విజయ్ సాయిని అంత మాట అనేసిన అంబటి

వైసీపీ మాజీ నేత, మాజీ రాజకీయ నాయకుడు అయిన వి విజయసాయిరెడ్డి గురించి రాజకీయాల పట్ల అవగాహన ఉన్న వారికి బాగానే తెలుసు.;

Update: 2025-11-29 01:13 GMT

వైసీపీ మాజీ నేత, మాజీ రాజకీయ నాయకుడు అయిన వి విజయసాయిరెడ్డి గురించి రాజకీయాల పట్ల అవగాహన ఉన్న వారికి బాగానే తెలుసు. ఆయన దాదాపుగా పుష్కర కాలం పాటు ఏపీ రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. అంతే కాదు వైసీపీలో ఆయన చురుకైన పాత్ర వహించారు. వైసీపీ స్థాపకుడు వైఎస్ జగన్ అయితే ఆయన తరువాత విజయసాయిరెడ్డే అని ఒక దశలో అనిపించుకున్నారు. పార్టీలో రెండు సార్లు రాజ్యసభ మెంబర్ అయ్యారు, ఈ ఘనత మరో నేతకు దక్కలేదు, అంతే కాదు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉన్నారు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా ఆయన కీలకంగా ఢిల్లీలో వ్యవహరించేవారు.

గ్యాప్ తరువాతనే :

అయితే విజయసాయిరెడ్డి ప్రాభవం మెల్లగా తగ్గుతూ వచ్చింది. అది కాస్తా 2024 ఎన్నికల తరువాత పూర్తిగా మారింది. 2025 జనవరి 25న విజయసాయిరెడ్డి వైసీపీకి రాజకీయాలకు గుడ్ బై కొట్టేదాకా ఈ పరిణామాలు దారితీశాయి. అయితే తాజాగా విజయసాయిరెడ్డి శ్రీకాకుళం పర్యటనలో వైసీపీ అధినాయకత్వం మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. కోటరీ వల్లనే వైసీపీ అధినేతతో తనకు దూరం పెరిగింది అన్నట్లుగా ఆయన పరోక్షంగా చెప్పారు. కోటరీ మాటలు వినవద్దు అని ఆయన జగన్ కి సూచించారు.

అంబటి కామెంట్స్ :

ఈ నేపధ్యంలో విజయసాయిరెడ్డి మీద వైసీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఒక వీడియో బైట్ రిలీజ్ చేస్తూ సంచలన వ్యాఖ్యలే చేశారు విజయసాయిరెడ్డి వంటి వారు పార్టీని వీడిపోతారని కలలో కూడా అనుకోలేదని అన్నారు. వైసీపీ ఘోర ఓటమి ఒక ఎత్తు అయితే పార్టీలో ఉన్న నేతలు బయటకు వెళ్ళడం వేరే పార్టీలలో చేరడం వైసీపీని వీక్ చేయాలని చూడడం మరో ఎత్తు అని ఆయన వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డి హఠాత్తుగా పార్టీఎకి దూరం అయ్యారని ఆయన వేరే పార్టీలో చేరలేదు కానీ ఆయన మాత్రం వైసీపీకి దూరం అయిపోయారు అన్నారు.

రాజకీయ నేత కాదా :

అదే సమయంలో విజయసాయిరెడ్డి గురించి హాట్ కామెంట్స్ అంబటి రాంబాబు చేశారు. విజయసాయిరెడ్డి వైఎస్సార్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అని, ఆయన ఒక చార్టర్ అకౌంటెంట్ అని, ఆ విధంగా జగన్ కి కూడా ఆయన సన్నిహితుడు కావడంతో పార్టీలో పెద్ద పీట వేశారు అని గుర్తు చేశారు. వైసీపీ విజయసాయిరెడ్డికి ఏ రకమైన అన్యాయం చేయలేదని పైగా ఎన్నో పదవులు ఇచ్చిందని అంబటి రాంబాబు గుర్తు చేశారు నిజానికి చూస్తే విజయ్ సాయిరెడ్డి రాజకీయ నాయకుడే కాదని అంబటి రాంబాబు హాట్ కామెంట్స్ చేశారు. ఆయనను జగన్ రాజకీయంగా కీలకంగా చేశారు అని తన తరువాత ఆయనే అన్న భావన కూడా కల్పించారు అని అంబటి అన్నారు.

కొత్త పార్టీ నేపధ్యంలో :

ఇక విజయసాయిరెడ్డి తాజాగా శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ అవసరం అనుకుంటే కొత్త పార్టీ తాను పెడతాను అని ప్రకటించారు మరి దానికి కౌంటర్ అన్నట్లుగానే అంబటి రాంబాబు వ్యాఖ్యలు ఉన్నాయని అంటున్నారు. విజయసాయిరెడ్డి రాజకీయ నాయకుడే కారని అంబటి పేర్కోనడం అంటే అది కీలకమైన వ్యాఖ్యగానే చూడాలని అంటున్నారు. మొత్తం మీద చూస్తే చాలా కాలం తరువాత వైసీపీ నుంచి ఓపెన్ గా ఒక సీనియర్ నేత విజయసాయిరెడ్డి మీద గట్టిగా ఘాటుగా స్పందించారు. మరి దీనిని విజయసాయిరెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News