ఏఐ 9248 విమానంలో సాంకేతిక లోపం.. ఎయిరిండియాకు ఏమైంది?

అవును... తాజాగా ఎయిరిండియా కు చెందిన ఏఐ 9248 విమానం ఈ రోజు సాయంత్రం 4:45 గంటలకు బ్యాంకాక్ నుంచి సూరత్ కు బయలుదేరాల్సి ఉంది.;

Update: 2025-06-13 13:08 GMT

అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం గురువారం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఏకంగా 265 మంది మృతి చెందారు. దీంతో.. భారతదేశంలో జరిగిన అత్యంత ఘోరమైన విమాన ప్రమాదాల్లో దీన్ని ఒకటిగా చెబుతున్నారు. మరోవైపు ఎయిరిండియా విమానాల ఫిట్ నెస్ పై చర్చ జరుగుతుందనే చర్చ తెరపైకి వచ్చింది.

అహ్మదాబాద్ లో జరిగిన ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ సమయంలో.. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ కు ప్రయాణించిన ఓ వ్యక్తి.. ఆ విమానం ఫిట్ నెస్ పై పలు సందేహాలు వ్యక్తపరిచారు! ఇందులో భాగంగా ఈ విమానం ఏదో తేడాగా ఉందని, ఏసీ పనిచేయకపోవడం మ్యాగజైన్స్ తో గాలి విసురుకుంటున్నారని తెలిపారు!

ఇదే సమయంలో టచ్ స్క్రీన్ పనిచేయడం లేదని, ఇందులో పలు సాంకేతిక సమస్యలు ఉన్నాయన్నట్లుగా ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. అది కాస్తా వైరల్ గా మారింది. జాతీయ స్థాయిలో మీడియా కవరేజ్ పొందింది. ఈ సమయంలో తాజాగా ఎయిరిండియాకు చెందిన మరో విమానం సాంకేతిక లోపానికి గురైందని తెలుస్తోంది. దీంతో.. ప్రస్తుతానికి ప్రయాణ షెడ్యూల్ మార్చారు.

అవును... తాజాగా ఎయిరిండియా కు చెందిన ఏఐ 9248 విమానం ఈ రోజు సాయంత్రం 4:45 గంటలకు బ్యాంకాక్ నుంచి సూరత్ కు బయలుదేరాల్సి ఉంది. ఆ విమానం రాత్రి 7:45 గంటలకు సూరత్ చేరుకోవాల్సి ఉంది. అయితే... తాజాగా ఆ విమానం రాత్రి 8:50 గంటలకు బ్యాంకాక్ లో బయలుదేరి, రాత్రి 11:37 గంటలకు సూరత్ చేరుకుంటుందని షెడ్యూల్ చేయబడింది.

అయితే... ఇలా సుమారు నాలుగు గంటలు పైగా సమయాన్ని మార్చి షెడ్యూల్ చేయడానికి కారణం.. విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తడమేనని అంటున్నారు. దీనిపై పూర్తి సమాచారం రావాల్సి ఉంది!

కాగా... శుక్రవారం థాయిలాండ్ లోని ఫుకెట్ విమానాశ్రయం నుంచి భారత రాజధాని ఢిల్లీకి బయలుదేరిన ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయని అధికారులు తెలిపిన సంగతి తెలిసిందే! దీంతో.. 156 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఏఐ 379 విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేసినట్లు థాయిలాండ్ ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు!

Tags:    

Similar News