• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అమెరికాలో కాల్పులు.. ఆ...

అమెరికాలో కాల్పులు.. ఆ బిల్లు ఆమోదానికి సపోర్ట్ ప్లీజ్!

| అమెరికాలో రోజు రోజుకీ పెరిగిపోతున్న గన్ కల్చర్ వల్ల ప్రజల భద్రత, ప్రశాంతత ప్రశ్నార్ధకంగా మారుతుందనే విమర్శలు ఇటీవల కాలంలో బలంగా వినిపిస్తున్నాయి

By - Tupaki Desk
Update: 2023-10-27 04:11 GMT

అమెరికాలో రోజు రోజుకీ పెరిగిపోతున్న గన్ కల్చర్ వల్ల ప్రజల భద్రత, ప్రశాంతత ప్రశ్నార్ధకంగా మారుతుందనే విమర్శలు ఇటీవల కాలంలో బలంగా వినిపిస్తున్నాయి. సగటున వారంలో ఒకటి రెండు చోట్ల కాల్పులకు సంబంధించిన వార్తలు దర్శనమిస్తున్నాయి. దీంతో బయటప్రపంచానికి తెలియకుండా ఇంకెన్ని జరుగుతున్నాయో అనే అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ఈ సమయంలో ఒక బిల్లు చర్చకు వస్తుంది.

అవును... అమెరికాలో రోజు రోజికీ పెరుగుతున్న గన్ కల్చర్ పై చర్చ జరుగుతుండి. ఈ సమయంలో 1994నాటి బిల్లుకు ఇప్పుడు మరోసారి చర్చకు వస్తుంది. కారణం... తాజాగా జరిగిన సామూహిక కాల్పుల ఘటన కూడా! మైనేలో ఓ దుండగుడు జరిపిన కాల్పులు ఇప్పుడు అమెరికాలో ఈ కొత్త చర్చకు తెరలేపాయి. పైగా కడుపులో మంది, బుర్రలో మత్తు ఉన్న సమయంలో చేతిలో గన్ ఉండేసరికి ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయని అంటున్నారు.

తాజాగా మైనేలో ఓ దుండగుడు విచక్షణారహితంగా జరిపిన సామూహిక కాల్పుల్లో సుమారు 18 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మరో 60 మందికి పైగా పౌరులు గాయపడ్డారు. లెవిస్టన్‌ లో జరిగిన ఈ కాల్పుల ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తి ఈ సందర్భంగా ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇందులో భాగంగా.. గతంలో యునైటెడ్ స్టేట్స్ ఆర్మీలో పనిచేసిన వ్యక్తే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు సెమీ ఆటోమెటిక్‌ రైఫిల్‌ తో కాల్పులు జరిపినట్లు సీసీ టీవీ ఫుటేజ్‌ ద్వారా తెలుస్తోంది. అమెరికా మొత్తాన్ని ఉలిక్కిపడేట్టు చేసిన ఈ ఘటనపై ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్‌ స్పందించారు. ఈ సందర్భంగా ఆయుధాన నిషేధ చట్టం ప్రస్థావన తీసుకొచ్చారు.

అవును... మైనేలో జరిగిన వంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రమాదకర ఆయుధాలపై నిషేధం విధించడం మంచిదని, దీనికి సంబంధించిన బిల్లును ఆమోదించడానికి రిపబ్లికన్‌ పార్టీ నేతలు సహకరించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కోరారు. ఇందులో భాగంగా... అసల్ట్‌ వెపన్‌ బ్యాన్‌ బిల్లును తెరపైకి తెచ్చారు.

ఈ నేపథ్యంలో అమెరికన్‌ ప్రజలను రక్షించే బాధ్యతను నెరవేర్చాలని కాంగ్రెస్‌ లోని రిపబ్లికన్‌ సభ్యులను కోరుతున్నట్లు చెప్పిన బైడెన్... ఇప్పటికైనా ప్రమాదకర ఆయుధాలు, అధిక సామర్థ్యం గల మ్యాగజైన్‌ లపై నిషేధం బిల్లును ఆమోదించడానికి తమకు సహకరించండని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

కాగా... అమెరికా ప్రజల భద్రత దృష్ట్యా అక్కడి కాంగ్రెస్‌ 1994లో పదేళ్ల కాలవ్యవధితో ఫెడరల్‌ అసల్ట్‌ వెపన్‌ బ్యాన్‌ (ప్రమాదకర ఆయుధాల నిషేధం) చట్టాన్ని ఆమోదించిన సంగతి తెలిసిందే. 2004 తర్వాత ఈ చట్టాన్ని మళ్లీ అమలు చేసేందుకు ప్రయత్నాలు జరిగినప్పటికీ అది కార్యరూపం మాత్రం దాల్చలేదు.

ఈ క్రమంలో తాజాగా మైనే కాల్పుల ఘటన అమెరికాను ఒక్కసారిగా ఉలిక్కిపడిన నేపథ్యంలో బైడెన్‌ ఈ బిల్లు ప్రస్తావన తీసుకొచ్చారు. మరి ఈ బిల్లు, బైడెన్ అభ్యర్థనపై రిపబ్లికన్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి!

Tags:    
  • Joebiden 
  • Assaultweaponsban 
  • Gunculture 
  • America 
  • Gunviolence 
  • Maineshooting 
  • Biden 
  • Usagunculture 

Similar News

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

Copyright @2026

Powered by Blink CMS