• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Health >  విమానంలో అద్భుతం.....

విమానంలో అద్భుతం.. రెండేళ్ల చిన్నారి ప్రాణం కాపాడిన వైద్యులు!

| అవును... విమానం గాల్లో ఉండగా ఓ చిన్నారికి ఊపిరి ఆగిపోతే.. ఎయిమ్స్ వైద్యులు అద్బుతం చేసి ఆ పాపను బతికించారు.

By - Tupaki Desk
Update: 2023-08-29 03:50 GMT

గాల్లో ఉన్న విమానంలో అద్భుతం జరిగింది. బెంగళూరు - ఢిల్లీ విస్తారా విమానంలో అద్భుతం చోటు చేసుకుంది. శ్వాస ఆగిపోయి మరణం అంచుల దాకా వెళ్లిన ఆ రెండేళ్ల చిన్నారి అద్భుతంగా కోలుకుంది. విమానం గాల్లో ఉండగా ఎయిమ్స్ వైద్యులు అద్బుతం చేసి ఆ పాపను బతికించారు.


అవును... విమానం గాల్లో ఉండగా ఓ చిన్నారికి ఊపిరి ఆగిపోతే.. ఎయిమ్స్ వైద్యులు అద్బుతం చేసి ఆ పాపను బతికించారు. ఆ చిన్నారి అదృష్టం మేరకు అదే విమానంలో ఐదుగురు ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) వైద్యులు ప్రయాణిస్తున్నారు. దీంతో ఆ ఐదుగురూ చిన్నారి విషయంలో అద్భుతం చేశారు.


వివరాళ్లోకి వెళ్తే... విస్తారా ఎయిర్‌ లైన్స్‌ కు చెందిన యూకే-814 విమానం.. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరింది. ఆ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే తల్లిదండ్రులతో కలిసి ప్రయాణిస్తోన్న ఓ రెండేళ్ల చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురైంది.

చిన్నారికి మెడికల్ ఎమర్జెన్సీ అవసరం కాగా.. ఆ విమానంలో ప్రయాణిస్తున్న ఎయిమ్స్ వైద్యులు చిన్నారిని పరీక్షించారు. అప్పటికే పల్స్ పూర్తిగా పడిపోయి.. ఒళ్లంతా చల్లబడిపోయి ఉంది. పరిస్థితి విషమంగా ఉండటంతో అందుబాటులో ఉన్న వనరులతో వైద్యులు వెంటనే చికిత్సను ప్రారంభించారు.


ఇందులో భాగంగా వైద్యులు సీపీఆర్ చేశారు. అనంతరం చిన్నారికి అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాల్సి ఉందని తెలిపారు. దీంతో విమానాన్ని నాగ్‌ పూర్‌ విమానాశ్రయానికి మళ్లించారు. ఎయిర్‌ పోర్ట్ నుంచి నేరుగా నాగ్‌ పూర్ ఎయిమ్స్‌ కు చిన్నారిని తరలించారు.

అనంతరం ఎయిమ్స్‌ లో ఆ చిన్నారికి ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను ఎయిమ్స్ న్యూఢిల్లీ తన అధికారిక ట్విట్టర్ లో వెల్లడించింది. ఇందులో భాగంగా చిన్నారి, వైద్యుల ఫోటోలను షేర్ చేసింది.

డా. నవదీప్ కౌర్ (సీనియర్ అనెస్థీషియా), డా. దమన్‌ దీప్ సింగ్ (కార్డియాక్ రేడియాలజీ), డా. రిషబ్ జైన్ (రేడియాలజీ), డా. ఓషికా (గైనజకాలజిస్ట్), డా. అవిచల్ తక్సక్ (కార్డియాక్ రేడియాలజీ) వైద్యులు విమానంలో అద్భుతం చేశారని తెలిపింది.

#Always available #AIIMSParivar
While returning from ISVIR- on board Bangalore to Delhi flight today evening, in Vistara Airline flight UK-814- A distress call was announced

It was a 2 year old cyanotic female child who was operated outside for intracardiac repair , was… pic.twitter.com/crDwb1MsFM

— AIIMS, New Delhi (@aiims_newdelhi) August 27, 2023
Tags:    
  • Aiims 
  • Newdelhi 
  • Child 
  • Nagpur 
  • Bangalore 
  • Flight 
  • CPR 
  • Politicalnews 

Similar News

Fitness Goals: Building a Strong Body Through Healthy Habits

2026-10-30 11:45 GMT

ప్రపంచంపైకి మరో వైరస్.. అప్రమత్తతే శ్రీరామరక్ష

2026-10-30 05:23 GMT

సుప్రీంకోర్టు అదిలిస్తే తప్ప క్యాన్సర్ మందుల ధరలు తగ్గించరన్న మాట.. భారీగా తగ్గిన ధరలు

2026-10-29 06:35 GMT

వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?

2026-10-27 11:22 GMT

పరుగుల జీవితంలో మానసిక కల్లోలం!

2026-10-15 13:12 GMT

హైదరాబాద్‌లో వ్యాపిస్తున్న ఇన్‌ఫ్లుయెంజా A !

2026-10-13 07:16 GMT

మాన‌వ మెద‌డు ర‌హ‌స్యాల‌ను డీకోడ్ చేసిన సంచ‌ల‌న ప‌రిశోధ‌న‌!

2026-10-10 17:27 GMT

దూరాలు పెరుగుతున్నాయి.. ఒంటరి అవుతున్న మనిషి

2026-10-10 16:58 GMT

రష్యాలో ప్లేగ్ మరణాల కలకలం.. త‌స్స‌దియ్యా అసలు నిజం తెలుసుకోకుండానే!

2026-10-08 07:08 GMT

రష్యాలో మరో మహమ్మారి.. డేంజర్ లో 200 మంది? ప్రపంచానికి భయం

2026-10-05 04:34 GMT

ఈ అలవాట్లు మీకు ఉన్నాయా? అయితే మీకు పిల్లలు పుట్టరు..

2026-10-03 12:44 GMT

న్యూరాలింక్‌తో ఆలోచనలే మాటలయ్యాయి.. మాట కోల్పోయిన వారికి కొత్త ఆశ

2026-09-19 04:53 GMT

Copyright @2026

Powered by Blink CMS