అమెరికాలో చదివిన 50% మంది విద్యార్తులకు సరైన ఉద్యోగాల్లేవ్
డిగ్రీ పూర్తి చేసిన యువతకూడా తమ నైపుణ్యాలు అవసరం లేని సాధారణ లేబర్ పనులు ఆతిథ్య రంగం లేదా? ఇతర చిన్న చిన్న పనులలో జీవనం గడుపుతున్నట్టు ఈ నివేదిక స్పష్టం చేసింది.;
డాలర్ డ్రీమ్స్ వేటలో ఉన్న ఊరిని..కన్న వారిని వదిలి అమెరికా బాట పట్టిన వారు ఎంతో మంది.. చాలా మంది గొప్పగా స్థిరపడడం చూసి తాము అలానే కావాలని ఆనందపడ్డారు. కానీ జరిగింది ఒకటి.. జరగబోయేది మరొకటిలా అక్కడ పరిస్థితులు మారుతున్నాయి. అమెరికా కలలు కల్లలవుతున్నాయి.
ఉన్నత విద్య, మెరుగైన ఉపాధి అవకాశాలకు ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన దేశంగా అమెరికాకు పేరుంది. ముఖ్యంగా భారత్, చైనా వంటి దేశాల విద్యార్థులు లక్షల సంఖ్యలో ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళుతుంటారు. అయితే ఈ అమెరికన్ డ్రీమ్ సాకారం కావడం నేటి యువతకు కష్టంగా మారిందని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.
బర్నింగ్ గ్లాస్ ఇన్ స్టిట్యూట్ , స్ట్రాడా ఎడ్యూకేషన్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. అమెరికా లో ఇటీవల బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన యువ గ్రాడ్యూయేట్లలో దాదాపు సగం మంది (52 శాతం) తమ విద్యార్హతలకు, నైపుణ్యాలకు తగని ఉద్యోగాలలో పనిచేస్తున్నారు. అండర్ ఎంప్లాయిడ్ గా ఏదో చిన్న జాబులతో నెట్టుకొస్తున్నారు.
డిగ్రీ పూర్తి చేసిన యువతకూడా తమ నైపుణ్యాలు అవసరం లేని సాధారణ లేబర్ పనులు ఆతిథ్య రంగం లేదా? ఇతర చిన్న చిన్న పనులలో జీవనం గడుపుతున్నట్టు ఈ నివేదిక స్పష్టం చేసింది. ఉన్నత విద్య కోసం లక్షల డాలర్లు ఖర్చు చేసి డిగ్రీలు పొందిన యువత ఈ విధంగా నైపుణ్యం లేని ఉద్యోగాలు చేయాల్సి రావడం అమెరికాలో ఉపాధి రంగం ఎదుర్కొంటున్న తీవ్రమైన సంక్షోభాన్ని సూచిస్తోంది.
ప్రధాన కారణాలు ఇవీ
ఈ అండర్ ఎంప్లాయిమెంట్ పెరగడానికి కొన్ని కీలక నిర్ణయాలున్నాయి. భారతదేశం, చైనా వంటి దేశాల నుంచి ప్రతీ సంవత్సరం లక్షల మంది విద్యార్థులు అమెరికాకు వస్తున్నారు. దీనివల్ల నైపుణ్యం కలిగిన అభ్యర్థుల సంఖ్య పెరిగి ఉద్యోగాల కోసం పోటీ తారాస్థాయికిచేరింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాద్యం కారణంగా అనేక కంపెనీలు నైపుణ్యం అవసరమయ్యే ఉద్యోగాలలో కోతలు విధించాయి. ఇది యువతకు ఉపాధి అవకాశాలను బాగా తగ్గించింది. ఏఐ సాంకేతిక వేగంగా అభివృద్ధి చెందడం వల్ల ఎన్నో రకాల ఉద్యోగాలు అదృశ్యమవుతున్నాయి. సాంకేతిక రంగంతో సహా అనేక విభాగాలలో ఉద్యోగ మార్కెట్ పరిణామం కుదించుకుపోయింది.
యువ గ్రాడ్యూయేట్లలో పెరుగుతున్న ఈ అండర్ ఎంప్లాయిమెంట్ కేవలం అమెరికే కాక.. ఉన్నత చదువులకోసం అక్కడికి వెళ్లాలని కలలుకనే ప్రపంచవ్యాప్త విద్యార్థులకు కూడా ఒక హెచ్చరికలా నిలుస్తోంది.