లోకేష్ ట్విస్ట్.. కోలీవుడ్ ఫ్యాన్స్ డీకోడింగ్..!

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కూలీ సినిమా తర్వాత ఎవరితో మూవీ చేస్తాడా అన్న సస్పెన్స్ ఇన్నాళ్లు ఉంది.;

Update: 2026-01-18 04:42 GMT

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కూలీ సినిమా తర్వాత ఎవరితో మూవీ చేస్తాడా అన్న సస్పెన్స్ ఇన్నాళ్లు ఉంది. ఐతే ఎవరు ఊహించని విధంగా మన పుష్ప రాజ్ అదే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా లాక్ చేసుకున్నాడు. అల్లు అర్జున్, లోకేష్ కనకరాజ్ ఈ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ తమిళ దర్శకుడు అట్లీ తో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా కూడా భారీ రేంజ్ లో వస్తుంది.

లోకేష్ కనకరాజ్ బన్నీతో..

అట్లీ మాత్రమే కాదు నెక్స్ట్ సినిమా కూడా అల్లు అర్జున్ తమిళ దర్శకుడికే అవకాశం ఇచ్చాడు. అల్లు అర్జున్ సెలక్షన్ ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. ఐతే లోకేష్ కనకరాజ్ మాత్రం బన్నీతో సినిమాకు సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నట్టు తెలుస్తుంది. కూలీ సినిమా తర్వాత లోకేష్ కనకరాజ్ అసలైతే ఖైదీ సీక్వెల్ చేస్తాడని డిస్కషన్ వచ్చింది. కార్తి కూడా ఖైదీ 2కి రెడీ అన్నట్టుగానే కనిపించాడు.

లోకేష్ కనకరాజ్ మాత్రం సైలెంట్ గా అల్లు అర్జున్ కి కథ వినిపించి ప్రాజెక్ట్ ఓకే చేసుకున్నాడు. ఖైదీ 2 సినిమా ఏమైంది ఏంటన్నది క్లారిటీ లేదు. కార్తిని ఈమధ్యలో ఖైదీ 2 గురించి అడిగితే అది డైరెక్టర్ నే అడగాలి అని ఆన్సర్ ఇచ్చాడు. అల్లు అర్జున్ తర్వాత అయినా ఖైదీ 2 చేస్తాడా లేదా ఆ ప్రాజెక్ట్ పూర్తిగా నిలిచిపోయిందా అన్నది తెలియాల్సి ఉంది.

తమిళ పరిశ్రమకు 1000 కోట్లు ఇచ్చే డైరెక్టర్..

తమిళ పరిశ్రమకు 1000 కోట్లు ఇచ్చే డైరెక్టర్ గా లోకేష్ పేరు బాగా వినిపించింది. కూలీతో అది సాధ్యమవుతుంది అని బజ్ వచ్చినా ఆఫ్టర్ మూవీ రిలీజ్ డిజప్పాయింట్ చేసింది. కూలీ నిరుత్సాహపరిచింది కాబట్టే లోకేష్ సినిమాల విషయంలో భారీ మార్పులు వచ్చాయి. అమీర్ తో ఒక సినిమా, కమల్ హాసన్, రజనీకాంత్ మల్టీస్టారర్, ఖైదీ 2 ఇలా ఇవన్నీ మిస్ అయ్యాయి.

లోకేష్ కనకరాజ్ ప్లానింగ్ లో మార్పు అతనికి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి. అల్లు అర్జున్ మాత్రం లోకేష్ సినిమా కోసం సిద్ధం అవుతున్నాడు. మరి ఈ సినిమా ఎలాంటి కథతో వస్తుంది.. ఈ కాంబో ఎలాంటి మ్యాజిక్ చేస్తుంది అన్నది చూడాలి. ఐతే కోలీవుడ్ స్టార్స్ ని వదిలి లోకేష్ ఇలా టాలీవుడ్ హీరోతో లోకేష్ సినిమా చేయడం సంథింగ్ స్పెషల్ గా ఉంది. అల్లు అర్జున్ సినిమాతో తిరిగి ఫాం లోకి రావాలని చూస్తున్న లోకేష్ కనకరాజ్ కి తెలుగు ఆడియన్స్ నుంచి మాత్రం బీభత్సమైన సపోర్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. లోకేష్ లిస్ట్ లో అల్లు అర్జున్ మాత్రమే కాదు ప్రభాస్, ఎన్టీఆర్ లాంటి స్టార్స్ కూడా ఉన్నారు.

Tags:    

Similar News