించినా ఏ మేరకు నెరవేరుతుందని కూడా పెద్ద ప్రశ్న. ఒక విధంగా చెప్పాలీ అంటే ఇపుడు చూస్తున్న రాజకీయ ముఖాలు అన్నీ కూడా ఈ ఎన్నికల వరకే పరిమితం అని అంటున్నారు. 2029 నాటికి పూర్తిగా ఏపీ రాజకీయ ముఖ చిత్రమే మారిపోతుందని కూడా స్పష్టమైన రాజకీయ విశ్లేషణలే ఉన్నాయి. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News