చూస్తూ ఊరుకుంటే వైసీపీ చేటే!
వాస్తవానికి వైసీపీ గత ఏడాది ఎన్నికల్లో ఓడిపోయిన నాటి నుంచి ఇప్పటి వరకు.. పుంజుకోలేదు.. సరికదా.. సరైన వ్యూహాలు లేకుండా వేస్తున్న అడుగుల కారణంగా.. మరింత దెబ్బతింటోంది.;
అసలే జారుడు బండపై విన్యాసాలు చేస్తున్న వైసీపీకి.. తాజాగా జరిగిన పరిణామం.. మరింత శరాఘాతంగా మారింది. వైసీపీ అదినేత జగన్ సొంత మీడియా సాక్షిలో జరిగిన అమరావతిపై డిబేట్‌లో ఒక జర్నలిస్టు.. చేసిన వ్యాఖ్యలు తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి. అమరావతి రాజధాని ప్రాంతంలో.. `అలాంటి` మహిళలు ఉంటారని.. ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడమే కాకుండా.. రాజధాని ప్రాంత రైతులను తీవ్ర ఆగ్రహానికి కూడా గురిచేశాయి. శనివారం రోజు రోజంతా కూడా.. ఇదే వ్యవహారం నడిచింది. ఏ ఇద్దరు కలిసినా.. ఈ వ్యవహారంపైనే చర్చించుకున్నారు.
ఇక, రాజధాని రైతులు... మహిళలు.. పోలీసులకు ఫిర్యాదులు చేయడంతోపాటు.. ఈ వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు, ఈ చర్చను జరిపిన మరో జర్నలిస్టుల ఫొటోలను చెప్పులతో కొట్టడంతోపాటు.. తీవ్రంగా తిట్టిపోశారు. అదేసమయంలో కొందరు మహిళలు తుళ్లూరు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. వాస్తవానికి ఇది ఉద్దేశ పూర్వకంగా జరిగిందా.. యాదృచ్ఛికంగా జరిగిందా? అనేది పక్కన పెడితే.. జరిగిన దానిని మాత్రం వైసీపీకి మద్దతు దారులుగానో.. సానుభూతి పరులుగానో ఉన్నవారు కూడా సహించలేని, సమర్థించలేని పరిస్థితి ఏర్పడింది. పైగా.. పార్టీకి ఇది మరింతగా డ్యామేజీ చేసింది.
వాస్తవానికి వైసీపీ గత ఏడాది ఎన్నికల్లో ఓడిపోయిన నాటి నుంచి ఇప్పటి వరకు.. పుంజుకోలేదు.. సరికదా.. సరైన వ్యూహాలు లేకుండా వేస్తున్న అడుగుల కారణంగా.. మరింత దెబ్బతింటోంది. పార్టీ అధినేత జగనే వ్యూహాలకు పదును పెట్టకుండా ఎవరో ఇచ్చిన సలహాలను ఇప్పటికీ పాటిస్తున్నారన్న చర్చ కూడా సాగుతోంది. ఏదో ఓటు బ్యాంకు కోసం.. ఆయన ఇటీవల రౌడీ షీటర్ల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబాలను పరామర్శించడం ఎలాంటి సానుభూతిని తీసుకురాకపోగా.. సొంత పార్టీలోనే వెగటు పుట్టించింది. దీనిపై సీనియర్లు కూడా ఆవేదన వ్యక్తం చేశారు.
``మా వోడికి ఎవరు సలహాలు ఇస్తున్నారో.?`` అంటూ.. ఒకరిద్దరు సీనియర్ నాయకులు నోరెళ్ల బెట్టారు. ఇప్పుడు ఏకంగా సొంత మీడియాలోనే అమరావతి రాజధాని మహిళలపై తీవ్ర ఆరోపణలు చేయడం.. ఏదో చూసి.. వచ్చినట్టు వారిపై అసబద్ధమైన ఆరోపణలు గుప్పించడంతో సభ్య సమాజం కూడా ఏవగించుకునే పరిస్థితి వచ్చింది. జారుబండపై దొర్లాడుతున్న పార్టీ.. ఇప్పుడు మురికి కూపంలోకి జారుకునే పరిస్థితికి చేరుకుంది. తాజాగా జరిగిన డ్యామేజీ విషయాన్ని కూడా జగన్ లైట్ తీసుకుంటే.. ఇక, ఆ పార్టీని కాపాడే వారు.. సమర్థించేందుకు ముందుకు వచ్చేవారు కూడా కనిపించరు.
ఆయనే స్వయంగా రంగంలోకి దిగి మహిళలకు క్షమాపణలు చెప్పి.. సదరు చర్చకు కారణమైన వారిపై చర్చలు తీసుకుంటేనే తప్ప.. జగన్ పరువు, పార్టీ పరువు నిలబడుతుందని.. పరిశీలకులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ప్రత్యర్థులకు అవకాశం తప్పించినట్టు అవుతుందని కూడా సూచిస్తున్నారు. మరి ఆయన ఏం చేస్తారో చూడాలి.