బోయింగ్ విమానాల్లో తనిఖీలు స్టార్ట్.. ఏమి తేలిందంటే..?

అవును... డీజీసీఏ ఆదేశాలకు అణుగుణంగా తమ సంస్థకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానాల్లో భద్రతా తనిఖీలు చేపట్టింది ఎయిరిండియా.;

Update: 2025-06-14 18:03 GMT

అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లే ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలోని మృతుల సంఖ్య విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది, బయట ఉన్నవారిలో 33 మంది కలిసి మొతం 274కి చేరిన పరిస్థితి. అప్పటికే కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిరిండియాకు ఆదేశాలు జారీ చేసింది.

ఇందులో భాగంగా... ఎయిరిండియా వద్ద ఉన్న బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానాల్లొ విస్తృత తనిఖీలు చేపట్టాలని పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) శుక్రవారం ఆదేశించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఎక్స్ లోనూ పోస్ట్ చేసింది. ఈ సమయంలో.. ఆ ఆదేశాలకు అనుగుణంగా సంస్థకు చెందిన బోయింగ్ విమానాల్లో తనిఖీలు చేపట్టింది ఎయిరిండియా.

అవును... డీజీసీఏ ఆదేశాలకు అణుగుణంగా తమ సంస్థకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానాల్లో భద్రతా తనిఖీలు చేపట్టింది ఎయిరిండియా. ఈ క్రమంలో తమ వద్ద ఉన్న విమానాల్లో తొమ్మిదింటిలో భద్రతా తనిఖీలు పూర్తి చేసినట్లు ఎయిరిండియా వెల్లడించింది. మిగిలిన 24 డ్రీమ్మ్ లైనర్ల భద్రతా తనిఖీలు త్వరలోనే పూర్తిచేయనున్నట్లు వెల్లడించింది.

ఈ సందర్భంగా స్పందించిన ఎయిరిండియా... డీజీసీఏ ఆదేశాల మేరకు బ్భద్రతా తనిఖీలు పూర్తి చేసే ప్రక్రియను ఎయిరిండియా కొనసాగిస్తోందని పేర్కొంది. విదేశాల్లో ఉన్నా విమానాలు తిరిగి భారత్ కు రాగానే తనిఖీలు చేస్తున్నామని తెలిపింది. ఈ క్రమంలో ఇప్పటికే తొమ్మిది విమానాలకు తనిఖీలు పూర్తి చేయగా.. మరో 24 విమానాలకు గడువులోగా పూర్తిచేస్తామని వెల్లడించింది.

వాస్తవానికి తమ వద్ద ఉన్న కొన్ని బోయింగ్ విమానాల్లో కొన్నింటికి తనిఖీల్లో అధిక సమయం పట్టే అవకాశం ఉందని.. దీంతో, సుదీర్ఘ ప్రయాణ మార్గల్లో నడిచే విమానాలకు ఆలస్యం కావొచ్చని.. వీటికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రయాణికులకు తెలియజేస్తామని వెల్లడించింది. ఎయిర్ పోర్ట్ కు వెళ్లేముందు విమానాల స్టేటస్ ను ముందుగానే చెక్ చేసుకోవాలని ప్రయాణికులకు సూచిస్తున్నామని పేర్కొంది.

కాగా... ఎయిరిండియా విమానయాన సంస్థ వద్ద ప్రస్తుతం బోయింగ్ 787-8 విమానాలు 26 ఉండగా.. బోయింగ్ 787-9 విమానాలు 7 ఉన్నాయి. వీటిలో మొత్తం తొమ్మిదింటికి వన్-టైమ్ భద్రతా తనిఖీలు పూర్తి చేసినట్లు సంస్థ వెల్లడించింది. అయితే ఆ తనిఖీల్లో ఏమి తేలింది మొదలైన వివరాలకు సంబంధించిన నివేదిక నేరుగా డీజీసీఏ కే ఇవ్వనున్నారని అంటున్నారు!

Tags:    

Similar News