ఆ బ్రాండ్ పేరు వాడుకోవటానికి రూ.254 కోట్లు ఇచ్చిన అంబానీ

ముకేశ్ అంబానీ నాయకత్వంలో రిలయన్స్ సంస్థ అంతకంతకూ విస్తరిస్తూ ముందుకు వెళుతోంది.

Update: 2023-12-22 03:49 GMT

ఓవైపు జోరుగా వ్యాపారాలు చేస్తూనే మరోవైపు తమ వ్యాపార పరిధిని అంతకంతకూ విస్తరించే విషయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రదర్శించే దూకుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ముకేశ్ అంబానీ నాయకత్వంలో రిలయన్స్ సంస్థ అంతకంతకూ విస్తరిస్తూ ముందుకు వెళుతోంది. ఇదిలా ఉంటే.. ఈ మధ్యన మెట్రో క్యాష్ అండ్ క్యారీని సొంతం చేసుకోవటం తెలిసిందే.

జర్మన్ మల్టీ నేషనల్ మెట్రో ఏజీ హోల్ సేల్ ఛైన్ ను రిలయన్స్ సొంతం చేసుకోవటం తెలిసిందే. ఈ డీల్ కోసం రూ.2850 కోట్ల మొత్తాన్ని రిలయన్స్ చెల్లించింది. ఈ ఏడాది సెప్టెంబరు వరకు సాగిన చెల్లింపుల పరంపరకు సంబంధించిన ఒక అంశం ఆసక్తికరంగా మారింది. మెట్రో ఇండియా అమ్మకంలో భాగంగా ఆ బ్రాండ్ ను వాడుకోవటానికి వీలుగా రిలయన్స్ సంస్థ ముందస్తుగా రూ.254 కోట్లు చెల్లించిన వైనం తాజాగా బయటకు వచ్చింది.

నిజానికి 2022 డిసెంబరు 22న మెట్రో ఇండియాను తమకు అమ్మేందుకు వీలుగా ఆ సంస్థతో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా 31 హోల్ సేల్ స్టోరులు.. మొత్తం రియల్ ఎస్టేట్ పోర్ట్ ఫోలియో తోొ సహా మెట్రో ఇండియాను రిలయన్స్ కు అమ్మేందుకు వీలుగా నిర్ణయం తీసుకున్నారు. ఒప్పందంలో భాగంగా డీల్ను 2023 మే 11 నాటికి విజయవంతంగా పూర్తి చేశారు. తీవ్రమైన పోటీ నేపథ్యంలో మెట్రో మాత్రసంస్థ వ్యూహానికి అనుగుణంగా లేని కారణంగా రిలయన్స్ కు అమ్మేసినట్లుగా చెబుతారు. అయితే.. ఈ డీల్ లో మెట్రో పేరును వాడుకోవటం కోసం అంబానీ ఇంత భారీగా ఖర్చు చేయటం మార్కెట్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. అంబానీనా మజాకానా?

Tags:    

Similar News