బిగ్ బ్రేకింగ్... ఢిల్లీలో ఎయిరిండియా విమానంలో మంటలు!

ఇదే సమయంలో... ప్రయాణీకులు, సిబ్బంది సాధారణంగానే దిగి సురక్షితంగా ఉన్నారని.. ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు కోసం విమానం నిలిపివేశామని అని ఎయిరిండియా 'ఎక్స్‌'లో పేర్కొంది.;

Update: 2025-07-22 13:53 GMT

భారతదేశంలో మరో విమానం టెన్షన్ పెట్టింది. హస్తినలో ఎయిరిండ్డియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఇందులో భాగంగా... హాంకాంగ్‌ నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చిన విమానం ఏఐ-315 ల్యాండింగ్‌ అయిన కాసేపటికే ఆగ్జలరీ పవర్‌ యూనిట్‌ (ఏపీయూ) లో మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనపై ఎయిరిండియా ‘ఎక్స్’ వేదికగా స్పందించింది.

అవును... హాంకాంగ్ నుండి వచ్చి ఢిల్లీలో ల్యాండ్ అయిన కొద్దిసేపటికే ఎయిరిండియా విమానంలో మంటలు చెలరేగాయని ఎయిర్‌ లైన్స్ ప్రతినిధి తెలిపారు. విమానానికి కొంత నష్టం జరిగిందని, తదుపరి దర్యాప్తు కోసం విమానం నిలిపివేయబడిందని.. ఈ ఘటనలో ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారని ప్రతినిధి ఒకరు తెలిపారు.

దీనిపై ‘ఎక్స్’ వేదికగా స్పందించిన ఎయిరిండియా... హాంకాంగ్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఏఐ315 విమానం ల్యాండ్ అయిన కొద్దిసేపటికే ఆగ్జలరీ పవర్ యూనిట్ లో మంటలు చెలరేగాయని తెలిపింది. ప్రయాణీకులు దిగడం ప్రారంభించిన వెంటనే ఈ ఘటన జరిగిందని.. ఈ ఘటనలో విమానం స్వల్పంగా దెబ్బతిందని వెల్లడించింది.

ఇదే సమయంలో... ప్రయాణీకులు, సిబ్బంది సాధారణంగానే దిగి సురక్షితంగా ఉన్నారని.. ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు కోసం విమానం నిలిపివేశామని అని ఎయిరిండియా 'ఎక్స్‌'లో పేర్కొంది.

మరోవైపు... 160 మంది ప్రయాణికులతో ఢిల్లీ - కోల్‌ కతా ఎయిరిండియా విమానం టేకాఫ్ సమయంలో సాంకేతిక సమస్య గుర్తించినట్లు ఎయిర్ లైన్స్ ప్రతినిధి ఒకరు ధృవీకరించారు. అనంతరం.. ఢిల్లీ విమానాశ్రయంలో టేకాఫ్‌ ను రద్దు చేసుకున్నట్లు తెలిపారు. ఆ తర్వాత తప్పనిసరి భద్రతా తనిఖీల కోసం ఏఐ2403 విమానం నిలిపివేయబడిందని వెల్లడించారు.

Tags:    

Similar News