17 ఏళ్ల కుర్రాడి సరదా వీడియో.. ఆ భయానక విషాదానికి సజీవ సాక్ష్యం

విన్నంతనే విషాదానికి కూరుకుపోయేలా చేసిన ఎయిరిండియా విమాన ప్రమాద ఉదంతం గురించి తెలిసిందే.;

Update: 2025-06-15 05:42 GMT

విన్నంతనే విషాదానికి కూరుకుపోయేలా చేసిన ఎయిరిండియా విమాన ప్రమాద ఉదంతం గురించి తెలిసిందే. ఈ దారుణ దుర్ఘటనకు సంబంధించిన ఉదంతాలు ప్రతి ఒక్కరిని విషాదానికి గురి చేస్తున్నాయి. అహ్మదాబాద్ లో చోటు చేసుకున్న ఈ విషాదంతోఅందరిని కలిచివేస్తోంది. అయితే.. ఈ ఘోర విషాదానికి సజీవ సాక్ష్యంగా నిలిచే వీడియో ఒకటి క్షణాల్లో వైరల్ గా మారటం తెలిసిందే. ఈ దారుణానికి సంబంధించిన వార్తల వేళ.. ఈ వీడియోను ప్లే చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇంతకూ ఈ వీడియోను తీసిందెవరు? అసలు ఆ వీడియోను ఎందుకు ఘూట్ చేశారు? లాంటి సందేహాలు వ్యక్తమైన పరిస్థితి. దీనికి సమాధానం తాజాగా లభించింది. ఈ వీడియోను తీసింది పదిహేడేళ్ల కుర్రాడిగా గుర్తించిన పోలీసులు అతడి నుంచి వాగ్మూలాన్ని రికార్డు చేశారు. ఎయిర్ పోర్టుకు సమీపంలోని అద్దె ఇంట్లో అతడి కుటుంబం ఉంటుంది. అతడి పేరు వాసు (మైనర్ కారణంగా పేరు మార్చటం జరిగింది). ఈ కుర్రాడికి టేకాఫ్ అయ్యే విమానాల వీడియోలు తీయటం సరదా.

ఇదే క్రమంలో జూన్ 12న వీడియోలు తీస్తున్న సమయంలో ఊహించని విధంగా ఎయిరిండియా విమాన కూలిన ఘటన చోటు చేసుకుంది. వీడియో రికార్డు మొదలైన పద్నాలుగు సెకన్లకే విమానం కుప్పకూలినట్లుగా వాసు చెప్పాడు. ఈ ఘటనను కళ్లారా చూసిన తాను తీవ్రంగా భయపడినట్లుగా మీడియాకు చెప్పాడు. ‘వీడియో రికార్డు మొదలు పెట్టిన 14 సెకన్లకే విమానం కుప్పకూలింది. ఈ విషయాన్ని నా సోదరికి చెప్పా. ఆమెకే ఈ వీడియోను మొదట చూపించా. ఆమె మా నాన్నకు చెప్పింది. ఆ విమానం కూలిపోతుందన్న విషయం నాకు తెలియదు’’ అని వెల్లడించాడు.

ఈ వీడియో తీసిన తన సోదరుడి మానసిక పరిస్థితి గురించి ఆమె సోదరి మీడియాతో షేర్ చేసుకున్నారు. ‘ఈ ఘటన అత్యంత ప్రమాదకరంగా మారటంతో అక్కడ ఉండకూడదని ఆర్యన్ అనుకున్నాడు. భయంతో సరిగా మాట్లాడలేకపోయాు. ఆ రాత్రంతా మేల్కొనే ఉన్నాడు. ఏమీ తినలేదు. మౌనంగా ఉండిపోయాడు’ అని పేర్కొన్నారు. వీడియో తీసిన ఆర్యన్ గురించి ఇంటి యజమాని మాట్లాడుతూ.. ఆ కుర్రాడు తీవ్ర భయాందోళనలకు గురైనట్లుగా చెప్పారు.

అయితే.. ఆర్యన్ ను పోలీసులు అరెస్టు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి వేళ పోలీసులు స్పష్టత ఇచ్చారు. వీడియో తీసిన మైనర్ ను అరెస్టు చేసినట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని.. వీడియో చిత్రీకరణకు సంబంధించిన వివరాల్ని సదరు బాలుడే వెల్లడించినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. తండ్రితో పాటు స్టేషన్ కు వచ్చి తన స్టేట్ మెంట్ ను ఇచ్చాడని.. అనంతరం తన తండ్రితో వెళ్లిపోయినట్లుగా చెప్పారు. ఎలాంటి అరెస్టులు జరగలేదని స్పష్టం చేశారు.

Tags:    

Similar News