ప్రమాద స్థలంలో గుజరాత్ ఏటీఎస్... డీవీఆర్ స్వాధీనం!

ఈ సమయంలో విమాన శిథిలాల నుంచి గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు శుక్రవారం డిజిటల్ వీడియో రికార్డర్ (డీవీఆర్) ను స్వాధీనం చేసుకున్నారు.;

Update: 2025-06-13 09:51 GMT
ప్రమాద స్థలంలో గుజరాత్ ఏటీఎస్... డీవీఆర్ స్వాధీనం!

అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 265 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో.. ఇది దేశ చరిత్రలోనే అత్యంత ఘోర విమాన ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిందని చెబుతున్నారు. ఈ సమయంలో.. ఇంత ఘోర ప్రమాదానికి గల కారణం ఏమై ఉంటుందనేది ఇప్పుడు కీలకంగా మారింది. ఈ సమయంలో గుజరాత్ ఏటీఎస్ ఒక డీవీఆర్ ని స్వాధీనం చేసుకుంది.

అవును... అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిరిండియా విమానం కుప్ప కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ సమయంలో విమాన శిథిలాల నుంచి గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు శుక్రవారం డిజిటల్ వీడియో రికార్డర్ (డీవీఆర్) ను స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా స్పందించిన అధికారులు.. ఇది శిథిలల నుంచి తాము స్వాధీనం చేసుకున్న డీవీఆర్ అని తెలిపారు. త్వరలో ఇక్కడికి ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్.ఎస్.ఎల్) బృందం వస్తుందని అన్నారు.

మరోవైపు... విమాన ప్రమాదానికి సంబంధించిన కీలక సమాచారం అందించే బ్లాక్ బాక్స్ ఇంకా లభించలేదని.. అయితే, ఇప్పటికే బ్లాక్ బాక్స్ దొరికినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా ఊహాగానాలు మాత్రమే అని ఎయిరిండియా ఓ ప్రకటనలో తెలిపింది.

కాగా... బ్లాక్ బాక్స్ అనేది విమానంలోని కేవలం ఒక పరికరం కాదు.. వాస్తవానికి ఇందులో ఫ్యాక్ చేయబడిన రెండు భాగాలు ఉంటాయి. అందులో ఒకటి ఫ్లైట్ డేటా రికార్డర్ (ఎఫ్.డీ.ఆర్). ఇది విమానం వేగం, ఎత్తు, ఇంజిన్ పనితీరు, నావిగేషన్ వివరాలు వంటి సంకేతిక డేటాను రికార్డ్ చేస్తుంది.

ఇక రెండోది.. కాక్ పీట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్). ఇది పైలట్ సంభాషణలు, ఫ్లైట్ డెక్ నుంచి వచ్చే ఇతర శబ్ధాలతో సహా కాక్ పీట్ నుంచి ఆడియోను సేవ్ చేస్తుంది. ఈ రికార్డ్లు కలిసి 25 గంటలకు పైగా విమాన డేటాను, రెండు గంటల వాయిస్ రికార్డింగులను నిల్వ చేయగలవు.

Tags:    

Similar News