పిల్లల్ని నరికి చంపి తీనేసేవారట... స్పెయిన్ శాస్త్రవేత్తల షాకింగ్ కామెంట్స్!
అవును... ఆహారం దొరకని సమయంలో కొన్ని జంతువులు తమ పిల్లల్ని చంపి ఆకలి తీర్చుకున్నట్లుగా... కొన్ని లక్షల సంవత్సరాల క్రితం మానవుడు కూడా తన పిల్లల్ని నరికి చంపి ఆహారంగా తీసుకునేవాడట.;
ఈ భూమిపై కొన్ని జంతువులు, మరికొన్ని సరీశృపాలు వాటి పిల్లలను చంపి ఆహారంగా తీసుకుంటాయనే సంగతి తెలిసిందే! ఈ క్రమంలో మానవుడు కూడా తన పిల్లలను నరికి చంపి ఆహారంగా తీసుకునేవాడట. ఈ విషయం తాజాగా స్పెయిన్ పురాతత్వ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో వెల్లడైందని చెబుతున్నారు. ఈ సందర్భంగా షాకింగ్ విషయాలు వెల్లడించారు.
అవును... ఆహారం దొరకని సమయంలో కొన్ని జంతువులు తమ పిల్లల్ని చంపి ఆకలి తీర్చుకున్నట్లుగా... కొన్ని లక్షల సంవత్సరాల క్రితం మానవుడు కూడా తన పిల్లల్ని నరికి చంపి ఆహారంగా తీసుకునేవాడట. సుమారు 8.5 లక్షల సంవత్సరాల నాటి ఆనవాళ్లపై పరిశోధనలు చేపట్టిన శాస్త్రవేత్తలు ఈ సంచలన విషయాలను నిర్ధారించారు!
గత కొంతకాలంగా స్పెయిన్ లోని గ్రాన్ డొలినా ప్రాంతంలో తవ్వకాలు జరిపిన పరిశోధకులకు.. రెండు నుంచి నాలుగేళ్ల మధ్య వయసున్న ఓ చిన్నారి మెడ ఎముక లభ్యమైంది. ఈ క్రమంలో ఆ ఎముకపై పరిశోధనలు చేపట్టిన వారికి... పదునైన వస్తువుతో తల నరికినట్లు తేలిసిందట. ఇదే తరహా మరిన్ని గుర్తులను కనుగొన్నట్లు చెబుతున్నారు.
ఈ సందర్భంగా స్పందించిన కెటలాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ పేలేఎకోలజీ అండ్ సోషల్ అవెల్యూషన్ (ఐ.పీ.హెచ్.ఈ.ఎస్) శాస్త్రవేత్తలు... ప్రధానంగా తక్కువ వయస్సు ఉన్నవారినే ఇలా నరికి చంపినట్లు గుర్తించారు. వెన్నుపూసను, తలను విడదీసేందుకు పదునైన వస్తువుతో నరికినట్లు స్పష్టమైన కోతలను గుర్తించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా... పరిశోధనకు నాయకత్వం వహించిన పాల్ మిరా సలడై స్పందిస్తూ... పిల్లల్ని కూడా జంతువుల మాదిరిగానే చంపేవారని చెప్పేందుకు ఇదే ప్రత్యక్ష నిదర్శనమని వెల్లడించారు. ఈ సందర్భంగా... పురాతన మానవులు తమ వంశాంకురాలను ఆహార వనరుగా ఉపయోగించుకునే వారన్న వాదన బలపడుతుందని చెబుతున్నారు.
ఈ సందర్భంగా... ఆధునిక మానవుల కంటే సగటున బలిష్టంగా, పొట్టిగా ఉండే హోమో పూర్వీకులు 1.2 మిలియన్, 800,000 సంవత్సరాల క్రితం జీవించారని.. వారి మెదడు పరిమాణం సుమారు 1,000 - 1,150 క్యూబిక్ సెంటీమీటర్ల మధ్య ఉండేదని.. ఇది నేటి ప్రజల సగటు మెదడు పరిమాణం 1,350 క్యూబిక్ సెంటీమీటర్ల కంటే చిన్నదని తెలిపారు.